తెలుగు సినీ కృష్ణుడు రఘరామయ్య. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

తెలుగు సినీ కృష్ణుడు రఘరామయ్య.

కె.రఘరామయ్య.

తెలుగు కీర్తి ఘనతను ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన కళామూర్తులు ఎందరో... అటువంటివారిలో నట గాయకుడు ఈలపాట రఘురామయ్యగా ప్రఖ్యాతిచెందిన కల్యాణం వెంకట సుబ్బయ్య ఒకరు.సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. కృష్ణుడు, దుశ్యంతుడు, నారదుడు, తదితర పాత్రలను ఈయన వేదికపై రక్తి కట్టించేవారు. అరవై యేళ్ళ తన వృత్తి జీవితములో అనేక నాటకాలకు ఇరవైవేలకు పైగా ప్రదర్శనలు, ఇరవైరెండు చలనచిత్రాలలో తన అభినయంతో పాత్రలకి జీవం పోసారు. తెలుగు నాటకాలకుమాత్రమే ప్రత్యేకము అయిన పద్య ఉటంకము. అటువంటిది రఘురామయ్యగారు తన పద్యాలను పాత్ర యొక్క స్వభావము, సందర్భానికి తొడరికగా సుదీర్ఘమైన రాగాలాపనతో మొదలుపెట్టి, శ్రోతలను మంత్రముగ్ధులని చేస్తారు.

రఘురామయ్యగారు నోటిలో వ్రేలు పెట్టి ఈల వేస్తూ పద్యాలను, పాటలను పాడేవారు. ఇందుమూలముగా ఈయన "ఈలపాట రఘురామయ్య"గా పేరు ఉండేది. అనుపూర్విక నటనలో ఈయన ప్రసిద్ధుడు. కళారంగానికి చేసిన అత్యున్నత కృషికిగాను 1973లో సంగీత నాటక అకాడెమి వారి పురస్కారము, 1975లో భారత ప్రభుత్వము వారి పద్మశ్రీ పురస్కారము ఈయనను వరించాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈయనకు "నాటక కూయిల" అని ప్రశంసించారు.

రఘురామయ్య గుంటూరు జిల్లా సుద్దపల్లి లో 1901, మార్చి 5 వ తేదీన కళ్యాణం నరసింహరావు, కళ్యాణం వేంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. చిన్ననాటి నుండే నాటకాలు వేసాడు. రఘురాముని పాత్ర పోషించడంలో ఈయన చాలా ప్రఖ్యాతిపొందాడు. అందువలన కాశీనాథుని నాగేశ్వరరావు రఘురామయ్య అని పేరు పెట్టారు.

దాదాపు 60 సంవత్సరాలు నాటక రంగంలో ప్రసిద్ధ నటులందరితో ఈయన స్త్రీ, పురుష పాత్రలు ధరించారు. తిరుపతి వెంకట కవులు రచించిన పాండవోద్యోగ విజయాలలోని పద్యాలను చక్కగా పాడుతూ, వాటి భావాన్ని వివరిస్తూ, నటించి ప్రచారం చేసిన నటులు వీరు. చలనచిత్ర రంగంలో ఎన్నో కథానాయకుల పాత్రలు పోషించారు. ఆ రోజుల్లో అందరూ శ్రీకృష్ణుడు పాత్రలో పద్యాలు పాడుతూ, వేణువును మాత్రం చేతితో పట్టుకునేవారు. కాని ఈయన మాత్రం తన చూపుడు వేలును నాలిక క్రిందపెట్టి, ఈలపాటతో వేణుగానం చేస్తూ, ప్రేక్షకులకు ఒక అపూర్వమైన అనుభూతి కలిగించేవారు. ఈయన 1933 లో "పృథ్వీ పుత్ర" సినిమా ద్వారా తెలుగు చలనచిత్రంగంలోనికి ప్రవేశించారు. ఇది తెలుగు సినిమా రంగంలో వచ్చిన 5వ సచలనచిత్రం మొట్టమొదటిసారిగా తెలుగు సినిమాను నిర్మించిన తెలుగు వ్యక్తి పోతినేని శ్రీనివాసరావు. ఈయన సరస్వతి సినీ టౌన్ బ్యానర్ క్రింద తీసిన సినిమానే "పృథ్వీ పుత్ర". రఘురామయ్య ఇంచుమించు 20 వేల నాటకాలలో, 100 చలన చిత్రాలలో నటించారు.

1972లో నాటక బృందంతో కౌలాలంపూర్, బాంకాక్, టోక్యో, ఒసాకా, హాంగ్ కాంగ్, సింగపూర్ లలో పర్యటించాడు. సర్వేపల్లి రాధాకృష్ణన్, నెహ్రూ తదితరులు ఈయన వీరి వ్రేలి మురళీ గానాన్ని మెచ్చుకొనగా, రవీంద్రనాథ్ ఠాగూర్ రఘురామయ్యను "ఆంధ్ర నైటింగేల్" అని ప్రశంసించారు. భారత ప్రభుత్వం వీరికి పద్మశ్రీ అవార్డును ప్రధానం చేసింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ విశిష్ట సభ్యత్వాన్ని ఇచ్చి సన్మానించింది.

రోహిణి వేంకట సుబ్బయ్య, సీతమ్మ దంపతుల రెండవ కుమార్తెయైన సావిత్రి గారితో ఈయన వివాహం 1938లో బాపట్లలో జరిగింది. 92యేళ్ళ వయస్సులో, 2014 డిసెంబరు 8లో విజయవాడలో ఆవిడ స్వర్గస్థులైనారు. వారి సంతానం ఏకైక కుమార్తె; పేరు సత్యవతి. సత్యవతిగారి వివాహం తోట పార్వతీశ్వరరావు గారితో జరిగింది. ఈలపాట రఘురామయ్య కాంస్య విగ్రహాన్ని ఆయన స్వస్థలమైన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో 2014 ఫిబ్రవరి 2 న తెలుగు భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్, వారి సతీమణి ఆవిష్కరించారు.

ఈయన తన 75వ ఏట 1975, ఫిబ్రవరి 24 న గుండెపోటుతో మరణించాడు.

నటించిన కొన్ని చిత్రాలు. పృధ్వీపుత్ర (1933) లంకా దహనం (1936)

పాశుపతాస్త్రం (1939)

అపవాదు (1941) తల్లి ప్రేమ (1941) గొల్లభామ (1947) మదాలస (1948) మాయా రంభ (1950) ప్రపంచం – (1950) అగ్నిపరీక్ష (1951) సతీ సక్కుబాయి (1954) శ్రీకృష్ణ తులాభారం (1955) నాగులచవితి (1956) చింతామణి (1956) శ్రీకృష్ణ మాయ (1958) దేవాంతకుడు (1960) ఉషా పరిణయం (1961) నాగార్జున (1961) దక్షయజ్ఞం (1962) శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న (1967) పాడిన పాటలు, పద్యాలు. అగ్నిపరీక్ష – 1951 కోరికలు ఈడేరే విచిత్రముగా - కె.రఘురామయ్య, మాలతి, లక్ష్మీరాజ్యం ఓ మనసేమో పల్కనోయీ నీనించి ఏమని - పి.లీల, కె.రఘురామయ్య, ఓ పరదేశి ప్రేమవిహారి నీవే నా - మాలతి, కె.రఘురామయ్య చింతామణి (1956 • కనరా శ్రీహరి లీలలు కనరా ఈ జగమంతాని మాయాజాలమే • తాపస వృత్తిబూని పృధుశ్చానమొనర్చియు నన్ను చేరగా (పద్యం) • పూజ్యుల ఇంటను పుట్టిన చాలునా బ్రతుకొక్క ధర్మమై (పద్యం) • పసిడి శీలమ్మునమ్మిన పతితవయ్యో పరగానపైనించుక (పద్యం) • భక్తి భావమ్ము తొలుపారు బహుళగతుల ఆత్మచింతన (పద్యం) శ్రీకృష్ణమాయ -1958. ముక్తి మార్గమును కనలేవా మాయమోహమయ జీవా భాసురమైన ఈ జగతి పాలనకొక్క అదృశ్యశక్తి తరమే జగాన ధాతకునైన తరుణీవిలాసవిమోహము దాట శ్రీరామాంజనేయ యుద్ధం –1975 సాకేత సార్వభౌమా శరణు శరణయా జానకిరామా జయతు జయతు మంత్రం .... రామ నీలమేఘశ్యామా కోదండరామా దేవాంతకుడు (1960) ఎవని మంత్రము వల్ల హీన కిరాతుండు వాల్మీకిగా మారి (పద్యం) దేని మహిమచేత దివ్యలోకములన్నీ తిరుగులేక (పద్యం) పూరయ మమకామం గోపాల..వారం వారం వందన శ్రీతజనపాలా శ్రీలోలా జరిగేదంతా నీలీల శ్రీ కృష్ణ కుచేల – 1961 ఉషాపరిణయం – 1961 నాకున్ ముద్దు అనిరుద్దుపై నెపుడు సంతాపంబు (పద్యం) దక్షయజ్ఞం -1962 కానరు నీ మహిమా దేవా గానము చేయ నా తరమా కరుణామూర్తులు మీ త్రిమూర్తులు జగత్‌కల్యాణ (పద్యం) వాల్మీకి – 1963 ఓం నమోనారాయాణాయ ఓం నమోనారాయాణాయ తలచినంతనే సకలతాపసములణచి పాపలకైన ( పద్యం) పరమతారక మంత్రప్రభావమెల్ల వలచుకున్నావు (పద్యం) హరేనారాయణా పావనా సృష్టిస్ధితిలయ మూలకారణా మోహినీ భస్మాసుర - 1966 ఔనులే ఈ సుఖమే సుఖము శృంగారసీమలో త్రిజగాల పాలించు దేవుంద్రు ( సంవాద పద్యాలు ) ముల్లోకంబులనేలు నన్నెరుగక ఏమో పల్కుచున్నావు (పద్యం) శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న (1967) ఏమి ఈ వింత మోహం శ్రీకృష్ణ రాయబారం అన్నియెడలను నాకు దీటైనవారు గోపకులు పదివేలు (పద్యం) అంచ్యుతులైన బంధువులు అందరిముందర చెప్పి నిన్ను (పద్యం) ఆయుధమున్ ధరింప అని నిక్కముగా ఒకపట్ల ఊరకే సాయం (పద్యం) ఆలము సేయనేనని యథార్థము పల్కితిసుమ్మి (పద్యం) ఊరక చూచు చుండుమనుట ఒప్పితిగాని భవధ్రధస్తులన్ (పద్యం) ఎక్కడినుండి రాక ఇటకు ఎల్లరున్ సుఖులే కదా (పద్యం) ఏసతి వహ్నిలోన జనియించెను జన్మమొనర్చువేళ (పద్యం) ఒక్కనిజేసి నన్నిచట ఉక్కడగింప తలంచినావా నే నెక్కడ (పద్యం) కన్యప్రాయమునందు భాస్కరుని కరుణ పదినెలలు మోసి (పద్యం) గజనంబులు ధరియించు ధర్మజుడు దివ్యక్షత్రముపట్టు (పద్యం) చెల్లియో చెల్లకో తమకు చేసిన యెగ్గులు సైచిరందరున్ (పద్యం) తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటులిష్టపడవేనియు (పద్యం) తనయుల వినిచెదవో ఈ తనయులతొ ఏమియని (పద్యం) ముందుగ వచ్చితీవు మునుముందుగ అర్జును నేను (పద్యం) సంతోషంబున సంధి చేయుదురే వస్త్రంబూర్చుచో ద్రౌపతీ (పద్యం) సేవాధర్మము సూతధర్మమును రాశీభూతమై ఒప్ప (పద్యం)

సేకరణ: