మంగళగిరి గాలిగోపురం మార్కాపురం గాలిగోపురములు - కుందుర్తి నాగబ్రహ్మచార్యులు

మంగళగిరి  గాలిగోపురం మార్కాపురం  గాలిగోపురములు

ఈ నాడు మనం చూస్తున్న మంగళగిరి మరియు మార్కపురం గాలిగోపురము ల నిర్మాణ విషయములు లో ఎదురైన అనుకోని ఉపద్రవములు ను పరిష్కరించిన శిల్పాచార్యుల శ్రమ ఫలితమే ఈనాటికి కూడా శోభాయమానము గా విరాజిలుతున్న ఆ రెండు దేవాలయములు గోపురములు. సుమారు క్రీస్తు శకం 1556 వ సంవస్తర ప్రాంతములో కంచి క్షేత్రం నుంచి విశ్వకర్మ వంశ శిల్పాచార్యులు ఇద్దరు మార్కాపురం చెన్నకేశవ స్వామి దేవాలయం గాలిగోపురం మరియు మంగళగిరి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం గాలిగోపురం నిర్మాణము జరుగుతున్న సమయములో మంగళ గిరి 11 అతస్తులు 150 ఆడుగులు గాను మార్కాపురం 9 అంతస్తులు 120 అడుగులు గాను నిర్మాణములు మొదలు అయ్యాయి. మంగళగిరిలోని గోపురం నిర్మాణం అడుగున ఉన్న రాతి దూలం విరిగి పోయింది దాని వాళ్ళ ఈశాన్య భాగం కు ఒరిగి పోయింది.అదే సందర్భ సమయానికి మార్కాపురం గాలి గోపురం పూర్తి అవుతుంది అనే సమయములో గాలి గోపురం దూలం ఒకటి విరిగి పోయింది. ఈ రెండు గాలిగోపురములు నిర్మాణ సమయములో తలెత్తిన ఈ సమస్యల పరిష్కారానికి ఇద్దరు స్తపతులు ఒకరిని ఒకరు సంప్రదించు కోవాలి అని అనుకోని వారి వారి నిర్మాణ ప్రాంతములు నుంచి బయలు దేరి ప్రస్తుతం వినుకొండ ప్రాంతము వద్ద ఉన్న చీకటి ఈగల పాలెం దగ్గర ఒకప్పుడు కుండిన నది గా పిలిచే ప్రస్తుత గుండ్లకమ్మ అనే నది వద్ద సాయం సంధ్యవందన సమయములో కలిసి నది ఒడ్డున సంధ్యావందనమ్ పూర్తి చేసుకొని నిర్మాణ సమస్యలు గురించి చర్చ చేసుకున్నారు. వారిలో ఒక స్థపతి గారి పేరు ఆనంద వర్దన స్థపతి. మార్కాపురం స్థపతి గారు మంగళగిరి గోపురం ను ఉద్దేశించి ఈశాన్యం ఒరిగింది అని అన్నారు కదా నైరుతి కాళీ లేదా అని అన్నారు. అప్పుడు మంగళగిరి స్తపతి గారికి ఒక ఆలోచన మదిలో మెదిలి మంగళగిరి గాలిగోపురం కు నైరుతి భాగములో ఒక చిన్న కొలను తవ్వించారు .దాని నీటి వలన మట్టి జారీ పక్కన ఉన్న గోపురం ఈశాన్య ఒరిగిపోయినది సరి అయ్యిన్ది సమ భాగములో సరి అయినా రీతిగా అగుపించిన పిదప ఆ కోనేరు మూసి వేశారు. ఆనాటి నుంచి ఈనాటి వారు ఆ కోనేరును చీకటి కోనేరు అని పిలిచే వారు. ఆవిధముగా ఆ మంగళగిరి గాలిగోపుర నిర్మాణ సమస్య తీరినది. ఇక మార్కాపురం గోపుర విషయములో చర్చ దూలం విరిగింది అన్నావు ఆ దేశం లో కందులు పండడం లేదా అని అనుకునే సందర్భములో మదిలో మెదిలిన ఆలోచన ద్వారా మార్కాపురం స్తపతి గారు కందులు ను గోతాల లో నింపి వాటి పైన నీటిని చల్లడము ఆ నింపిన గోతాలు గోపురం నిర్మానమునకు అమర్చి నీటి ద్వారా నానిన కందులు ఉబ్బడం వలన ఆ నిర్మాణము సరి చేసే మార్గం సులభతరము అయినది.

మరిన్ని వ్యాసాలు

Kaka o andamaina baakaa
కాకా... ఓ అందమైన బాక!
- ..... బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - garvam veedina raju
కాశీ ప్రయాణ కథలు - గర్వం వీడిన రాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అద్దంకి శ్రీరామమూర్తి.
అద్దంకి శ్రీరామమూర్తి.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Palatho kadigina boggu
పాలతో కడిగిన బొగ్గు!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - navvina naapachenu
కాశీ ప్రయాణ కథలు - నవ్విన నాపచేను..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
భారతీయ ప్రాచీన విషిష్ట ప్రదేశాలు.
భారతీయ ప్రాచీన విషిష్ట ప్రదేశాలు.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు