కంచే చేను మేస్తే. - డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.

Kanche chenu meste

పూర్వం అంగరాజ్యాన్ని మాళవ భూపతి అనే రాజు పరిపాలిస్తుండేవాడు.

ఒకరోజు ఒపండితుడు రాజ సభలో ప్రవేసించి ' ప్రభువులకు జయమగుగాక

ఈ భూమిపైన సూర్యచంద్రులు ఉన్నంతకాలం శౌర్యం లో శ్రీరామని అంతటి వాడిగా,దానంలో శిబి చక్రవర్తి అంతటి వారిలా తమ కీర్తి పతాకం నిలిచి ఉంటుంది ,పండితుడను ,పేదవాడిని తమ దానగుణం విని సుదూరం నుండి వచ్చాను ,నాకుమార్తె వివాహం తలపెట్టాను తమరు దయతో ఆర్ధిక సహయం అందిస్తే నాఇంట శుభకార్యం నడుస్తుంది' అన్నాడు.

పండితుని పొగడ్తలకు పొంగిన రాజు అతనికి వందవరహలు ఇచ్చి పంపించాడు.

అప్పటివరకు గవాక్ష వద్దనున్న హంస రాజు వద్దకు వచ్చి మానవ భాషలో ' రాజా ఇది అపాత్రదానం పేదవారిని ఆదుకోవలసిందే ,అతని పాండిత్యం పరిశీలించకుండ దానం చేసావు మీరు దానం చేసిన ధనం ఎవరిది ప్రజలది ఆధనాన్ని తమరు అనుభవించవచ్చు కానీ దానం చేయడం తప్పు. తమరికి శ్రీరాముని నిజాయితీ గురించి మరింత వివరణ ప్రత్యక్షంగా తెలియజేస్తాను .నావెంట మూడు గుర్రాలపై వేగంగా ప్రయాణించగల నిజాయితీ పరులైన ముగ్గురు భటులను పంపండి ' అన్నది.

హంస వెంట బయలు దేరిన రాజభటులు కొద్ది రోజుల ప్రయాణం అనంతరం

అయ్యాధ్య పొలిమేరలు చేరారు. 'రాజ భటులు అదిగో కనిపిస్తున్న మర్రి చెట్టు ఊడలకు వేళ్ళాడుతున్న వజ్రాల మూట ఉంది ఆమూటను మీరాజు గారికి అందజేయండి 'అని హంస వెళ్ళిపోయింది.

మూటవిప్పిచూసిన రాజభటులు కళ్ళు చెదరేలా పండు నిమ్మపండు రంగులోనూ,అదే లావు కలిగిన ముఫై రెండు వజ్రాలు కనిపించాయి.

' ఒరేయ్ మనం ఎన్ని వజ్రాలు తీసుకు వెళ్ళేది రాజు గారికి కానీ,హంసకు కానీ తెలియదు కనుక మనం తలా ఒక వజ్రం తీసుకుని మిగిలినవి రాజుగారికి ఇద్ధాం 'అన్నాడు ,మిగాలిన వారుకూడా సమ్మతించి తాము తలా ఒక వజ్రం దాచుకుని మిగిలిన వజ్రాల మూటను మంత్రి,సేనాపతికి అందించారు. అవజ్రలను చూసిన మంత్రి, సేనాపతి చెరి ఒకటి దాచుకుని మిగిలినవి రాజుగారికి అందించారు.

వజ్రాల మూటవిప్పిన రాజుగారు వజ్రాలను చూసి చాలా ఆనందించాడు,పక్కనే ఉన్నమహరాణి ' ఈవజ్రాలు ఇరవై ఎనిమిదే ఉన్నాయి మరో అయిదు ఉంటే నేను వజ్రాల హరం చేయించుకుంటాను మరో అయిదు వజ్రాలు తెప్పించే ఏర్పాటు చేయించండి ' అన్నది.

మరుదినం రాజసభలో ప్రవేసించిన హంసను చూసిన మహరాజు 'హంసా కుశలమా నీవు పంపిన ఇరవై ఎనిమిది వజ్రాలు నావద్దకు చేరాయి అటువంటివే మరో అయిదు వజ్రాలు ఉంటే మామహరాణి వజ్రాలహరం చేయించుకోవాలని ముచ్చట పడుతుంది ' అన్నాడు.

' మహరాజా సీతాదేవి తన పుట్టింటి నుండి వస్తూ ,అయొధ్య నగర పొలిమేరలలో లభించిన ఈవజ్రాలమూటను తాకడం ఇష్టం లేక భటులచే అక్కడఉన్న మర్రి చెట్టు ఊడలకు వజ్రాలమూటను వేలాడదీఇంచి వెళ్ళిపోయింది. నాటినుండి నేటి వరకు అయోధ్య వాసులు పరులసోమ్ము పాము వంటిది అని ఆవజ్రాల మూటను తాకలేదు శ్రీరాముని పాలన అంటే నిజాయితీకి మారు పేరులా నిలచింది. అయోధ్యలో ముఫై రెండుగా బయలు దేరిన వజ్రాలు తమరి చేతికి అందే సరికి ఇరవై ఎనిమిదిగా ఎలామారాయో వివరించి ,కంచే చేను మేయడం అంటే ఇదే తమరి పాలనలో లోపించినది నిజాయితి.

'' హంసా నాపనివాళ్ళు అవినీతిపరులేమో కాని నేను మాత్రం శ్రీరాముని నిజాయితికి ఏమాత్రం తీసిపోను '' అన్నాడు రాజు.

" మహరాజా పెద్దలు ఇంటిలోనికి వెళ్ళేముందు కాళ్ళు కడిగి వెళ్ళాలంటారు .ఎందుకో తెలుసా ఆరోగ్యంతోపాటూ,,మరి మనదికాని దుమ్ముకూడా మన ఇంట్లోకి రాకూడదు అని మరి నీవేమో పరుల వజ్రాలతో నీ భార్యకు వజ్రాలహరం చెయించాలి అనుకున్నావు. పరులసొమ్ము తన రాజ్యంలోనికి రావడానికి ఇప్టపడని శ్రీరామచంద్రునితో నీకుపోలికా ఆత్మవంచన చేసుకోకు " అని హంసవెళ్ళిపోయింది.

జ్ఞానోదయం కలిగిన రాజు పరిపాల యంత్రాంగంలో మార్పులుచేసి ,అవినీతిపరులను శిక్షించి నిజాయితీతో చక్కనిపాలన సాగించాడు రాజు .

మరిన్ని కథలు

Aakali nerpina paatham
ఆకలి నేర్పిన పాఠం
- సి.హెచ్. ప్రతాప్
Nenu manishine
నేను మనిషినే
- బోయ మహేష్
Maname Aadukovaali
మనమే ఆదుకోవాలి
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Nijaayitee
నిజాయితీ
- సూర్య. మండా(MS)
Gurudakshina
గురుదక్షిణ
- భ్రమరాంబికా సాయిశ్రీ మిరియాల
Gruhame kadaa swarga seema
గృహమే కదా స్వర్గసీమ
- వేముల శ్రీమాన్
Bhakthi deepam
భక్తి దీపం
- డా:సి.హెచ్.ప్రతాప్