చింటూలో భయం పోయింది - నారంశెట్టి ఉమామాహేశ్వరరావు

Chintoo lo bhayam poyindi


చింటూ ఐదో తరగతి చదువుతున్న కుర్రాడు. చాలా ముద్దుగా ఉండడంతో అమ్మానాన్నలు ఎక్కువ ముద్దు చేసారు. దాంతో ప్రతిదానికి తల్లిదండ్రుల మీదే ఆధారపడటం అలవాటైంది .
హోంవర్క్ చేయాల్సి వస్తే “అమ్మా, నువ్వే చెప్పు” అని, షూస్ కట్టుకోవాలంటే, “నాన్నా, నువ్వే కట్టివ్వు” అని ప్రతిపనికీ ఆధారపడేవాడు. అదే కాదు ఏదైనా సమస్య వస్తే ఆలోచించకుండానే పెద్దలను అడిగేవాడు.

ఒక రోజు పాఠశాలలో “రేపు స్వయం సహాయక దినోత్సవం జరుపుతున్నాము. పిల్లలందరూ మీ పనులు మీరే చేయాలి” అని చెప్పారు. అది వినగానే చింటూకి భయం వేసింది.

“మీ సాయం లేకుండా నేనెలా చెయ్యగలను?” అని భయపడుతూ ఇంట్లో అమ్మని అడిగాడు.

“ఏమాత్రం భయపడకుండా సొంతంగా ప్రయత్నించు. అందులో ఆనందం కలుగుతుంది. నువ్వు తప్పక చేయగలవు” అని అమ్మ ధైర్యం చెప్పింది.

పాఠశాలలో చింటూకి పరీక్ష మొదలైంది. తన పెన్సిల్ బాక్స్ మర్చిపోయాడు. మామూలు రోజుల్లో అయితే ఏడ్చేవాడు. కానీ ఆ రోజు అమ్మానాన్నలు లేరు కాబట్టి కాసేపు ఆలోచించాడు. పక్కన ఉన్న స్నేహితుడిని పెన్సిల్ ఇమ్మని అడిగి తీసుకున్నాడు.

చింటూకి ఎంతో ఆనందం కలిగింది “నా సమస్యను నేనే పరిష్కరించాను!” అనుకున్నాడు.

తర్వాత డ్రాయింగ్ పోటీ జరిగింది. “ఏం గీయాలి?” అని ఎవరినీ అడగలేదు. కళ్ళు మూసుకుని ఆలోచించాడు. తమ గ్రామం, చెట్లు, కొండలు, చెరువు, పిల్లలు ఆడుకుంటున్న దృశ్యాన్ని గీశాడు.

ఉపాధ్యాయురాలు ఆ చిత్రాన్ని చూసి ఎంతో మెచ్చుకుంది.
అప్పుడు చింటూకి ఒక విషయం అర్థమైంది. “అన్నిటికీ అమ్మానాన్నలపై ఆధారపడితే ఆలోచనా శక్తి పెరగదని, భయం పెరుగుతుందని, సొంతంగా ఆలోచిస్తే ధైర్యం వస్తుందని” తెలిసింది.

ఇంటికి వెళ్లి అమ్మనాన్నలతో “రేపటి నుంచి నా పనులన్నీ నేనే చేస్తాను. అవసరమైతేనే మీ సాయం అడుగుతాను” అన్నాడు .

వాళ్ల అమ్మానాన్నలు ఆనందంతో రాముని హత్తుకున్నారు.
——@@@——


మరిన్ని కథలు

Maa Inti TV (feelgood story)
మా ఇంటి టి.వి (feelgood story)
- అనిసా తబస్సుమ్ sk
Raanunna kaalam
రానున్న కాలం
- మద్దూరి నరసింహమూర్తి
Tana kopame tana shatruvu
తన కోపమే తన శత్రువు!
- - బోగా పురుషోత్తం
Bongaram
బొంగరం
- సూర్య. మండా (MS)
Vellanu
వెళ్ళను
- isun finn
Punyakoti
పుణ్యకోటి
- కామేశ్వర రావు రాపాక
Prema.. O maaya
ప్రేమ.. ఓ మాయ
- డా:సి.హెచ్.ప్రతాప్
Doutya vijayam
దౌత్య విజయం
- డా:సి.హెచ్.ప్రతాప్