ధైర్యం - బన్ను

Courage

"ధైర్యం లేకుంటే మనిషి ఏ రంగంలోనూ విజయం సాధించలేడు" అన్నారు శ్రీ స్వామి వివేకానంద. అందుకే మన పెద్దలు 'ధైర్యే సాహసే... లక్ష్మీ' అని కూడా అన్నారు.

ఈ సందర్భంలో మీకో విషయం చెప్పాలి. నాకు పెళ్ళయిన కొత్తలో ఓ రోజు సాయంత్రం వర్షం కురుస్తోంది. "అబ్బ... ఈ వాతావరణం లో పకోడీలుంటే బాగుంటుంది కదా?" అన్నాను మా ఆవిడతో! 'పకోడీ లెంత సేపూ... 5 నిముషాలు అంటూ వంటింట్లోకెళ్ళింది. నేను కంప్యూటర్లో ములిగిపోయాను. తను వేడి వేడి పకోడీలతో వచ్చింది. మేమిద్దరం సరదాగా పకోడీలు తింటూ హాయిగా నవ్వుకుంటున్న సమయంలో ఏదో కాలిన వాసన వచ్చి తను వంటింట్లోకి పరిగెత్తి 'కెవ్వు'మని అరిచింది. నేను పరుగెత్తికెళ్ళి చూస్తే... పకోడీలు వేసిన బాణీ (మూకిడి) మంటలతో కనిపించింది. ఏమి చెయ్యాలో తెలీలేదు. పక్కనున్న నీళ్ళు దాని మీద కిసిరింది. మంటింకా పెద్దదయ్యింది. నేను 'నో' అంటూ... 'ధైర్యం' చేసి వెళ్ళి ముందు కిందున్న గ్యాస్ కట్టేశాను. కానీ మంటలు ఆగడం లేదు. ఎవర్నీ పిలవలేము. పిలుస్తే... మమ్మల్నే తిడతారు. మళ్ళీ 'ధైర్యం' చేసి సిలెండర్ పైనున్న రెగ్యులేటర్ పీకేశాను. ఈలోపు మా ఆవిడ పట్కారు అందించింది. గట్టిగా మంటలతో వున్న మూకిడిని పట్టి నెమ్మదిగా బాల్కనీలో పెట్టేశాను. ఆ తర్వాత నాకు మేము పెంచుకునే మొక్కల తొట్టి కనిపించింది. అందులో మట్టి తీసి మూకిట్లో వేశాను. టప్ మంటూ మంటలు తగ్గాయి. ఆ సమయంలో 'ధైర్యం' చేయకపోతే ఏమిటి పరిస్థితి? 'కొన్ని సమయాల్లో ధైర్యం చెయ్యాల్సిందే!'

మరిన్ని వ్యాసాలు

విశ్వకర్మ ఎవరు?
విశ్వకర్మ ఎవరు?
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్
Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్