గళ సంగమం1. - డా. బెల్లంకొండ నాగేశ్వరరావు

గళ సంగమం1.

గళ సంగమం . 1.

శ్రావ్యమైన సంగీతం,వీనుల విందైన గానం వినిపించినపుడు మనస్సు విహంగమై అంబరవీధుల విహరిస్తుంది. సంగీతం ఓచలమ వంటిది ఎంత తీసినా ఊరుతూనే ఉంటుంది. అలసిన శరీరానికి,మనస్సుకు దివ్య ఔషదం సంగీతం ,ఇటీవల కాలంలో మ్యూజిక్ థెరిపి కూడా ప్రవేశ పెట్టడం మనందరికి తెలిసిందే!.

మన తెలుగు సినిమాలలో గుర్తింపు లేకుండా ఎందరో నటీ,నటులు చరిత్రకు అందకుండా పోయినట్లే ,సినిమా పాటల్లో కూడా ఎందరో గాయని,గాయకులు లోక విదితం కాకుండా వెళ్ళిపోయారు. అటువంటి అపురూప గాయకుల గీతాలను మీకు గళ సంగమం పేరిట తెలుగు సినిమా పాట పుట్టిన దగ్గరనుండి వారందరిని రెండు వ్యాసాలలో తెలియజేసే ప్రయత్నమిది. నాప్రయత్నాన్ని ప్రొత్సహిహించి,నా ఈ రచనలు ఆదరిస్తారని ఆశిస్తాను.

తొలుత సినిమాల్లో నటీనటులు కన్నాంబ,భానుమతి,యస్ .వరలక్ష్మి నాగయ్య,సి.యస్ .ఆర్ .రేలంగి,శివరావు, అక్కినేని, వంటివారు తమ పాటలు తామే స్వయంగా పాడుకునేవారు. తెలుగు చలన చిత్రాలలో అరుదైన గాయని,గాయకులు కలసి పాడిన అపురూప గీతాలను మీకు తెలియజేసే ప్రయత్నమిది. ఈవ్యాసంలో తప్పులు ఉంటే తెలియజేయండి అలాగే మీకు తెలిసిన గళసంగమాలు ఉంటే నాకు తెలియజేయండి గళసంగమం రెండో భాగంలో వాటిని ప్రస్తావిస్తాను.

* తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలి నేపథ్య (ప్లేబ్యాక్) గాయని

రావు బాలసరస్వతీ దేవి,తొలి సినిమా పాట: 1943లో విడుదలైన 'భాగ్యలక్ష్మి' చిత్రంలో కమలా కోట్నిస్ కోసం "తిన్న మీద చిన్నోడా" అనే పాటను ఆమె పాడారు.

ప్రత్యేకత: తెలుగు తెరపై నటీమణులకి వేరే వారు పాటలు పాడే ప్లేబ్యాక్ విధానాన్ని ఈ చిత్రంతో ఆమె ప్రారంభించారు.

* మళ్ళిపెళ్ళి (1939 ) చిత్రంలో ' ఆచిత్ర సంగీత దర్శకుడు ఓగిరాల రామచంద్రరావు కథానాయకుడైన వై.వి. రావు కొరకు ' నాసురచిరు సుందరరూపా 'అనే యుగళ గీతం పాడారు,గ్రాంఫోన్ రికార్డుపై

వై. వి.రావు పేరు ఉన్నా గాత్రం వారిదికాదు.

* ఇదే చిత్రంలో ' ఆహా అభినవ కుసుమశరా లీలామోహన ' గానం.కొచ్చెర్లకొట సత్యనారాయణ, బెజవాడ రాజారత్నం , కాంచనమాల. మరలా వీరు కలసి పాడలేదు.

* లవకుశ (1934) చిత్రంలో ' ఆహా ఏమి నా భాగ్యము స్వామీ - శ్రీరంజని

రఘురామ చరితను వినవమ్మా - మాస్టర్ భీమారావు, మల్లీశ్వరరావు సాహసమేల ఈలీల జానకి వ్యధపడకే - పారుపల్లి సత్యనారాయణ హే రామా రాజీవ నయనా - పారుపల్లి సత్యనారాయణ, రంగాచారి

4. లంజ నీ వోటము - వెంకటాచలం, పద్మాబాయి. ఆలపించారు.

* బాలరాజు (1948 ) చిత్రంలో ' చాలు వగలు 'అనేపాట అక్కినేని నాగేశ్వరరావు,యస్ .వరలక్ష్మి ఆలపించారు. ఈదే చిత్రంలో 'చెలియా కనరావా 'పాట అక్కినేని ఆలపించారు.

* ముగ్గురు మరాఠిలు (1946 ) చిత్రంలో ' జైజై భైరవ త్రిశూలధారి - పి. కన్నాంబ,అక్కినేని,టి.జి.కమలాదేవి కలసి ఆలపించారు.

* యస్ . రాజేశ్వరరావుగారు కాలం మారింది ( 1972) చిత్రంలో ' మారదులే ఈకాలం మారదులే ఈలోకం పాట పాడరు అనంతరం మరే చిత్రంలోనూ వారు పాడలేదు.

* సుసర్ల దక్షణామూర్తి సకల్పం ( 1957) చిత్రంలో ' నావికా నడపరా నావ ' గీతం ఆలపించారు.

* గుణసుందరికథ (1949) ) చిత్రంలో ' చల్లని దొరవోయ్ ఓ చందమామా ' - కె.మాలతి ( పాతాళ భైరవి కథా నాయకి ) నటి శాంతకుమారి కలసి పాడారు వీరి గళ సంగమం మరే చిత్రంలోనూ లేదు.

* నర్తనశాల (1963 ) చిత్రంలో ' సలలిత రాగ సుధారస సారం 'పాట

మంగళంపల్లి,జానకి గార్లు ఆలపించారు. మరల వీరు ' వసంతగాలికి వలపులురేగ ' పాట అనంతరం పాడినట్లు తెలియడంలేదు.

* కర్ణ ( ) డబ్బింగ్ చిత్రంలో ' నీవు నేను కలసితిమి 'పాట ఆలపించారు.మరలా వీరు కలసి పాడలేదు.

సంతానం (1955 ) చిత్రంలో 'సంతోషమేల సంగీతమేలా ' పాట

జమునారాణి,జి,కే,వెంకటేష్ కలసి పాడారు. మరలా వీరు కలసి పాడలేదు. ఇదే చిత్రంలో ' నిదురపోరా తమ్ముడా 'పాట లతా మంగేష్కర్ ,

ఘంటసాలా ఆలపించారు.

* నవరాత్రి (1966 ) చిత్రంలో ' రాజు వెడలే సభకూ (వీధి భాగవతం) - ఘంటసాల, జయదేవ్, సావిత్రి, ఎస్. ఎస్. కృష్ణన్, నల్ల రామమూర్తి, సీతారాం

* వివాహబంధం చిత్రంలో ( 1964 ) ' నీటిలోన నింగిలొన నీవె ఉన్నావులే ' అనే పాట భానుమతి ,పి.బి.శ్రీనివాస్ గారు కలసి పాడారు మరే చిత్రంలోనూ వీరు మరలా కలసి పాడలేదు.

* రక్త సంబంధం (1962) చిత్రంలో ' కొత్త పెళ్ళికూతురా రా రా ' పాట స్వర్ణలత,వసంత,యల్ .ఆర్ .ఈశ్వరి,జమునారాణి కలసి ఆలపించారు. మరలా వీరి స్వర సంగమం మరే చిత్రంలోనూ జరగలేదు.

* లవకుశ (1963) చిత్రంలో ' జగదభి రాముడు శ్రీరాముడే ' పాట

ఘంటసాల,పి.సుసీల,పి.లీల,వైదేహి,పద్మ మల్లిక్ గార్లు ఆలపించారు. మరలా వీరి స్వర సంగమం జరగలేదు.

ఇదే చిత్రంలో 'వల్లనోరి మామా నిపిల్లని ' పాట ఘంటసాల,జిక్కి, జే.వి.రాఘవులు,రాణి కలసి పాడారు. మరలా వీరి గళ సంగమం జరగలేదు.

ఇదే చిత్రంలో ' శ్రీరామ పరంధామ 'పాట,ఘంటసాల,జే.వి.రాఘవులు, వైదేహి,ఏ.పి. కోమల,సౌమిత్రి కలసి పాడారు .మరల వీరి గళసంగమం జరుగలెదు. మరియు...
' అశ్వమేధయాగానికి జయము ' అనే పా ఘంటసాల,మాధవపెద్ది ,రాఘవులు,రాణి,సరోజిని .కలసి ఆలపించారు.

పరమానందయ్య శిష్యుల కథ (1966) చిత్రంలో 'నమో భగవతే రుద్రాయ నీలకంఠాయ (శివార్చన) నటుడు వడ్లమాని విశ్వనాథం. ఆలపించారు.

ఇదే చిత్రంలొ ' పరమగురుడు చెప్పిన వాడు పెద్ద మనిషి కాడురా ' పాట - జె.వి.రాఘవులు, అప్పారావు, పిఠాపురం నాగేశ్వరరావు ..ఆలపించారు .మరే చిత్రంలోనూ వీరి గళ సంగమం జరుగ లేదు.

* భక్తప్రహ్లద ( 1967) చిత్రంలో 'అందని సురసీమ నీదేనోయి ' సుసీల,జానకి, శూలమంగళం రాజ్యలక్ష్మిలు పాడారు.అ

* రహస్యం ( 1967)గిరిజా కల్యాణం ఆలపించినవారిలో ఘంటసాల, , పి.సుశీల, లీల, కోమల, వైదేహి, పద్మ, మల్లిక్, మాధవపెద్ది .

ఇదే చిత్రంలో లలితభావ నిలయ నవరసానంద హృదయా - ఘంటసాల, వైదేహి, కోమల, పద్మ, సరోజిని . ఈరెండు పాటలలోని గాయని,గాయకుల గళ సంగమం మరలా జరగలేదు.

* సిరి సంపదలు (1962 ) చిత్రంలో ' వేణుగానమ్ము వినిపించెనే 'అనే పాట జిక్కి,సుసీల,జానకీ గార్లు ఆలపించారు .మరలా వీరి గళ సంగమం ఏచిత్రంలోనూ వినిపించదు.

* అప్పుచెసి పప్పుకూడు ( 1959 ) చిత్రంలో 'సుందరాంగులను చూసినవేళల 'ఏ.యం.రాజా,ఘంటసాల,పి.లీల అలపించారు. వీరి గళసంగమం మరేచిత్రంలోనూ వినిపించదు.

* చదువుకున్న అమ్మాయిలు (1963) చిత్రంలో ని రెండు పాటలు ' ఏండోయ్ నిదుర లేవండోయ్ ' ఆశా కులకర్ణి . ' ఓహో చక్కని చిన్నది ' పి.బి. శ్రీనివాస్ ,ఆశాకులకర్ణి ఆలపించారు. మరాఠా కుచెందిన ఆశాకులకర్ణి మరే చిత్రంలోనూ పాడలేదు.

* మనో రమ ( 1959) చిత్రంలో ' అందాలసీమా సుధా నిలయం ఈ లోకమే దివ్య ప్రేమమయం ' పాటతోపాటు మరికొన్ని పాటలు తలక్ మహ్మమూద్ పాడారు. మరలా వారి గళం తెలుగులో రాలేదు.

* జయభేరి ( 1959) చిత్రంలో ' రసికరాజా తగువారముకామా ' ఘంటసాల,పి.బి.శ్రీనివాస్ ,పాణిగ్రహి చక్రపాణి కలసి పాడారు మరలా వీరి గళసంగమం జరుగలేదు.

పాణిగ్రహి చక్రపాణి ,పిసుసీలతోకలసి ఇలవేల్పు( 1956) చిత్రంలో 'చల్లని రాజా ఓచందమామా పాడారు.

* భక్త రామదాసు ( 1964) చిత్రంలో కొన్ని అపురూప గళ సంగమాలు.

అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి -ఘంటసాల,నాగయ్య, పి.బి.శ్రీనివాస్,కోమల బృందం .

ఏదేశమునుండు వారు ఎందుండి ఇటు - మాధవపెద్ది,గోవిందరాజన్,సుందరం

ఓ సాధులారా ఓ భక్తులారా శ్రీరామ చంద్రుని సేవింప - నాగయ్య, టి.జి. కమలాదేవి బృందం

మోహనాకారా రామా రామా మోహనవిదారా రామా - శూలమంగళం సోదరీమణలు.

సున్ బీలే భక్తొoకి పుకార్ తన్మన్ మే , మహ్మద్ రఫీ,

* దొంగ రాముడు (1955) చిత్రంలో ' రారోయి మాఇంటికి ' పాట జిక్కి ఆలపించగా ,మద్దాల కృష్ణమూర్తి గళం జతకలిపారు.

* రాజనందిని ( 1958) చిత్రంలో ' చిక్కావులేరా సక్కని రాజా 'పాట జిక్కి ఆలపించగా మహంకాళి వెంకయ్య గళం జత కలిపారు.

* మహకవి కాళిదాసు ( 1960) చిత్రంలో ' రసిక రాజ మణ రాజిత సభలో ' పి.లీల, రాజ్యలక్ష్మి ఆలపించారు.

* గాలిమేడలు ( 1962) చిత్రంలో 'ఈమూగచూపేలా బావా ' రేణుక,ఘంటసాల ఆలపించారు.

* లక్షాధికారి ( 1963) చిత్రంలో ' అద్దాలమేడ ఉంది అందాల భామ - ఘంటసాల,కె.జమునారాణి,మాధవపెద్ది .ష

అచ్చమ్మకు నిత్యము శ్రీమంతమాయెనే పిచ్చయ్యను చూడ ' - స్వర్ణలత ,రాణి, వైదేహి,

ఈరెండు పాటలు అరుదైన గళ సంగమమే.

* తిరుపతి చిత్రంలో ' దేశం పన్నెండుసార్లు నారాయణమ్మో'

జానకి తోకలసి అల్లు రామలింగయ్య పాడారు.

* ఇల్లు ఇల్లాలు (1972) చిత్రంలో ' వినరా సూరమ్మ కూతురు మొగుడా ' పాట ,జానకి,రాజబాబు ఆలపించారు.

* గబ్బర్ సింగ్ ( 2012) చిత్రంలో ' మందుబాబులం మేము మందు బాబులం ' పాట కోటా శ్రీనివాసరావు గారు ఆలపించారు.

సేకరణ.

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - Atha sommu alludu danam
కాశీ ప్రయాణ కథలు - అత్తసొమ్ము అల్లుడు..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Samasya manadi-Salahaa vaalladi
సమస్య మనది… సలహా వాళ్లది!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Anthuleni rahasyam gaa mighilina minchesot mystery house
అంతులేని రహస్యం - వించెస్టర్...
- డా:సి.హెచ్.ప్రతాప్
Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్
Kuldara Mystery
కుల్ధారా మిస్టరీ
- డా:సి.హెచ్.ప్రతాప్