పాండవ పక్షాన యుద్ధం చేసిన దృతరాష్ట్ర పుత్రుడు - ambadipudi syamasundar rao

పాండవ పక్షాన యుద్ధం చేసిన దృతరాష్ట్ర పుత్రుడు

ధృతరాష్ట్రుని సంతానంలో అంటే కౌరవులలో ఒకడైనప్పటికీ పాండవులో పక్షనా కురుక్షేత్ర యుద్దములో అంటే ధర్మము పక్షాన నిలబడి యుద్ధము ఛేసి యుద్ధము తరువాత జీవించిన కొద్దిమందిలో యుయుత్సుడు ఒకడు, గాంధారి గర్భం దాల్చి రెండేళ్ళు గడిచినా సంతానం కలగక పోవడంతో ధృతరాష్ట్రుడు వైశ్య కన్యకయైన సుఖదను వివాహమాడి యుయుత్సుని పుత్రుడుగా పొందాడు. యుయుత్సుడు, దుర్యోధనుడు ఒకే రోజు జన్మించారు. మిగతా కౌరవులు, దుస్సల కన్నా ముందే జన్మించాడు యుయుత్సుడు అంటేనే పోరాటానికి సిద్ధంగా ఉండేవాడు అని అర్థం . అస్త్ర శస్త్ర విద్యలలో నిష్ణాతుడు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవక ముందే యుయుత్సుడు పాండవుల పక్షానికి చేరాడు అప్పటివరకూ కౌరవులతో ఉన్నా యుద్ధం తొలిరోజు ఆరంభవేళలో ధర్మరాజు ధర్మ రక్షణకే మేము శస్త్రం పట్టాము. మాకు ఎదురు నిలిచిన వాళ్లు అందరూ ధర్మ విధ్వంసకులే. ధర్మ పక్షంలో పోరాడదలచిన వాళ్లకు మా స్వాగతం అని ధర్మరాజుచేసిన ప్రకటన తనకు నచ్చి పాండవ పక్షంలో నిల్చి కౌరవులతో యుద్ధం చేశాడు.కౌరవుల ఆగడాలను మొదటి నుంచీ గమనిస్తూ ఉన్నవాడే కాబట్టి, యుయుత్సునికి వారి మీద అసహ్యం కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు! అతడిది ఒక అనీకిని సైన్యం . అంటే అక్షౌహిణి లో పదోవంతు సేన. ఈ సేనతో పాండవ పక్షంలోకి వచ్చాడు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల పక్షాన నిలచి యుయుత్సుడు చేసిన యుద్ధం చిరస్మరణీయమైనది.మహాభారత యుద్ధం తరువాత కౌరవులలో జీవించియున్నది ఒక్క యుయుత్సుడు మాత్రమే

యుయుత్సుడు ధర్మనిరతుడు యుయుత్సుడిని తోటి కౌరవులు దాసీపుత్రునిగానే భావించేవారు. అయినా అది యుయుత్సుని వ్యక్తిత్వం మీద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఒకసారి విషపు నీటి ప్రయోగం నుంచి భీముని కాపాడాడు అలాగే ద్రౌపదీ వస్త్రాపహరణం సమయంలో అందరూ మౌనంగా ఉన్నా యుయుత్సుడు మాత్రమే దానిని వ్యతిరేకించాడు గాంధారి మూడో కొడుకు వికర్ణుడు కూడా యుయుత్సుడితో సమానంగా ధర్మాచరణుడే. ధుర్యోదనుని కుటిల బుద్ధిని ద్వేషించిన వాడే కానీ ధర్మాన్ని అనుసరించి యుయుత్సుడు ధుర్యోధనుడిని విడిచి పెట్టాడు. వికర్ణుడు అన్నగారిని విడిచిపెట్ట లేక పోయాడు. ఇది రామాయణంలో విభీషణుడు, కుంభకర్ణుడు సంబంధం లాంటిది కౌరవుల యుద్ధ వ్యూహాలను ఎదుర్కోవడంలో పాండవులకు కూడా సహాయం చేశాడు. కౌరవ సైన్యంలో ఉన్న పదకొండు మంది అతిరథుల్లో (ఒక్కసారి పదివేల మందితో పోరాడగలిగినవాడు) యుయుత్సుడు కూడా ఒకడు. యుద్ధానంతరం పదకొండు మందిలో జీవించి ఉన్నది కూడా యుయుత్సుడే.

భారత యుద్దానంతరం ధర్మరాజు ఇతనికి రాజ్యం అంతా పట్టం కడదామని అనుకుంటాడు , ధృతరాష్ట్రుడికి మనః శాంతి కలిగించాలని యోచిస్తాడు . కానీ అతడు క్షత్రియ సంతతి కానందువల్ల సింహాసనం ఎక్కడానికి అర్హుడు కాడని నాటి ధర్మ వేత్తలు అందుకు అంగీకరించలేదు. పాండవులు పాలన చేసే కాలంలో సేనాధ్యక్షుడుగా ఉన్న ఇతడు వాళ్లు మహాప్రస్థానంగా వెళ్లి పోగా పరీక్షిత్తుకు సంరక్షకుడుగా నిలిచాడు. . యాదవకులంలో ముసలం ప్రారంభం కాకమునుపే నగరంలో అరాచకం ప్రభలడం గమనించాడు యుయుత్సుడు. దాన్ని గురించి ప్రజలను అడగగా వారు అతని మీదే నిందలు వేసి ద్రోహిగా సొంత బంధువుల మరణానికి కారకుడిగా ముద్ర వేశారు.

మరిన్ని వ్యాసాలు