
అది “వ్యాస” మహాభారతం
ఇది "శేష" మహాభారతం
శేషేంద్ర శర్మ ఆధునిక మహాభారతం
తెలుగు అక్షరాలు తెలిసినవారందరికీ గుంటూరు శేషేంద్రశర్మ పేరు గుండెల్లో కొట్టు కుంటూనే వుంటుంది!
ఆయన పుట్టింది నెల్లూరు జిల్లాలో చిన్న పల్లెలో. చదివింది “లా” అయినా “లాయర్” కాలేదు. చేసింది మూడు దశాబ్దాలకు పైగా మునిసిపల్ కమిషనర్. ఎన్నో “బాధల బస్తీ”లలో నివాసం. అయినా, “గుండెలతోనే ఆయన దోస్తీ”!.. ఈ పరిచయ వాక్యాలలో “ఇన్వర్టెడ్ కామాల” మధ్య యిరుక్కున్న పదాలు శేషేంద్రశర్మ తన “ఆధునిక మహాభారతం”లో సృష్టించిన అద్భుత, | అపురూప అక్షర లక్షలే!
“బాధల బస్తీ”,
“అయినా నాకు గుండెలతోనే దోస్తీ”
ఏమా, పదాల “శేషేంద్రజాలం!”
నాల్గవ ముద్రణకు నోచుకుని, మరెన్ని ముద్ర |ణలు వెలుగుచూస్తాయోనన్న ఉత్సుకత కలిగించే శర్మగారి "ఆధునిక మహాభారతం" ఆయన అసం ఖ్యాక వచన కవితల సమాహారం!
1970-84 సంత్సరాల మధ్య వెలువడిన ఆయన కవితా సంకలనాలను పర్వాలుగా పేర్కొంటూ
ఈ "ఆధునిక మహాభారతం”గా వెలువరించారు. ఇందులో ప్రతి పదం ఒక “శేష ప్రశ్నే”. అది ఆయన తనకు తాను వేసుకునే “శేష ప్రశ్న”. సమాజంపై సంధించే సశేష ప్రశ్న!
"నేను చెమట బిందువుని
కండల కొండల్లో ఉదయించే లోకబంధువుని
గుండెలతో నాకు దోస్తీ
నేనుండేది బాధల బస్తీ"--
శేషేంద్రుడు ప్రపంచ కవితా చక్రవర్తి. అటు పాశ్చాత్య సాహితిని, ఇటు ప్రాచ్య సాహిత్యాన్ని ఆయన పుక్కిట పట్టారు. ఇదంతా ఆయన ఎన్నో “బాధల బస్తీ”లకు పరిపాలకుడుగా వుంటూ!.. బహుశా “బాధల బస్తీ"లలో కాపురం చేయడం వల్లనే ఆయనకు "కలియుగ మహాభారతం” దృగ్గోచరమైందేమో!
బాధార్తులు నిత్య నిరాశోపహతులు. వారి బాధా, నిరాశా పరితప్త హృదయాలలో ఆశారేఖలను “ఇంజెక్టు” చేస్తూ--
"రేపు నీదే పద!
ఉదయించెనదే నవలోకం ఆరిపోనీకు సఖా
గుండెలో ఆశాదీపం
ఓడిపోయానని చింతించకు
పద్మవ్యూహం
జీవితం కాదిది అడుగడుగున ఒక పోరాటం
రాలనీబోకుము నీ కన్నులలో ముత్యాలు
మోయలేదీ భువి ఆ రగిలే సముద్రాలు
నీవు నీ పిల్లలు తోటల్లో విహరిస్తారు.
కోలుపోయిన నవ్వు తిరిగి సాధిస్తారు!”... ఏమా నవలోక శంఖారావం!
నిరాశోపహతు లకు నవ జీవన సందేశం!
ఒకటా, రెండా?..దాదాపు నాలుగు వందల పేజీల నిండా శేష కవీంద్ర సందేశాలతో విలసిల్లే ఈ "ఆధునిక మహాభారతం" ప్రతి అక్షరజీవి కర కమలాలలో, హృదయాలలో నిక్షిప్తం చేసుకోదగిన మహత్తర కవితాంజలి!
అలనాడు ద్వాపర యుగంలో వెలసింది “వ్యాస మహాభారతం”, ఈనాడు కలియుగంలో ఆవిర్భ వించింది ఈ "శేష మహాభారతం”!
అయితే, ఒక శేష ప్రశ్న!
ఇంతటి సాహిత్య సమ్రాట్టుకు ఒక ఉన్నత "పద్మ అవార్డు”, ఒక “జ్ఞాన పీఠాధిపత్యం” ఎందుకు దూర మైనాయన్నది అస్మదాదులకు మరో “శేష ప్రశ్న”? అది కోటి డాలర్ల ప్రశ్న!?...
'పద్మశ్రీ' తుర్లపాటి కుటుంబరావు
http://seshendrasharma.weebly.com/