భగత్ సింగ్ . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

భగత్ సింగ్ .

భగత్ సింగ్ . మనకీర్తి శిఖరాలు .

(1907 సెప్టెంబరు 28 1931 మార్చి 23) భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే. భారత స్వాతంత్ర్యోద్యమం లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో అతను ఒకడు. ఈ కారణంగానే షహీద్ భగత్

సింగ్ గా కొనియాడబడుతున్నాడు.

చరిత్రకారుడు కె.ఎన్. పణిక్కర్ ప్రకారం భగత్ సింగ్, భారతదేశంలో ఆరంభ మార్కిస్టు. భగత్ సింగ్ హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ పార్టీ స్థాపక సభ్యులలో ఒకడు. ఇప్పటి పాకిస్తాన్‌లో ఉన్న లాయల్ జిల్లా బంగా గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించాడు. భారత్‌లో బ్రిటీషు పాలన ను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో అతను జన్మించాడు. యుక్త వయస్సులోనే ఐరోపా విప్లవ ఉద్యమాలను గురించి చదివిన సింగ్ అరాజకవాదం, సామ్యవాదమునకు ఆకర్షితుడయ్యాడు. అనేక విప్లవాత్మక సంస్థల్లో అతను చేరాడు. హిందూస్తాన్ గణతంత్ర సంఘం (HRA)లో ఒక్కో మెట్టు ఎక్కుతూ అనతికాలంలోనే అందులోని నాయకుల్లో ఒకడుగా ఎదిగిన అతను, ఆ తర్వాత దానిని హిందూస్తాన్ సామ్యవాద గణతంత్ర సంఘం (HSRA)గా మార్చాడు. భారత, బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైలులో 64 రోజుల నిరాహారదీక్షను చేపట్టడం ద్వారా సింగ్‌ విపరీతమైన మద్దతును కూడగట్టుకున్నాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజ్‌పత్ రాయ్ హత్య నేపథ్యంలో ఒక పోలీసు అధికారిని కాల్చినందుకు అతను్ను ఉరితీశారు. అతను ఉత్తరదాయిత్వం భారత స్వాతంత్ర్య సిద్ధికి పోరాడేలా భారత యువతను ప్రేరేపించింది. అంతేకాక భారత్‌లో సామ్యవాద వ్యాప్తి మరింత పుంజుకుంది.

భగత్ సింగ్ పూర్వపు పంజాబ్‌లోని, ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న లాయల్ జిల్లా బంగా సమీపంలోని ఖత్కర్ కలాన్ గ్రామంలోని సంధు ఝాట్ కుటుంబంలో సర్దార్ కిషన్ సింగ్ , విద్యావతి దంపతులకు జన్మించాడు. భగత్ అనే పదానికి "భక్తుడు" అని అర్థం. సింగ్‌ దేశభక్త సిక్కు కుటుంబంలోని కొందరు భారత స్వాతంత్ర్యోద్యమాల్లోనూ, మరికొందరు మహారాజా రంజిత్ సింగ్ సైన్యంలోనూ పనిచేశారు.

భగత్ సింగ్ మూడేళ్ళ పిల్లాడిగా ఉన్నప్పుడు అతని తండ్రి భగత్ సింగ్‌ నీ తీసుకొని కొత్తగా వేస్తున్న తోట ను చూడ్డానికి పొలాల్లోకి వెళ్ళాడు. అక్కడ భగత్ సింగ్ పొలం లో దిగి ఆడుకుంటూనే చిన్న చిన్న గడ్డిపరకలను నాటడం మొదలు పెట్టాడు.

"ఏం చేస్తున్నావ్ నాన్నా?" అని అడిగాడు తండ్రి.

భగత్ సింగ్: "తుపాకులు నాటుతున్నా", "చెట్టు పెరిగి, తుపాకులు కాస్తాయి" అని సమాధానం ఇచ్చాడు

భవిష్యత్తుకు బాల్యమే మొలక. మొలకలు వేసే వయస్సులో తుపాకులను మొలకెత్తించాలని చూడడం అతని వ్యక్తిత్వానికి మచ్చుతునక. విద్యార్థి దశలో అందరితో కలివిడిగా ఉండేవాడు భగత్ సింగ్. బాబాయి సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ విదేశాల్లో ఉంటున్న సమయంలో, కంట నీరు పెట్టుకొనే చిన్నమ్మ హర్నామ్ కౌర్ ను చూసి నాలుగేళ్ళ భగత్ సింగ్ " పిన్నీ ఏడవొద్దు. నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటా" అని ప్రతిజ్ఞలు చేసేవాడు. స్వామి దయానంద సరస్వతి అనుచరుడైన సింగ్ తాత అర్జున్ సింగ్ హిందూ సంస్కరణ ఉద్యమం, ఆర్యసమాజ్‌ లో భాగం కావడం కూడా అతనుపై విపరీతమైన ప్రభావం పడేందుకు దోహదపడింది. అతను పినతండ్రులు అజిత్ సింగ్, స్వరణ్ సింగ్ తండ్రులు కర్తార్ సింగ్ సారభా గ్రివాల్ , హర్ దయాల్ నేతృత్వంలోని గద్దర్ పార్టీ సభ్యులే. తనపై ఉన్న అపరిష్కృత కేసుల కారణంగా అజిత్ సింగ్ పెర్సియాకు పారిపోగా, కకోరి రైలు దోపిడీ 1925లో హస్తముందంటూ స్వరణ్ సింగ్‌ను 19 డిసెంబరు 1927న ఉరితీశారు. బ్రిటీషు సంస్థల యెడల పాఠశాల అధికారులకు ఉన్న విధేయత అతను తాతకు నచ్చకపోవడంతో భగత్ తన వయస్సు సిక్కులు వలె లాహోర్‌లోని ఖల్సా ఉన్నత పాఠశాలకు హాజరు కాలేదు. బదులుగా ఆర్యసామాజిక పాఠశాల దయానంద్ ఆంగ్లో వేదిక్ ఉన్నత పాఠశాలలో భగత్‌ను అతను తండ్రి చేర్పించాడు. 13 ఏళ్ల ప్రాయంలోనే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమానికి సింగ్ ప్రభావితుడయ్యాడు. ఆ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురుతిరిగిన భగత్ ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు, బ్రిటీషు దిగుమతి దుస్తులను తగులబెట్టడం ద్వారా గాంధీ సిద్ధాంతాలను అనుసరించాడు. ఉత్తరప్రదేశ్‌ లోని చౌరీ చౌరా గ్రామస్తులు పోలీసులను హింసాత్మకంగా హతమార్చిన నేపథ్యంలో ఉద్యమాన్ని గాంధీ ఉపసంహరించుకున్నాడు. అతను అహింసావాదంపై అసంతృప్తి చెందిన సింగ్ యువ విప్లవోద్యమంలో చేరి, తెల్లదొరలకు వ్యతిరేకంగా హింసాత్మక ఉద్యమాన్ని ఉధృతం చేశాడు.

1923లో పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళన్ నిర్వహించిన వ్యాసరచన పోటీలో భగత్ విజయం సాధించాడు. దానితో పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళన్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ భీమ్ సేన్ విద్యాలంకార్ సహా పలువురు సభ్యుల దృష్టిని ఆకర్షించాడు. ఆ వయస్సులోనే ప్రముఖ పంజాబీ సాహిత్యాన్ని ఉటంకించడమే కాక పంజాబ్ సమస్యల ను ప్రస్తావించాడు. పంజాబీ రచయితలు, సియోల్‌కోట్‌కు చెందిన తనకెంతో ఇష్టమైన కవి అల్లామా ఇక్బాల్ రాసిన పలు కవితలు, సాహిత్యాన్ని అతను పఠించాడు. యుక్త వయస్సులో ఉన్నప్పుడు భగత్ సింగ్ లాహోర్‌. లోని నేషనల్ కాలేజీలో విద్యనభ్యసించాడు. అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని అతను ఇల్లు విడిచి పారిపోయి నౌజవాన్ భారత్ సభ ("భారత యువజన సంఘం")లో చేరాడు. నౌజవాన్ భారత్ సభ ద్వారా భగత్, అతను సహ విప్లవకారులు, యువత దృష్టిని ఆకర్షించారు. ప్రొఫెసర్ విద్యాలంకార్ విజ్ఞప్తి మేరకు అప్పట్లో , అష్ఫాఖుల్లా ఖాన్ నాయకత్వం వహిస్తున్న హిందూస్తాన్ గణతంత్ర సంఘంలోనూ సింగ్ చేరాడు] కకోరి రైలు దోపిడీ గురించి అతనుకు అవగాహన ఉందని భావించారు. అతను అమృత్‌సర్ నుంచి ప్రచురించబడిన ఉర్దూ , పంజాబీ వార్తాపత్రికలలో వార్తలను వ్రాశాడు , సరిదిద్దాడు. సెప్టెంబరు 1928లో దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది విప్లవకారులు కీర్తి కిసాన్ పార్టీ పేరుతో ఢిల్లీ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. దానికి భగత్ సింగ్ కార్యదర్శిగా వ్యవహరించాడు. అనంతరం సంఘం అధ్యక్షుడిగా భగత్ పలు విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టాడు. HRA ప్రధాన నాయకులను పట్టుకుని ఉరితీసిన కారణంగా అతను తన సహ విప్లవకారుడు సుఖ్‌దేవ్ థాపర్‌తో పాటు అనతికాలంలోనే ప్రత్యేక అధికారాన్ని చేజిక్కుంచుకోవడానికి కారణమైంది.

ఉరిశిక్ష ఖాయమన్న సంగతి తెలిసిన తర్వాతే కాదు, అంతకు ముందు నుంచి కూడా కటకటాల వెనకాల భగత్ సింగ్ ఒక అధ్యయనశీలిగా కాలాన్ని గడిపాడు. రాజనీతి, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్ర విషయాలను ప్రబోధించే అనేక గ్రంథాలను అతను అధ్యయనం చేశాడు. పుస్తకం చదువుతూ మధ్యలో హఠాత్తుగా లేచి అటూ ఇటూ తిరుగుతూ, విప్లవకారుడు రాంప్రసాద్ భిస్మిల్ వ్రాసిన ఈ పాటను పాడేవాడు.

మేరా రంగ్ దే బసంతీ చోలా

ఇసీ రంగ్ మే రంగ్ కే శివానే, మాకా బంధన్ ఖోలా

మేరా రంగ్ దే బసంతీ చోలా

యహీ రంగ్ హల్దీ ఘాటీ మే, ఖుల్ కర్కే థా ఖేలా

నవ్ బసంత్ మే, భారత్ కే హిత్ వీరోంకా యహ్ మేలా

మేరా రంగ్ దే బసంతీ చోలా.

లాలా లజ్‌పత్ రాయ్ మరణం, సాండర్స్ హత్యల తరువాత 1928లో భారత్‌లోని వర్థమాన రాజకీయ పరిస్థితిపై నివేదికను కోరుతూ సర్ జాన్ సైమన్ నేతృత్వంలో బ్రిటీష్ ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటుచేసింది. అయితే కమిషన్ సభ్యుడిగా ఒక్క భారతీయుడిని కూడా నియమించకపోవడంతో భారత రాజకీయ పార్టీలు దానిని బహిష్కరించాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా పలు నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. 30 అక్టోబరు 1928న కమిషన్ లాహోర్‌‌ను సందర్శించినప్పుడు సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాలా లజ్‌పత్ రాయ్ నేతృత్వంలో నిశ్శబ్ద అహింసా పద్ధతిలో ఒక నిరసన కార్యక్రమం జరిగింది. అయితే హింస తలెత్తడానికి పోలీసులు కారణమయ్యారు. లాలా లజ్‌పత్ రాయ్‌ ఛాతీపై పోలీసులు లాఠీలతో కొట్టారు. దాంతో అతను తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనను కళ్లారా చూసిన భగత్ సింగ్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పోలీసు అధికారి స్కాట్‌ను హతమార్చడానికి విప్లవకారులు శివరామ్ రాజ్‌గురు, జై గోపాల్ మరియ సుఖ్‌దేవ్ థాపర్‌లతో అతను చేతులు కలిపాడు. స్కాట్‌ను గుర్తించిన జై పాల్ అతను్ను కాల్చమంటూ సింగ్‌కు సంకేతాలిచ్చాడు. అయితే పొరపాటు గుర్తింపు కారణంగా డీఎస్పీ J. P. సాండర్స్ కనిపించినప్పుడు సింగ్‌కు జై పాల్ సంకేతమిచ్చాడు. ఫలితంగా స్కాట్‌కు బదులు సాండర్స్ హతమయ్యాడు. దాంతో పోలీసుల కంటపడకుండా ఉండటానికి భగత్ లాహోర్‌ పారిపోయాడు. గుర్తు పట్టకుండా ఉండటానికి గడ్డాన్ని గీసుకోవడం, వెండ్రుకలు కత్తిరించుకోవడం ద్వారా సిక్కు మత విశ్వాసాల ఉల్లంఘనకు సింగ్ పాల్పడ్డాడు.

విప్లవకారుల చర్యలను అణచివేసే దిశగా భారత రక్షణ చట్టమును తీసుకురావడం ద్వారా పోలీసులకు బ్రిటీష్ ప్రభుత్వం మరింత అధికారం కల్పించింది. భగత్ సింగ్ వంటి విప్లవకారులను అణచివేయడం ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రజాహితం కోసమేనంటూ ప్రత్యేక శాసనం కింద ఈ చట్టాన్ని ఆమోదించారు. ఆయితే ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అది ఆమోదితం కానున్న కేంద్ర శాసనసభపై బాంబు పేలుడుకు హిందూస్తాన్ సామ్యవాద గణతంత్ర సంఘం వ్యూహరచన చేసింది. బాంబు పేలుడుకు భగత్ సింగ్ ప్రయత్నించకుండా మరో ప్రముఖ విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ అడ్డుకున్నాడు. అయితే సింగ్ ఆశయాలను అంగీకరించే విధంగా మిగిలిన పార్టీ సభ్యులు అతనుపై ఒత్తిడి తీసుకొచ్చారు. శాసనసభ వసారాపై భగత్ సింగ్‌తో పాటు మరో విప్లవకారుడు 8 ఏప్రిల్ 1929న సింగ్, దత్‌లు బాంబు విసిరి, "ఇంక్విలాబ్ జిందాబాద్!భగత్ సింగ్ రిమంబర్డ్ - డైలీ టైమ్స్ పాకిస్తాన్దీ-ని తర్వాత వినికిడి శక్తి కోల్పోయేలా గొంతెత్తి అరుస్తామని ముద్రించబడిన పలు కరపత్రాలను వెదజల్లారు. భగత్ సింగ్ రచనలు] కేంద్ర అసెంబ్లీ ఆవరణలో కరపత్రం విసిరివేత, బాంబు దాడి వల్ల ఏ ఒక్కరూ మరణించడం గానీ గాయపడటం గానీ జరగలేదు. తమ వ్యూహంలో భాగంగా ఉద్ధేశ్యపూర్వకంగానే జాగ్రత్తలతో దాడి చేసినట్లు సింగ్, దత్ అంగీకరించారు. బాంబు గాయపరిచేటంత శక్తివంతమైంది కాదని బ్రిటీష్ ఫోరెన్సిక్స్ విచారణాధికారులు కూడా తేల్చిచెప్పారు. వాస్తవానికి బాంబు జనాలకు దూర బాంబు దాడి తర్వాత సింగ్, దత్ ఇద్దరూ లొంగిపోయారు.[citation needed] 12 జూన్ 1929న సింగ్ , దత్‌ 'జీవితకాల దేశ బహిష్కరణ'కు గురయ్యారు.

సింగ్ అరెస్టు అనంతరం శాసనసభ పేలుడుపై విచారణ నేపథ్యంలో J. P. సాండర్స్ హత్య వెనుక అతను హస్తంపై బ్రిటీష్ ప్రభుత్వం ఆరా తీసింది. హత్యకు సంబంధించి భగత్ సింగ్, రాజ్‌గురు , సుఖ్‌దేవ్‌లపై అభియోగాలు మోపారు. భారత స్వాతంత్ర్యానికి తన గళాన్ని వినిపించుకునేందుకు న్యాయస్థానాన్నే ఒక ప్రచార వేదికగా మలుచుకోవాలని భగత్ సింగ్ నిర్ణయించుకున్నాడు.[citation needed] హత్యా నేరాన్ని అంగీకరించిన అతను విచారణ సమయంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశాడు.[citation needed] విచారణ సమయంలో HSRA సభ్యులు లేకుండా కేసు విచారణ కొనసాగించాలని ఆదేశించారు. తద్వారా సింగ్ తన భావాలను ఇక ఎప్పుడూ ప్రచారం చేయలేడనే ఆవేదనతో అతను మద్దతుదారులు తీవ్రంగా మండిపడ్డారు.

ఖైదీలు, విచారణ ఖైదీల హక్కుల కోసం భగత్ సింగ్ , ఇతర ఖైదీలు జైలులోనే నిరాహారదీక్ష చేపట్టారు. చట్టం ప్రకారం ఉత్తమ హక్కులు కల్పించాల్సిన భారత రాజకీయ ఖైదీల కంటే బ్రిటీష్ హంతకులు, దొంగలకు ప్రాధాన్యత ఇవ్వడం దీక్షకు దారితీసింది. రాజకీయ ఖైదీలకు పౌష్టికాహారం, పుస్తకాలు, దినపత్రికల సదుపాయం, మంచి బట్టలు, మరుగుదొడ్డి ఇతర దైనందిన సదుపాయాలు కల్పించడం వారి డిమాండ్లు. అలాగే కార్మిక లేదా హోదాకు తగని పనిచేసే విధంగా రాజకీయ ఖైదీలపై ఒత్తిడి తీసుకురాకూడదని సింగ్ డిమాండ్ చేశాడు. 63 రోజుల పాటు కొనసాగిన నిరాహారదీక్ష సింగ్ డిమాండ్లకు బ్రిటీష్ ప్రభుత్వం తలొగ్గడం ద్వారా ముగిసింది. తద్వారా అతనుకు సాధారణ భారతీయుల్లో ఆదరణ పెరిగింది. దీక్షకు ముందు అతను ప్రాభవం ప్రధానంగా పంజాబ్ ప్రాంతం వరకే పరిమితమైంది.

కేంద్ర శాసనసభపై బాంబు దాడి జరిగినప్పుడు అక్కడున్న రాజకీయ నాయకుల్లో ఒకరైన మహ్మద్ అలీ జిన్నా లాహోర్ ఖైదీలకు బహిరంగంగానే తన సానుభూతి తెలిపాడు. నిరాహారదీక్షపై మాట్లాడుతూ "నిరాహారదీక్ష చేసే వ్యక్తిలో ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మతోనే తను ముందుకు సాగుతాడు. తన పోరాటానికి న్యాయం జరుగుతుందని విశ్వసిస్తాడు" అని వ్యాఖ్యానించాడు. సింగ్ చర్యలపై మాట్లాడుతూ, "ఏదేమైనప్పటికీ, వారిని ఎక్కువగా నిందించినా , ఎక్కువగా చెప్పినా వారు తప్పుదోవ పడుతారు. తద్వారా ఏర్పడే పాలనా ధిక్కార వ్యవస్థను ప్రజలు చీదరిస్తారు" అని అన్నాడు.

డైరీని వ్రాసే అలవాటు ఉన్న భగత్ సింగ్‌ చివరకి 404 పుటలను నింపాడు. తాను సమర్థించే పలువురు ప్రముఖుల ఉల్లేఖనాలు , వారి గొప్ప వాక్యాలకు సంబంధించి సింగ్ తన డైరీలో పలు సూచనలు చేశాడు. అందులో కార్ల్ మార్క్స్ , ఫ్రెడ్రిచ్ ఏంజిల్స్ ఆలోచనలను ప్రముఖంగా ప్రస్తావించాడు. భగత్ సింగ్ డైరీలోని పలు వ్యాఖ్యలు అతను విశిష్టమైన దార్శనిక అవగాహనకు అద్దం పడుతాయి. "దేవుడిపై విశ్వాసం లేని అహంకారి అనిపించుకున్న సింగ్ మరణానికి ముందు కూడా నేను ఎందుకు నాస్తికుడనయ్యాను?" అనే శీర్షికతో ఒక వ్యాసాన్ని రాశాడు.[citation needed] .

23 మార్చి 1931న భగత్ సింగ్‌తో పాటు అతను సహచరులు రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను లాహోర్‌లో ఉరితీశారు. సింగ్ ఉరిని వ్యతిరేకిస్తూ నిరసన చేపడుతున్న అతను మద్దతుదారులు అతను్ను ఆ క్షణమే షహీద్ లేదా అమరవీరుడుగా ప్రకటించారు. అప్పటి సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ V.N. స్మిత్ ప్రకారం, సింగ్‌ను ముందుగానే ఉరితీశారు:

సాధారణంగా ఉదయం 8 గంటలకు ఉరితీసేవారు. అయితే ఏమి జరిగిందో ప్రజలు తెలుసుకునే లోగానే అతను్ను ఉరితీయాలని నిర్ణయించారు...సుమారు రాత్రి 7 గంటల ప్రాంతంలో జైలు లోపల నుంచి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు వినిపించాయి. సింగ్‌ జీవితానికి చివరగా తెర దించబోతున్నారన్న విషయానికి అది సంకేతమయింది.

సట్లెజ్ నది ఒడ్డున ఉన్న హుస్సేనివాలా వద్ద సింగ్‌‌ను దహనం చేశారు. భగత్ సింగ్ స్మారకచిహ్నం నేడు భారత స్వాతంత్ర్య సమరయోధులను గుర్తుకు తెస్తుంది.

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - Athi Sukumari
కాశీ ప్రయాణ కథలు - అతి సుకుమారి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaashi Prayana Kathalu - Atha sommu alludu danam
కాశీ ప్రయాణ కథలు - అత్తసొమ్ము అల్లుడు..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Samasya manadi-Salahaa vaalladi
సమస్య మనది… సలహా వాళ్లది!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Anthuleni rahasyam gaa mighilina minchesot mystery house
అంతులేని రహస్యం - వించెస్టర్...
- డా:సి.హెచ్.ప్రతాప్
Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.