అమ్మ పాదాల వద్ద స్వర్గం ఉంది. మదర్స్ డే సందర్బంగా.
మనకు ఈదేహన్ని ప్రసాదించిన కనిపించే దైవం అమ్మ.
కళ్ళముందు నడయాడే దేవతలు నలుగురు అని పూర్వీకులు చెప్పారు.వారినే మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ - అతిధి దేవోభవ అంటూ ప్రస్తుతిస్తాం.
' ప్రతి మనిషి పుట్టుకకే పటట్టుగొమ్మ అమ్మ
ఈ లోకమనే గుడి చేరగా తొలి వాకిలి అమ్మ!'
అమ్మలో సమస్త దేవతలు కకొలువై ఉంటారు అందుకే అమ్మ మాతృదేవత అయింది.
మనవేదం కూడా ' భూమేర్ గరీయసీ మాతా,స్వర్గాదుచ్ఛా తరం పితాః '
భూమికంటే తల్లి గొప్పదని,స్వర్గం కంటే తండ్రి గొప్పవాడని ఆర్యోక్తి .ఎంతటి పదవిలో ఉన్నవారైనా పాదాలు తాకి నమస్కరింపబడేది తల్లి.
మనంఈభూమి పైకి రాకముందే అమ్మతొ అనుబంధం ఏర్పడుతుంది. ప్రాణం పోసి తన రక్తమాంసాలను కలిపి జన్మనిచ్చినందుకే అమ్మకి "మాత్రుదేవోభవ"అని పెద్దలు దైవత్వంకలిగించారు. అందుకే తల్లి,తండ్రి,గురువు,దైవం అన్నారు.
నాస్తి మాతృ సమా ఛాయా: నాస్తి మాతృ సమాగతి:
నాస్తి మాతృ సమంత్రాణం నాస్తి మాతృ సమప్రియా!
తల్లిలా చల్లని నీడనిచ్చేమరో తరువేది ఈలోకంలో లేదు అని శాస్త్రాలు చెపుతున్నాయి.ఈలోకంలో చెడు సంతతి ఉంటుందేమో కాని చెడు తల్లి ఉండదని ఆర్యోక్తి.
కుటుంబము లోని సంతానానికి కారకులు తల్లితండ్రులు. వీరిలో స్త్రీని తల్లి, జనని లేదా అమ్మ. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. . కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు గర్భాశయం లో పెంచి,తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి.పాలు త్రాగించి, ఆహారం
తినిపించి, ప్రేమతో పెంచుతుంది. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. తల్లిని అమ్మ, మాత అని కూడా అంటారు. ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది. నేడు మనం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించుకుంటున్న"మదర్స్ డే"ని తొలుత గ్రీకు సాంబ్రాజ్యకాలంలో వసంతరుతువు సంబరాల్లో దేవతల తల్లి "రేహ" గౌరవార్దం జరుపుకునేవారు.రోమ్ లో"సెబలి"పేరిట ఈఉత్సవాలు జరిపేవారు. క్రీస్తుకు పూర్వం 250సం"నాటికే ఈఉత్సవం జరుపుకున్నట్లు తెలుస్తుంది. రోమన్లు ఈపండుగను"హిలరియా" పేరున మూడు రోజుల పాటు జరుపుకునేవారు.తరువాత కాలంలో "చర్చి"బలపడటంతో ,క్రీస్తుకు జన్మనిచ్చిన "మేరిమాత" గౌరవ సూచకంగా "మదర్స్ సండే"ఉత్సవాలు ఇంగ్లాండు లో 1600సం" ప్రారంభంఅయ్యాయి. అలాయూరప్ అంతటా"మేరిమాత "గౌరవార్దం జరుపుకోసాగారు. తొలిసారి అమెరికాలో మదర్స్ డేగురించి గళమెత్తిన మహిళ "జూలియావార్డ్ హోవే"ఈమెఅమెరికా పౌరయుద్ద గీత రచయిత్రి. 1870 ప్రాంతంలో ఈమె ఈవేడుకలకు ప్రయత్నంచేసింది. "అన్నాజరివిస్ " అనేఅమెరికామహిళ నాటి నిరుపేద మహిళల స్ధితిగతులకు చలించిపోయి వారికోసం ఒక నిధి ఏర్పాటు చేయాలని "మదర్స్ డే"వేడుకలు నిర్వహించటంప్రారంభించింది.అలా1914 నుండి మే మాసం రెండో ఆదివారాన్ని"మదర్సడే" అధికారపూర్వకంగా నిర్వహించసాగారు. నేడు ప్రపంచం అంతటా మదర్స్ డే వేడుకలు నిర్వహించుకుంటున్నారు.
మనం ఈలోకంలోకి వచ్చాక తొలి సారి వాసన పట్టెది,గుర్తించేది అమ్మనే.తొలిసారి రుచి చూసేది కూడా అమ్మ పాలనే. మననుండి ప్రేమ తప్పఏమి ఆశించని త్యాగమయి అమ్మ.కానిఆ అమ్మకునేడు ప్రేమా అనురాగాలే కరువయ్యాయి.ప్రపంచీకరుణ మహత్యంలో నేడు అమ్మ ఉనికే ప్రశ్నార్దంగా మారింది.అమ్మ పాలతో అబ్బిన తెలివితేటలు, సంస్కారం,డబ్బుముందు మొకరిల్లాయి.బోసినోటితో కొరికినా నవ్వుతూ బోజ్జనింపిన అమ్మలు ఎందరో నేడు వంగిన నడుము, కుంగినమనస్సుతో తమకలలు చెదరి సంతతి ఆదరణకు దూరమై నరకజీవితాన్ని అనుభవిస్తూ,కన్నిరు తుడిచేవారేకరువై, మరణంకొరకు ఎదురు చూస్తూ వృద్ధాశ్రమాలలో జీవశ్చవాలుగా ,మూగరోదన చేసే తల్లులు ఎందరో.కన్నబిడ్డల తిరస్కారానికి గురై బస్ స్టాండ్ ,రైల్వేస్టేషన్లు ఆలయమండపాలలో తలదాచుకొంటున్నారు. తల్లి బ్రతికి ఉండగనే కాటిలో వదిలి వెళ్ళిన సంస్కారహీనులు మనలో లేక పోలేదు.పిడికెడు మెతుకులకొరకు జీవనసమరం సాగించే వారిని మనం నిత్యంచూస్తూనే ఉన్నాం.తల్లి పాదాలచెంత స్వర్గం ఉంది అన్న మహ్మద్ ప్రవక్త చెప్పిన వాక్కు నిత్యసత్యం.మనకు ఈజగాన్ని చూపించిన తల్లిని ఇదేజగంలో మనమెంత సుఖఃపెడుతున్నాం?ఈలోకంలో ఐదుగురు తల్లులు ఉన్నారని శాస్త్రం చెపుతుంది.
రాజః పత్ని గురోఃపత్ని భతృ పత్నీ చదైవచ
పత్నిమాతా స్వమాతాచ పంచైతా మాతరః స్మృతాః!!
మహరాజు ధర్మపత్ని,గురుపత్ని,అన్నభార్య,భార్యతల్లి,వీళ్ళంతా తల్లితొ సమానులే.ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు కావడంతొ ,కాలక్రమంలో మరమనుషుల్లా యాంత్రిక జీవనం గడపటంతొ ,ప్రేమానుబంధాలు, మానవీయవిలువలు, కనిపించకుండా పోతున్నాయి.డాలర్ల సంపాదనతొ విలాసవంతమైజీవనం,కృత్రిమ ఆనందాలు పొందవచ్చు.నిర్మలమైన తల్లిప్రేమ ముందు ఎన్నిడాలర్లు గుమ్మరించినా దిగదుడుపే.ఈదేహన్ని ప్రసాదించిన తల్లిరుణం ఏమిచ్చి తీర్చుకోగలం .అమ్మఒడిలో తలపెట్టిసేదతీరిన ఆనందానికి వెలకట్టే షరాబు ఈలోకంలో ఉన్నాడా? అమ్మనాదగ్గరఉంటుంది అనకుండా నేను అమ్మదగ్గరేఉన్నాను అనేవాళ్ళు నేడు ఎందరు? మనం ఎదటి స్త్రీని పిలిచేటప్పుడు అమ్మఅనిపిలుస్తాం.అంటే మరొకరి తల్లినికూడా మన తల్లిగా గౌరవించే గోప్పసంప్రదాయంలోను,స్త్రీని అమ్మవారిగా పూజించే సంసృతిలో పెరిగిన మనం నేడు ఆస్త్రీమూర్తులకు ఎలాగౌరవిస్తున్నామో అందరికి తెలిసందే.నేడు రోడ్లపై, .దేవాలయాలవద్ద,పలుకూడలి ప్రాంతాలలో ,అభిమానం చంపుకుని,దీనాతి దీనంగా ,ఆకలితో అలమటిస్తూ బ్రతకడంకొసం యాచన చేస్తున్న మాత్రుమూర్తులను చూస్తూనేడు "మదర్స్ డే"నిర్వహించడం హర్షణీయమా? ఆలోచించండి.ఏనాడు మనపెద్దలు పిడికెడు మెతుకుల కొరకు రొడ్డున పడకుండా పదిలంగా తమ సంతతి వద్ద ఉంటారో అదే నిజమైన "ఆదర్మడే"......
.

