కాశీ ప్రయాణ కథలు - ప్రత్యూ పకారం - డా. బెల్లంకొండ నాగేశ్వరరావు

Kashi Prayana kathalu - Pratyupakaram

పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి బయలుదేరారు.

రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకుతిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.

అన్నలు ఈరోజు మీకు ప్రత్యూ పకారం అనే కథ చెపుతాను వినండి అని శివయ్య కథ చెప్పడం ప్రారంభించాడు...

అవంతిరాజ్యంలో ధనపాలుడు,గుణకీర్తి అనే మిత్రులు ఉండేవారు వారు తతమరాజ్యంలోని చౌకగా ఉన్న నిత్యవసర వస్తువులు తీసుకువెళ్ళి పొరుగునే ఉన్న మాళవ రాజ్యంలో అమ్మి అక్కడ చౌకగా ఉన్న సరుకులు తీసుకువచ్చి అవంతిలో వారానికి ఒకసారి అలావెళ్ళి వస్తుండేవారు.

ఒకసారి మాళవరాజ్యానికి పదిమంది వ్యాపారులు తమరెండెడ్ల బండి సరుకుతీసుకుని బయలుదేరారు. ముందుభాగాన ధనపాలుడు తన బండి నడపసాగాడు మిగిలినవారంతా అతన్ని అనూసరించసాగారు. అడవి మధ్యభాగాన ప్రయణం చేస్తున్న ధనపాలునికి మార్గం లో కాలిలో చెట్టుకొమ్మ ముక్కదిగబడి మార్గం పక్కగా సృహ లేనీ ఎలుగు బంటి కనిపించింది దానిపెక్కనే రెండు చిన్నపిల్లలు ఆడుకుంటూ కనిపించాయి.

ఎడ్లబండిదిగిన ధనపాలుడు ఎలుగు బంటి కాలిలోని కొమ్మముక్కను తీసి అందుబాటులోని మొక్కల ఆకుసర్లతో గాయానికి కట్టుకట్టి మంచినీళ్ళు ఎలుగుబంటి నోట్లో పోసారు ,నీళ్ళుతాగిన ఎలుగుబంటి లేచి కూర్చుంది ఎడ్లబండిలోని పళ్ళు ఎలుగుబంటికి అందించి మాళవరాజ్యానికి వెళ్ళారు అంతా.

తమసరుకు అంతా అమ్ముడు పోవడంతో మిగిలి వ్యాపారులు అంతా వెళ్ళిపోయారు ,గుణకీర్తి సరుకంతా అమ్ముడు పోయినా తనమిత్రుడు ధనపాలు కొరకు ఆగిపోయాడు. మరునాడు మిత్రులు ఇరువురు తమకు కావలసిన సరుకులు కొనుగోలు చేసి తమ బండ్లపై పెట్టుకుని అవంతి రాజ్యానికి ఉదయాన్నే బయలు దేరారు. అడవిమధ్యభాగానికి చేరుకోగానే

పదిమంది దొంగలు కత్తులతో ధనపాలుడు,గుణకీర్తి తమకత్తుతీసి దొంగలతో తలపడ్డారు ,కొద్దిసేపటికి అడవి పొదలమాటునుండి గుర్రు మంటూ తన ఇద్దరి పిల్లలతో వచ్చిన ఎలుగు బంటి ఇద్దరి దొంగలను గాయపరిచింది అదిచూసిన మిగిలినదొంగలు పరుగులుతీసారు.

నవ్వుకున్న ధనపాలుడు తన బండిలోని ఇరటి గెల ఎలుగుబంటికి అందించాడు అరటిగెలతో తనపిల్లలను తీసుకుని అడవిలోనికి వెళ్ళింది ఎలుగుబంటి.

"జాలి,దయ,కరుణ,ఆపదలో ఉన్నప్పుడు ఎవరినైనా ఆదుకోవాలని ఈకథ మనకు తెలియజేస్తుంది "అన్నడు బ్రహ్మయ్య.

అంతా నిద్రకు ఉపక్రమించారు.

మరిన్ని వ్యాసాలు

Kaka o andamaina baakaa
కాకా... ఓ అందమైన బాక!
- ..... బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - garvam veedina raju
కాశీ ప్రయాణ కథలు - గర్వం వీడిన రాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అద్దంకి శ్రీరామమూర్తి.
అద్దంకి శ్రీరామమూర్తి.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Palatho kadigina boggu
పాలతో కడిగిన బొగ్గు!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - navvina naapachenu
కాశీ ప్రయాణ కథలు - నవ్విన నాపచేను..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు