కేరళ శబరిమల దేవాలయం నిర్మాణ చరిత్ర
ట్రావెంకోర్ ఆస్థాన స్థపతి శ్రీకృష్ణమాచార్య
ట్రావెన్ కోర్ సంస్థానం కు రాజుగా శ్రీ మూలం తిరునాల్ మహారాజు (1885- 1924) గారి కాలంలో ఆస్థాన స్థపతి గా ఉన్న శ్రీ కృష్ణమాఆచార్య
" తిరువనంతపుర వాస్తు శిల్ప శాస్త్ర విశారదన్ (తచ్చు శాస్త్ర విశారదన్ ) " అనే బిరుదును ఇచ్చారు, శబరిమలలోని ప్రస్తుతం చూస్తున్న ఆలయ సముదాయం, 18వ మెట్టుతో సహా, వీరు ఇరువురి పర్యవేక్షణలో నిర్మించబడింది. ఆ సమయంలో స్థపతి కృష్ణమాచార్య గారికి గుర్రపు బండిలో ప్రయాణించే హక్కును రాజు మంజూరు చేశాడు. కొల్లంలోని పుత్తు-కులంగర ప్యాలెస్ కాంపౌండ్‌లో దేవాలయం యొక్క వడ్రంగి పని జరిగింది మరియు తరువాత వాటి చెక్క భాగాలను 1907లో శబరిమలకు తీసుకువచ్చారు. మలయాళ భాషలో మావెలిక్కర తఝక్కర పోలాచిరక్కల్ కొచు తొమ్మంతరకన్ చెక్క రకల నిర్మాణాలను గడ్డి మరియు అరటి ఆకులతో చుట్టి, వాటిని సమీపంలోని కొల్లం సరస్సు ద్వారా కొట్టాయంకు పడవ ద్వారా, అక్కడి నుండి ఎద్దుల బండి ద్వారా మణిమల వరకు, ఆపై తలవ తవి ఎరుమేలి ద్వారా సుమారు నూట యాభై నుండి రెండు వందల మంది సహాయంతో, జంతువులు ఉండే దట్టమైన అడవి గుండా
తుపాకులు, పటాకులు వంటివి రక్షణ గా ఉపయోగించుకొని వాటి ద్వారా రవాణా చేసుకొని , ప్రజలు అక్కడ తాత్కాలిక గుడిసెలు నిర్మించి తాత్కాలిక నిర్మాణాలను నిర్మించి, పనిని పూర్తి చేశారు.
కేరళ శబరిమల అయ్యప్ప స్వామి వారి దేవాలయం లో బంగారు తాపడం పునరుద్ధరించిన విశ్వకర్మ వంశ స్వర్ణకార శిల్పులు శ్రీ అనంతన్ ఆచార్య అతని కుమారుడు
ధర్మశాస్త్ర (అయ్యప్ప స్వామి)
కేరళ లోని శబరిమలై దేవాస్తనం లోఉన్న స్వామి ధర్మశాస్త్ర యొక్క మూల విరాట్ పంచ లోహ విగ్రహము ను తయారు చేసిన విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు.శబరిమలలో ప్రస్తుతం చూస్తున్న ధర్మ శాస్త్ర పంచలోహ విగ్రహం చెంగనూర్ నీలకంఠ పనిక్కర్ అయ్యప్ప పాణికర్ తయారు చేశారు .
శబరిమల ఆలయాన్ని 1951లో పునరుద్ధరించారు.
తమిళనాడులో ని తిరునల్వేలి ప్రాంత వాసి
ఓ వేలాయుదన్ ఆచార్య మట్టి తో తయారు చేసిన ధర్మ శాస్త్రను ట్రావెన్ కోర్ రాజ కుటుంబానికి ఇచ్చారు.ఈ ఆచార్య శ్రీ పద్మనాభ స్వామి ఆలయాన్ని పునర్నిర్మించడానికి తిరువనంతపురం వచ్చారు.దీనిని ఆధారంగా చేసుకొని చెంగనూర్ ప్రాంతములోని సుపర్ణశ మరియు విశ్వగ్న గోత్రికులు అయిన నీలకంఠ పనికర్ ఆచార్య మరియు అయ్యప్ప పనికర్ ఆచార్య. వీరు ఇరువురు సోదరులు.వీరు మొదట్లో శిలా శిల్పులు తరువాతి కాలంలో పంచలోహ మూర్తులను తయారు చేసినారు.మావెలిక్కర కందియూర్ కొచ్చు తోప్పిల్ వద్ద స్వర్ణ పతాకాన్ని కరుణాకరన్ ఆచార్య తయారు చేశారు. నాగర్కోయిల్కు చెందిన కృష్ణన్ ఆచార్య ఈ రాతి పనిని చేశారు. అయ్యప్ప పనికర్ ఆచార్య యొక్క కుమారులు ఇప్పటికి కూడా ఇదే వృత్తి లో ఉన్నారు . వీరి ఇంటి పెరు తట్టవిల రాజరత్నం ఆచార్య ఫోన్ నెంబర్ 97445 50220.
విశ్వకర్మ వంశీయుల దార్శనిక దృష్టి ఈ ఘంటల సృష్టి
ఈ చిత్రం లో మీరు చూస్తున్నది కేరళ లోని శబరిమల దేవస్థానం అయ్యప్ప స్వామి వారి బంగారు మెట్టుగా పిలిచే 18వ మెట్టుకు ఇరువైపులా ఉండే రెండు పెద్ద గంటలు.ఇవి 18వ మెట్టు ఎక్కుతున్న భక్తుడికి తత్త్వమసి అనే వేద శ్లోకంతో ఓం కార ద్వని తో స్వాగతం పలికేవి.వీటికి ఒక ప్రత్యేకత ఉన్నది.
1950 వ సంవత్సరంలో శబరిమల ఆలయము లో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత ఆ ఆలయం పునర్నిర్మించినప్పుడు, ఆలయంలో దెబ్బతిన్న పంచలోహ విగ్రహాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు.
విశ్వకర్మ వంశీయులు చెంగన్నూరు తట్టవిల సోదరులు అయ్యప్ప పనికర్, నీలకంఠ పనికర్‌లు తయారు చేసిన కొత్త అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠాపనకు సిద్ధం చేశారు.
నిర్జీవ పాత విగ్రహాన్ని , నది లేదా సముద్రంలో నిమజ్జనం చేస్తారు.
కానీ ఆ విశ్వకర్మ వంశీయ సోదరులకు మదిలో కొన్ని కోట్లమంది దర్శించుకున్న ఆ మూర్తిని నిమజ్జనం చేయడానికి మనస్సు రాలేదు అప్పటి యాజమాన్యం మరియు తంత్రి ల అనుమతితో ఆ పాత మూర్తి యొక్క దైవత్వం భక్తుల కంటికి కనపడేవిధముగా ఇలా స్వామి వారి. 18 మెట్టు దగ్గర రెండు గంటల రూపంలో ఏర్పాటు చేసి మన అందరికీ ఓం కార ద్వని రూపములో ఆ పాత పంచ లోహ మూర్తి యొక్క దైవత్వాన్ని ఇలా లోకమునకు అందించిన ఆ విశ్వకర్మ వంశ సొదరులకి ఇవే మా నమస్సులు.
శబరిమల స్వర్ణ ధ్వజస్థంభం ( థంకధ్వజం) శిల్పాచార్యులు.
6 జూలై 1980న, శిల్పి అను అనంతన్ ఆచారి కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని పరుమలలో శ్రీమతి పుష్పకుమారి మరియు ప్రసిద్ధ శిల్పి శ్రీ అనంతన్ ఆచారి దంపతులకు జన్మించారు, సంప్రదాయ తమిళ విశ్వకర్మ కుటుంబం వారు 'కట్టుంపురత్' నుండి వచ్చారు. ప్రపంచంలోని అనేక దేవాలయాల కోసం అనేక ధ్వజస్తంభాలు ,జెండా స్తంభాలు, శిల్పాలు మరియు ఇతర ఆలయ సంబంధిత నిర్మాణ పనులను రూపొందించి, నిర్మించే అదృష్టం వారికి లభించింది.తన తండ్రితో పాటు, అను అనంతన్ శబరిమల వద్ద స్వర్ణ ధ్వజస్తంభం (ధ్వజ) నిర్మాణంలో చురుగ్గా పాల్గొని కీలక సహాయం చేశారు. అను అనంతన్ ఆచారి అయ్యప్ప భగవంతుని యొక్క "వాజివాహనము"ని సన్నిధానానికి తీసుకువచ్చే భాగ్యం కలిగి ఉన్నారు.ఆర్టిసన్స్ హ్యాండిక్రాఫ్ట్స్ & మెటల్స్, ఆర్టిసన్స్ మెయింటెనెన్స్ & ట్రెడిషనల్ ట్రేడింగ్ కంపెనీ మరియు అంబాడి ప్రొడక్షన్స్ డైరెక్టర్. అను అనంతన్ మలయాళ టెలివిజన్ మరియు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా మరియు వ్యాఖ్యాతగా కూడా పాపులర్.
'"శబరీశాంతే ద్వజస్తంభం" అనే డాక్యుమెంటరీ,
ఇది శబరిమల యొక్క 'ధ్వజస్తంభం' యొక్క నిర్మాణం, ప్రాముఖ్యత మరియు గొప్పతనాన్ని వివరంగా మరియు దృశ్యమానం చేస్తుంది. ఇదే ప్రాజెక్ట్‌ను ఆయన రూపొందించారు మరియు దర్శకత్వం వహించారు. ప్రముఖ పబ్లిషర్స్, డిసి బుక్స్ మే 2022లో ఆయన రాసిన "అయ్యప్పనుం సిల్పియుమ్" అనే పుస్తకాన్ని విడుదల చేసింది.

