దివికేగిన నటి కృష్ణవేణి. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

దివికేగిన నటి కృష్ణవేణి.

దివికేగిన , మీర్జాపురం రాణి కృష్టవేణి .

నాటితరం అందరి కధానాయకుల అందరి సరసన నటించిన కృష్ణవేణి 1924 డిసెంబర్ 24న పశ్చిమగోదావరిజిల్లా పంగిడిగ్రామంలో డాక్టర్ యర్రంశెట్టికృష్ణారావు వారి యింట ఈమె జన్మించారు.బాల్యంలో ధృవుడు,ప్రహ్లాదుడు వంటి పాత్రలుధరిస్తూ నటనపై అభిమానం పెంచుకున్నారు.తులాభారంలో ఈమెనటనచూసిముచ్చటపడిన రేలంగి ప్రోడక్షన్ మేనేజర్ గాపనిచేస్తుండేవారు.ఆయన ప్రముఖదర్మకులు సి.పుల్లయ్యగారికి కృష్ణవేణిని పరిచయంచేయగా,తనునిర్మించే తొలిబాలల చిత్రం'అనసూయధృవ'(1935)చిత్రంలో తొలి సారి వెండి తెరపై కనిపించి'జో అచ్చుతానంద అని పాడుకున్నారు..అలా 1955 వరకు చిత్రసీమకు తమవంతు సేవలు అందించారు.అప్పుడు ఆమెవయసు పదేళ్ళు. అనంతరం సి.యస్ .ఆర్ .గారిప్రోత్సాహంతో 'తుకారాం'(1937)చిత్రంలో నటించారు.అనంతరం 'కచదేవయాని'(1938)చిత్రంలో దేవయానిగా నటించి 'ప్రేమమహిమగన్ 'పాటపాడారు .అనంతరం'మహనంద'(1939)చిత్రంలో నటిస్తున్న సమయంలో 'మీర్జాపురంరాజా'వారిని వివాహం విజయవాడలో జరిగింది.వివాహనంతరం మీర్జాపురంరాజావారు నిర్మించిన'కాళిదాసు'చిత్రంలో నటించారు అనంతరం వారిసొంత స్టూడియో శోభనాచల బాధ్యతలు నిర్వహిస్తూ తామునిర్మించేచిత్రాలలోమాత్రమేనటిస్తూ'జీవనజ్యోతి'(1940)'దక్షయజ్ఞం'(1941)వీరికి అనురాధ అనేకుమార్తే1942లోజన్మించారు.భీష్మ(1944)(ఈచిత్రంలో రఘపతి వెంకయ్యనాయుడు గారికుమారుడు ప్రకాష్ నటించారు)తమకుమార్తె పేరున మేకారాజ్యలక్ష్మిఅనురాధ పేరున 'యం.ఆర్ .ఏ.ప్రోడక్షన్స్ ప్రారంభించి కృష్ణవేణి నిర్మాతగావ్యవహరించేవారు.ఈసంస్ధనిర్మించినతొలిచిత్రం'మనదేశం'(1949)తొలిజాతీయోద్యమపొరాటకథాంశంగానిర్మింపబడిన ఈచిత్రంద్వారానందమూరివారు పరిచయంచేయబడ్డారు. గాయని లీలగారుకూడా ఈచిత్రంలో తొలిసారి పరిచయంఅయ్యరు. 'వరూధిని' చిత్రం అనంతరం సొంతఊరువెళ్ళిన ఎస్ .వి .రంగారావునుపిలిపించిఇందులోవేషంఇచ్చారు..పుల్లయ్యగారిదర్మకత్వంలోఈమెనటించిన'గొల్లభామ'(1947)చిత్రంలోనటిస్తూఈమెపాడినపద్యం'భూపతినిచంపితిన్ ..,'లక్షమ్మ'(1950)చిత్రంపోటిగా నిర్మించి విజయంసాధించారు. ఆరోజుల్లో కృష్ణవేణి నటించిన'ధర్మాంగద' (1949)చిత్రానికి 46 వేలరూపాయల పారితోషకం తీసుకున్నారు. వీరునిర్మించిన 'కీలుగుర్రం'(1949) చిత్రంలో అంజలిదేవికి పాటలు ఈమె పాడారు.'తిరుగుబాటు'చిత్రంలో వాంప్ గా హుందాగానటించారు.వీరు నిర్మించిన'గుడ్ ఈవెనింగ్ ' 'లేడిడాక్టర్ ' చిత్రాలు పరాజయంపాలు అయ్యయి. 'సవాసం'(1952) ఈమెనటించిన చివరిచిత్రం.నిర్మతగా ఈమె నిర్మించిన చివరిచిత్రం'దాంపత్యం'(1957)ఈచిత్ర ద్వారా రమేష్ నాయుడు సంగీతదర్మకుడుగా పరిచయం చేయబడ్డారు.'రఘుపతివెంకయ్యగారి పురస్కారం యిచ్చి వీరిని గౌరవించారు వీరికుమార్తే అనురాథ నిర్మాతగా కొన్నిచిత్రాలు నిర్మించారు.

వారి ఆత్శకు శాంతి కలగాలని,వారికుటుంబ సభ్యులకు సానుభూతి.

సేకరణ : డా .బెల్లంకొండ నాగేశ్వరరావు.

9884429899