కాశీ ప్రయాణ కథలు - దూరపు కొండలు నునుపు - డా. బెల్లంకొండ నాగేశ్వరరావు

Kashi Prayana Kathalu -  doorapu kondalu nunupu

కాశీ ప్రయాణ కథలు. 5.

పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి, శ్రీలక్ష్మి, శివయ్య, పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరంకొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు బయలుదేరారు.

రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకుతిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.

"తమ్ముళ్ళు ఈరోజు మీకు దూరపు కొండలు నునుపు అనే కథ చెపుతాను వినండి అని బ్రహ్మయ్య కథ చెప్పడం ప్రారంభించాడు...

భువనగిరి రాజ్య పొలిమేరలలో అడవికిచేరువలో ఉన్న సుద్దపల్లి గ్రామంలో సోమన్న అనే చిరు వ్యాపారి ఉండేవాడు. అతని ఇంటిముందు పసువుల పాకలో గుర్రం , గాడిద, మేకలు,కోళ్ళు వంటివి ఉండేవి. సోమన్న ప్రతిరోజు తన ఎక్కే గుర్రం పైన కొన్ని సరుకులు,తన గాడిదపైన చింతపండు, ఉల్లిపాయలు, బెల్లం వంటి తదితర నిత్యావసర సరుకులు వేసుకొని పరిసర గ్రామాలలో అమ్మూతూ ఉండేవాడు.

రాత్రికి ఇల్లుచేరి గుర్రానికి పచ్చిగడ్డితోపాటు,ఉలవ గుగ్గిళ్ళు,గాడిదకు పచ్చిగడ్డి ఆహరంగా ఇచ్చేవాడు. కొన్ని ఎలుకలు కూడా రాత్రి గుర్రంవద్దకు వచ్చేవి,వాటికి కొద్దిగా తను తినే ఉలవలు పెట్టేది గుర్రం.

ఒకరోజు రాత్రి గాడిద " అన్నా నాకు మూటల బరువు మాత్రమే మోయడానికి ఇస్తాడు మన యజమాని నీపైన రెండువైపుల మూటలు వేయడంతోపాటు తనుకూడా ఎక్కి కూర్చుంటాడు నిన్ను చూస్తుంటే నాకు జాలి వేస్తుంది ఇక్కడ నుండి తప్పించుకునివెళ్ళి మనఇంటికి చేరువలోని అడవిలో హయిగా , స్వేఛ్ఛగా తిరుగుతూ ఎటువంటి మోతబరువు లేకుండా సంతోషంగా జీవించవచ్చుకదా "అన్నాడు గాడిద.

"తమ్ముడు నాకు ఆకోరిక ఉంది కాని మన యజమాని నేను ఎటువెళ్ళకుండా తాడుతో రాత్రులు నన్ను కట్టివేస్తున్నాడు కదా నేను ఎలా తప్పించుకుని అడవిలోనికి ఎలా వెళ్ళగలను "అన్నాడు గూర్రం.

అప్పుడే అక్కడకు గుర్రం ఇచ్చే ఉలవలకొరకు వచ్చిన ఎలుకలను చూసిన గాడిద " రోజు గుర్రం పెట్టే ఉలవలు తిని వెళుతున్నారు మరి మీమిత్రుడు అయిన గుర్రానికి ఆపదవస్తే ఆదుకోవలసిన బాధ్యత మీకులేదా ? "అన్నది గాడిద .

"చెప్పండి గాడిద అన్నా గుర్రం మామకు మేము ఏవిధంగా సహయపడగలము "అన్నవి ఎలుకలు .

" గుర్రనికి కట్టిఉన్న తాడును కొరికి భంధవిముక్తుడిని చేయండి అలాగే ఇల్లుదాటి వెలుపలకు వెళ్ళడానికి దారికి అడ్డంగా కట్టిన తడికకు ఉన్న తాడు కూడా కొరికివేయండి "అన్నది గాడిద .

గాడిద చెప్పిన విధంగా గుర్రాని కట్టిన తాడును, ఇంటి వెలుపలకు వెళ్ళడానికి దారికి అడ్డంగా కట్టిన తడిక తాడును కొరికివేసాయి ఎలుకలు, వెంటనే ,గాడిదకు,ఎలుకలకు ధన్యవాదాలు చెప్పి తను అడవిలోనికి వెళ్ళింది గుర్రం .

మరుదినం గుర్రంకనిపించకపోవడంతో సోమన్న తనఇంటి పరిసరాలన్ని గాలించినప్పటికి ప్రయోజనం లేకపోవడంతో గాడిదపైన గుర్రం పైనవేసే సరుకులువేసి వ్యాపారానికి బయలుదేరాడు సోమన్న .

తప్పుడు సలహ ఇచ్చినందుకు తనకు రెట్టింపు బరువు మోయవలసి వచ్చినందుకు చింతిస్తు సోమయ్యను అనుసరించింది గాడిద.

వ్యాపారం మూగించుకుని రాత్రికి తనగాడిదతో ఇల్లు చేరిన సోమన్నకు పసువులపాకలో తన గుర్రం కనిపించడంతో సంతోషంగా దానికి వేడినీళ్ళ స్నానం చేయించి ఉలవలు,పచ్చిగడ్డి ఆహరంగా ఇచ్చి ఎప్పటిలా తాడుతో కట్టివేసాడు.

"అన్నా అడవిలోనికి వెళ్ళిననీవు హయిగా జీవించక మరలా ఎందుకు తిరిగి వచ్చావు " అన్నాడు గాడిద. " తమ్ముడు హయిగా సాగిపోతున్న నాజీవితంలో నీచెప్పుడు మాటలువిని అత్యాశకు పోయి ఉచితంగా తిని,స్వేఛ్చగా తిరగవచ్చు అనుకున్నాను మితిమీరిన దురాశ ,అతిస్వేఛ్ఛా ఎంతప్రమాదమో అనుభవ పూర్వకంగా తెలిసి వచ్చాయి, అతి కోరికలు మనకు ఎటువంటి కష్టాలపాలుచేస్తాయో తెలిసివచ్చింది,ఏదైనా హద్దులో ఉంటేనే మనం క్షేమంగా ఉంటాం, చూడటానికి దూరపు కొండలు నునుపుగానే ఉంటాయి అడవిలోనికి వెళ్ళాక తెలిసింది ఆజీవితం ఎంతభయంకరమో ఒపక్క పులుల ఘర్జనలు,మరోపక్క సింహల ఘూండ్రింపు, ఊళలు వేస్తూ తరిమే నక్కలు,చింతనిప్పులవంటి కళ్ళు కలగిన తోడేళ్ళు, కంటికి కనిపించని నలుపురంగు ఎలుగుబంట్లు ఇలా పలురకాల కూృరమృగాల మధ్య అనుక్షణం ప్రాణభయంతో రాత్రి అంతా భయం భయంగా కంటిమీద కునుకు లేకుండా గడిపాను ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూసి ప్రాణాలతో ఇల్లుచేరాను "అన్నాడు గుర్రం.

"అన్నా నువ్వు రావడం మంచిది ఐయింది నువ్వులేని కారణంగా నీబరువుకూడా నాపైనే వేసిడు మన యజమాని జీవితంలో మరెన్నడు మరెవ్వరికి తగని సలహలు వ్వను " అన్నాడు గాడిద.

కథ ముగిసిపోవడంతో అందరూ నిద్రకు ఉపక్రమించారు.

మరిన్ని వ్యాసాలు

Kaka o andamaina baakaa
కాకా... ఓ అందమైన బాక!
- ..... బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - garvam veedina raju
కాశీ ప్రయాణ కథలు - గర్వం వీడిన రాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అద్దంకి శ్రీరామమూర్తి.
అద్దంకి శ్రీరామమూర్తి.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Palatho kadigina boggu
పాలతో కడిగిన బొగ్గు!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - navvina naapachenu
కాశీ ప్రయాణ కథలు - నవ్విన నాపచేను..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు