రక్త పీడనం గురించి తప్పు దారి పట్టించే అపోహలు కొన్ని - ambadipudi syamasundar rao

రక్త పీడనం గురించి తప్పు దారి పట్టించే అపోహలు కొన్ని
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ను బట్టి ప్రపంచ జనాభాలో సుమారు ఒక బిలియన్ కన్నా ఎక్కువ మంది హైపర్ టెన్షన్ (అధిక రక్త పీడనం) తో బాధపడుతున్నారు ఆశ్చర్యము ఏమిటి అంటే వీరిలో చాలామందికి ఈ విషయం గురించి సరి అయినా అవగాహన లేకపోవడంతో చాలా మంది అశ్రద్ధ చేస్తూ గుండె జబ్బు, స్ట్రోక్ వంటి ఇతర ప్రమాదాల వైపు ప్రయాణిస్తుంటారు. ఈ పరిస్థితికి ముఖ్య కారణం అధిక రక్త పీడనం గురించి ప్రజల్లో ఉండే అపోహలు. ఈ అపోహలు చాలా మటుకు నిజాలు కావు ఈ అపోహలు అధిక రక్త పీడనం పెద్దవారికి మాత్రమే వస్తుంది లేదా ఇది అంత సీరియస్ సమస్య కాదు లాంటివి ఉన్నాయి.ఇవి నిజాలు కావు కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ ,అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వంటి సంస్థలు ఈ అపోహల గురించి ప్రపంచ వ్యాప్తంగా వీటి వల్ల ప్రజలు ఎంత నష్ట పోతున్నారో ప్రజల్లో అవగాహన పెంచడానికి చాలా సందర్భాల్లో వివరణ ఇచ్చారు వాటిలో కొన్నింటిని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం అటువంటి 9 రకాల అపోహల గురించి యదార్ధాల గురించి తెలుసుకుందాము.ఇలా తెలుసు కోవడం వల్ల అధిక రక్త పీడనం గురించి అవగాహన పెరిగి మనలను మనము లేదా మీ ఆత్మీయులను కాపాడుకోవచ్చు. . .
1.అధిక రక్త పీడనం సీరియస్ సమస్య కాదు:- హైపర్ టెన్షన్ ( అధిక రక్త పెదనము) అనేది అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా సాధారణమైన పూర్తిగా నయం కానీ జబ్బు అని చెప్పవచ్చు. అమెరికన్ హెల్త్ అసోసియేషన్ వారి గణాంకాల ప్రకారం 45%మంది అమెరికన్లు హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నారు అంటే అమెరికా జనాభాలో సగం మంది అన్నమాట. అంతే కాకుండా ఈ జబ్బు ఇతర ఆరోగ్య సమస్యలకు ఊహించని రీతిలో కారణం అవుతుంది కానీ చాలా మంది ఈ హైపర్ టెన్షన్ అనేది పెద్ద సమస్యగా భావించడం లేదు. ఇది నిజం కాదు ఎందుకంటే నిజానికి ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది కొన్ని సందర్భాలలో మరణానికి దారి తీస్తుంది కూడా. హైపర్ టెన్షన్ కాల క్రమేణా రక్త నాళాలను పెద్దవి చేయడం, ఎలాస్టిసిటీ తగ్గడం, అవయవాలకు ఆక్సిజన్ సప్లై తగ్గడం, మెదడు లోని చిన్న చిన్న రక్తనాళాలు చిట్లిపోవడం వంటివి ప్రమాదాలకు దారితీస్తుంది. , ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు అధిక రక్త పీడనం వల్ల హార్ట్ ఎటాక్ లు,హార్ట్ ఫెయిల్యూర్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, ఛాతీ లో నొప్పి, మూత్రపిండాలు దెబ్బ తినడం, వంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి అని తెలియజేస్తున్నారు నేటి ఆరోగ్య సమాచారాన్ని బట్టి హైపర్ టెన్షన్ దృష్టి పై ప్రభావాన్ని చూపడము, లైంగిక పటుత్వం తగ్గడం, మొదలైన సమస్యలు ఏర్పడతాయి అని కూడా తెలియజేస్తున్నాయి. ఏ విధమైన సందేహం లేకుండా ఈ సమస్యలన్నీ కూడా హైపర్ టెన్షన్ అనేది సీరియస్ సమస్య అని చెబుతున్నారు కాబట్టి అధిక రక్త పీడనాన్ని గమనిస్తే అశ్రద్ధ చేయకుండా సీరియస్ ఇష్ష్యు గా భావించి ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి.అవసరమైతే జీవన విధానంలో కూడా మార్పు తెచ్చుకోవాలి.
2.నేను నా ఆహారంలో ఉప్పు ఎక్కువగా వాడను: నేను నా సోడియం లెవెల్స్ ను మేనేజ్ చేస్తున్నాను. అధిక రక్త పీడనం ఉన్నప్పుడు సోడియం తీసుకోవటం చాలా కీలకం. చాలామంది సోడియం ఇంటెక్ అంటే ఆహార పదార్థాలను కలిపి ఉప్పు మాత్రమే అనుకోని ఉప్పును తగ్గిస్తున్నారు. నిజానికి ప్రాసెస్ చేయబడిన ఆహారము ద్వారా మనకు రోజు వారి అవసరమైన సోడియం 40% దాకా అందుతుంది ప్రాసెస్ చేయబడిన ఆహారము అంటే పిజ్జా సాండ్విచ్ బ్రెడ్ ఎగ్ ఆమ్లెట్ మొదలైనవి. ఆహారపదార్దలు ఉప్పు కలపటం తగ్గించటం పూర్తి పరిష్కారం కాదు.కాబట్టి ప్యాకెడ్ ఫుడ్ కొనేటప్పుడు లేబుల్ చూసి కొనండి .ప్రపంచ ఆరోగ్య సంస్థ డైలీ సోడియం ఇంటెక్ ను 5 గ్రాములకు తగ్గించుకోమని సలహా ఇస్తుంది ఈ మాత్రమూ త్యాగము గుండెకు మేలు చేస్తుంది. ఈ రకంగా చేయడం వలన ప్రతి సంవత్సరము 2. 5 మిలియన్ల మరణాలను నివారించవచ్చు.
3. హైపర్ టెన్షన్ అనేది తప్పనిసరి ఇదొక సాధారణమైన అపోహ అధిక రక్త పీడనాన్ని నివారించలేం అన్న అపోహ వయస్సు పెరుగుతున్న వారిలో ఎక్కువగా ఉంటుంది.హైపర్ టెన్షన్ అనేది పెద్దవాళ్లలో సాధారణమైన విషయం ఎందుకంటే అది వయస్సు పెరగడం వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్య. 63%మంది 60 ఏళ్ల పై బడ్డవాళ్లలోను, 33. 2% 40-59 ఏళ్ల వయస్సు వారి లోను, 7. 5% 18-39 ఏళ్ల వయస్సు వారిలో ఈ హైపర్ టెన్షన్ ను గుర్తించారు చాల మంది వాళ్లకు హైపర్ టెన్షన్ తప్పనిసరిగా వస్తుంది అని నమ్ముతున్నారు.ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ కుటుంబంలో పెద్దవాళ్లకు ఉండే ఉంటుంది కాబట్టి.హైపర్ టెన్షన్ అనేది జెనెటిక్ కాంపోనెంట్ మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు,ప్రశాంతమైన జీవనము వంటి మంచి లక్షణాలతో దీనిని అధిగమించవచ్చు.మరియు జానెటిక్ కాంపోనెంట్ ను తగ్గించుకోవచ్చు 2018లో 277,005 రోగుల మీద జరిపిన పరిశోధనలో వెల్లడైన అంశాలు ఏమిటి అంటే వారంతా ఖచ్చితమైన ఆరోగ్య జీవన విధానానికి కట్టుబడి అంటే మంచి ఆహారము,మద్యపానం లిమిట్ గా తీసుకోవడం, మూత్రం ద్వారా తక్కువ సోడియం ను విసర్జించటం తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ కలిగి ఉండటం, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేయడం వంటి పనుల ద్వారా వారిలో రక్త పీడనం అదుపులోకి వచ్చింది దీనిని బట్టి హైపర్ టెన్షన్ అనేది పూర్తిగా నయం కానీ జబ్బు కానీ వయసు తోను,జెనటిక్ రిస్క్ లేకుండా దాన్ని నివారించవచ్చు అని తెలుస్తుంది
4.మగవాళ్ళు మాత్రమే హైపర్ టెన్షన్ తో బాధపడతారు: మనము ఇంతకూ ముందు చెప్పుకున్నట్లుగా మన లైఫ్ స్టైల్ హైపర్ టెన్షన్ విషయంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అదే విధంగా పూర్ డైట్, లో యాక్టివిటీ లెవెల్స్,ఓవర్ వెయిట్ ఇవన్నీ హైపర్ టెన్షన్ పెంచడానికి ఆడవారిలో గాని మగవారిలో గాని సహకరిస్తాయి. 45-64 ఏళ్ల మధ్య వయస్సు ఆడవారు, మగవారు ఇంచుమించు ఒకే రకమైన హైపర్ టెన్షన్ విషయంలో రిస్క్ ను కలిగి ఉంటారు.64 ఏళ్ల తర్వాత ఆడవారిలో మగవారి కన్నా హైపర్ టెన్షన్ రిస్క్ ఎక్కువ మగవారిలో 45 ఏళ్ళు లేదా అంతకన్నా తక్కువ వయస్సులోనే హైపర్ టెన్షన్ రావచ్చు. .
5.బ్లడ్ ప్రెజర్ రీడింగ్ లో రెండు ఉంటాయి అని అందరికీ తెలుసు మొదటిది పైన ఉండే సిస్టోలిక్ కొలత రెండవది క్రింద ఉండే డయాస్టోలిక్ కొలత సిస్టోలిక్ కొలత గుండె కొట్టుకునే టప్పుడు రక్తం సిరల ద్వారా ప్రవహించేటప్పుడు ఉండే పీడనాన్ని తెలియజేస్తుంది. డయాస్టోలిక్ పీడనం హార్ట్ రెస్టింగ్ లో ఉన్నప్పుడు పీడనాన్ని తెలియజేస్తుంది సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ 130 కన్నా ఎక్కువ ఉంటే అధిక రక్తపీడనం భావిస్తారు. అలాగే డయాస్టోలిక్ 80 కన్నా ఎక్కువ ఉన్న హై బిపి అంటారు. చాల సందర్భాల్లో ప్రజలు సిస్టోలిక్ రీడింగ్ పైనే దృష్టి పెడతారు ఎందుకంటే ఇది పెరిగితే హార్ట్ స్ట్రోక్ లేదా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది.కానీ సిస్టోలిక్ రీడింగ్ ఎంత ముఖ్యమో డయాస్టోలిక్ రీడింగ్ కూడా అంతే ముఖ్యము అంతే ప్రమాదం. కాబట్టి సిస్టోలిక్ డయాస్టోలిక్ రీడింగ్ లో మార్పు ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా వైద్యం చేయించుకోవాలి. ఈ రీడింగ్ లలో పెరుగుదల వల్ల అవయవాలు దెబ్బతింటాయి.
6.లో బ్లడ్ ప్రెజర్ పెద్ద సమస్య కాదు : హైపర్ టెన్షన్ (అధిక రక్త పీడనం) గురించి మాట్లాడుకున్నంతగా హైపోటెన్షన్( తక్కువ రక్త పీడనం గురించి మనము మాట్లాడుకోము. కానీ లో బ్లడ్ ప్రెజర్ కూడా ఆందోళన చెందాల్సిన విషయం,లో బ్లడ్ ప్రెజర్ వల్ల మగతగా ఉండటం, కొన్ని సందర్భాలలో స్పృహ తప్పడం, లాంటివి కనిపిస్తూ ఉంటాయి.అంటే ఒక రకంగా అధిక రక్త పీడనం కన్నా ప్రమాదకరమైనదే. ఎందుకంటే సరి అయినా వైద్యం సకాలములో అందక పోతే చనిపోయే ప్రమాదం ఉంది.
7.రెడ్ వైన్ గుండెకు మంచిది అని చాలా మంది అనుకుంటూ నేను రెడ్ వైన్ తీసుకుంటున్నాను కాబట్టి నేను క్షేమము అని కొందరు అనుకుంటూ ఉంటారు.రెడ్ వైన్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన జీర్ణక్రియను ఇంప్రూవ్ చేస్తాయి కాబట్టి హైపర్ టెన్షన్ లాంటి డీజనరేటివ్ జబ్బులు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి.అలా అన్నాము కదా అని రెడ్ వైన్ ను అధికముగా తీసుకో కూడదు. ఈ మధ్య జరిగిన పరిశోధనలను బట్టి రెండు వారాలకు ఒకసారి ఒక గ్లాస్ రెడ్ వైన్ తీసుకుంటే మంచిది అని తెలియజేస్తున్నాయి. రోజుకు ఒక అరగ్లాసు రెడ్ వైన్ తీసుకుంటే అది ఆరోగ్యానికి హాని చేస్తుంది.అమెరికన్ హెల్త్ అసోసియేషన్ వారు,నిత్యం ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటె బ్లడ్ ప్రెజర్ పెరిగి హార్ట్ ఫెయిల్యూర్ స్ట్రోక్, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ వంటివి సంభవించవచ్చు అని తెలియజేస్తున్నారు.ఎందుకంటే ఆల్కహాలిక్ పానీయాలలో షుగర్ అధికముగా ఉండి బరువు పెరగడానికి తోడ్పడుతుంది ఇది బ్లడ్ ప్రెజర్ పై ప్రభావాన్ని చూపుతుంది. .
8. నాకు అధిక రక్త పీడనం గనుక ఉంటే ఆ లక్షణాలు మీకు తెలుస్తాయి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి చాలా మందిలో ఈ లక్షణాలు తెలియవు కాబట్టి దీన్ని సైలెంట్ కిల్లర్ అని అంటూ ఉంటారు. అంటే దురదృష్ట వశాత్తు చాలామందికి ఈ లక్షణాలు తెలియక పోవడం వల్ల వారికి అధిక రక్త పీడనం ఉన్నట్లు గమనించరు తగ్గ మందులు వాడరు ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ రక్త పీడనాన్ని కొలిచి డాక్టర్ చెప్పేదాకా తెలియదు. ఆ విధంగా ఒక్క అమెరికాలోనే సుమారు 11 మిలియన్ల మంది వారికి అధిక రక్త పీడనం ఉన్నట్లు తెలియకుండానే బతికేస్తుంటారు.సాధారణ లక్షణాలు అలసిపోయినట్లు ఉండటం, తల తేలికగా ఉన్నట్లు అనిపించడం, మగతగా ఉండటం, కాస్త అయోమయంగా ఉన్నట్లనిపించటం,వంటి లక్షణాలు కనిపించడానికి కొన్నేళ్లు పడుతుంది. కాబట్టి మీ రక్త పీడనాన్ని రెండు మూడు నెలలకు ఒకసారి చెక్ చేయించుకుంటూ ఉండాలి. మీరు కనుక వయో వృద్ధులు అయినా, మీ వంశములో లేదా కుటుంబీకులకు హైపర్ టెన్షన్ ఉన్న మీరు జాగ్రత్త పడాలి తరచుగా బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలి. .
9.ఎప్పుడైతే రక్త పీడనం అదుపులోకి వస్తుందో అప్పటి నుంచి మందులు తీసుకోవటం మానేయవచ్చు.:-మీకు అధిక రక్త పీడనం ఉన్నట్లు డాక్టర్లు గుర్తించినాక ట్రీట్మెంట్ మొదలు పెట్టి రక్త పీడనాన్ని నార్మల్ కు తెస్తారు అంతే కానీ మీరు రక్తపీడనాన్ని సంబంధించిన మందులు మానేయమని అర్ధము కాదు.అందుచేత మీ జీవన విధానంలో మార్పులు పాటిస్తున్నప్పటికీ ఎప్పుడు కూడా అధిక రక్త పీడనాన్ని వాడే మందులను డాక్టర్ కు చెప్పకుండా మానేయకండి డాక్టర్ పరీక్ష చేసి అవసరమైతే డోసేజ్ మారుస్తాడు చాలా అరుదుగా ట్రీట్మెంట్ ఏప్ పరిస్థితి ఏర్పడుతుంది అంతవరకు డాక్టర్ చెప్పినట్లుగా పిరియాడికల్ గ రక్త పీడనాన్ని పరీక్ష చేయించుకుని మందులు వాడుతూనే ఉండాలి మానెయ్యకూడదు.కొన్ని సందర్భాలలో జీవితాంతము అధిక పీడనానికి మంచి ఫలితాల కోసం మందులు వాడవలసి ఉంటుంది. .
Note: its an article. Please consult you doctor if you face any problem!