బృహదీశ్వర దేవాలయం నిర్మించిన ప్రధాన శిల్పి గారికి ప్రతి నిత్యం తాంబూలం వేసుకునే అలవాటు ఉన్నది.అలా తాంబూలం వేసుకొని శిల్ప పని చేసే వారు ఆరోజుల్లో తాంబూలం వేసుకొని నమిలిన పిదప ఆ ఉమ్మిని కూడా భూమిమీద వేయరు ఒక చిన్న పాటి చెంబు లాంటి పాత్ర లో ఉమ్మే వారు శిల్పి గారు కూడా తనతో పాటు ఉండే ఒక చిన్న పాత్ర ఆ పాత్ర పట్టుకునే పిల్లవాడు ఉండే వారు. ఒకసారి శిల్పి గారు తాంబూలం వేసుకొని పని చేస్తుంటే పిల్లవాడు అక్కడనే ఉన్నాడు అనుకోని ఉమ్మి పాత్ర అడుగుతాడు.అదే సందర్భములో అక్కడికి పని పర్యవేక్షణ కోసం వచ్చిన చోళ మహారాజు రాజ రాజ చోళన్ శిల్పి యొక్క ఉమ్మి పాత్ర తీసుకొని శిల్పి యొక్క ఉమ్మినీ పాత్రలో పడుతారు. అలా పట్టినా మహారాజు గారితో అయ్య పొరపాటు అయ్యింది క్షమించండి అని శిల్పి అంటే లేదు లేదు మీవంటి శిల్ప కళ నిష్ట్నాతుల యొక్క ఉమ్మి పట్టినా నాకు ఏం దోషం రాదు లె అలా పట్టడం నా భాగ్యం అని అంటారు .. ఈ విషయం అంత కూడా తమిళనాట సినిమా లో శివాజీ చోళ రాజుగా నటించిన సినిమా లో వచ్చింది.....

