నీలవేణికి పెళ్ళెలా ఔతుందా అనుకునే వాణ్ణి తనకి పదహారు ఏళ్ళ వయసులో.అప్పుడు తను ఇంటర్ మొదటి సంవత్సరం చదువు తోంది.నేను డిగ్రీ చివరి ఏడాదిలో వున్నా. నీలవేణికి నాలుగు నెలల వయసులో మా పక్క ఇంట్లో అద్దెకు వచ్చారు.వాళ్ళ నాన్నగారికి తాసీల్దారు ఆఫీసులో ఉద్యోగం. అప్పుడు నాకు ఐదేళ్ళు.నేను స్కూలు నించీ రాగానే తనని ఆడించటానికి వెళ్ళేవాణ్ణి.తను జుట్టులాగే ఒళ్ళంతా నలుపే.ఐతే ఆమె కళ్ళలో కళ వుంది.విశాలమైన కళ్ళు.అప్పు డు అవే ఆకర్షణ.పెద్దయ్యాక తెల్లటి ఆమె ప ళ్ళు కూడా పెద్ద ఆకర్షణ.ఆమె నవ్వుతుంటే చాలా అందంగా వుండేది.యుక్త వయసు వ చ్చాక కళ్ళు,ఆమె నవ్వు అందంగా వుండేవి. ఆమె డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా రోజూ సాయంత్రం స్కూలు నించీ రాగానే మా ఇంటికి వచ్చేది.నాతో కబుర్లు చెప్తుండేది.త ను రకరకాల స్వీట్స్ చేసేది.అవి నాకు ఇస్తుం డేది నేను స్వీట్లు తిననన్నా.ఐతే ఆశ్ఛర్యంగా తనకి వయసు పెరుగుతున్నప్పటి నించీ త న శరీరంలో అందమైన మార్పులు గమనిం చాను.ఆ మార్పులు ఆమెకి అందాన్ని కలిగించాయి.అంతేకాక ఆమె నలుపు కూడా తగ్గిందేమో అనిపించింది. అలా మార్పులు గమనించినప్పటి నించీ నేను ఆమెతో మాట్లాడటం తగ్గించాను.ఏదో రాసుకుంటున్నట్టో చదువుకుంటున్నట్టో వుండేవాణ్ణి. ఐనా తను చొరవగా వచ్చేది. నేను మాట్లాడకపోయినా తనే మాట్లాడేది.కా సేపాగి వెళ్ళిపోయేది. నాకు ఆశ్ఛర్యం అనిపించే విషయం ఆమె పేరెంట్స్ కానీ,మా పేరెంట్స్ కానీ మేమలా కబుర్లు చెప్పుకోటానికి ఎందుకు అభ్యంతరం చెప్పేవారుకాదు అని. @@@ నేననుకున్నట్టు కాక నీలవేణికి పెళ్ళయింది డిగ్రీ శలవులలో.వరుడు మేఘనాథ్.మా బందరువాడే.అతను తెల్లటి తెలుపు.ఢిల్లీలోని ఓ ప్రముఖ వార్తా పత్రికలో సంపాదక శాఖలో పనిచేస్తున్నాడు. నీలవేణి డిగ్రీలో జర్నలిజం తీసుకుంది.ఆమె చదువుతున్న హిందూ కాలేజి మహిళా కళాశాలవారు అతనిని ఆహ్వానించారు విద్యార్థులకి జర్నలిజం గురించి చెప్పమని.ప్రతి ఏడాది వారు ఓ తెలుగు జర్నలిస్టుని ఆహ్వానిస్తారు. అతనిని విద్యార్థుల మధ్యలో కూర్చున్న నీలవేణి కళ్ళు ఆకర్షించాయి. ఆమె వివరాలు తెలుసుకుని పెళ్ళి గురించి మాట్లాడాడు తన తలిదండ్రులని పంపి.ఆమెకి ఎం ఏ చేయాలని,పి హెచ్ డి చేయాలని కోరిక.పెళ్లయ్యాక ఆమె చదువుకోవటానికి అతను ఒప్పుకోవటంతో ఆమే ఒప్పుకుంది. వేసవి శలవులలో పెళ్ళయ్యి కాపురానికి వెళ్ళిపోయింది. @@@ నేను చదువయ్యాక మా నాన్నగారు నిర్వ హిస్తున్న స్టేషనరీ షాపు చూసుకుం టున్నా ను.నన్ను పెళ్ళిచేసుకోమని ఇంట్లో పోరుతు న్నారు.చాలా పెళ్ళిచూపులకి వెళ్ళాను.బం ధువులలో కూడా.కొందరు నేనిష్టపడకపోతే చాలా మందికి నేను నచ్చలేదు.ఒక కారణం నేను వ్యాపారం చేయటం.మరోటి నా రూపం. మొత్తానికి నా పెళ్ళి వాయిదా పడింది. నీలవేణి నాన్నగారు రిటైరయ్యాక భాస్కరపు రంలో రెవెన్యూ కాలనీలో ఇల్లు కట్టుకున్నా రు.ప్రతిరోజూ అక్కడినించీ వచ్చి మా షాపులో కూర్చునేవారు.ఆయన నీలవేణి కబుర్లు చెప్తుండేవారు. ఒకరోజు చాలా అన్యమనస్కంగా కూర్చున్నా రు.కాసేపాగి ఆయనే చెప్పారు విచారంగా ‘అ మ్మాయి కాపురం సరిగాలేదయ్యా.తనని రం గు పేరుతో వేధిస్తున్నాడట.తను విడిగా వుం టోంది.ఏదో పత్రికలో ఉద్యోగం చూసుకుందట. పెళ్ళికి ముందు చదువుకోటానికి ఒప్పుకు న్నాడు.ఇప్పుడేమో అవసరం లేదం టున్నా డుట.సర్దిచెప్దామని వస్తామంటే ఆ దుర్మార్గుడి తో కాపురం చెయ్యనని చెప్తోంది.ఏం చెయ్యా లో అర్థం కావటంలేదు.’పోనీ ఇక్కడ అతని పేరెంట్స్ తో మాట్లాడకపోయారా.’ ‘వాళ్ళూ చే తులెత్తేసారు.నా కాపురం నా ఇష్టం అంటు న్నాడట.’ ఐనా వీళ్ళు ఢిల్లీ వెళ్ళారు.అతను అసలు కలవటానికే ఇష్టపడలేదట.పైగా వీరితోనే నీలవేణి రంగు గురించి అసహ్యంగా మాట్లా డాడట. నీలవేణికి నచ్చచెప్పి తీసుకొచ్చేసారు.కొన్నా ళ్ళు ప్రయివేటు స్కూలులో పనిచేసింది.ఆ సమయంలోనే పీ జీ చేసింది. మహిళా కళా శాలలోనే తాత్కాలిక ఉద్యోగం దొరికింది. తను కూడా కాలేజి అయ్యాక మా షాపుకి వ చ్చేది ఇంటికి వెళ్తూ.నేనేమీ ఆమె కాపురం గురించి అడగలేదు. అలా రోజులు గడుస్తున్నాయి.ఓ రోజు తనతో అన్నాను ‘నన్ను పెళ్ళి చేసుకుంటావా ?’ అని.ఆమె నా వంక ఆశ్ఛర్యంగా చూస్తూ ‘నా పెళ్ళికి ముందే అడుగుతావనుకున్నా.మీ పేరెంట్స్ కి అభ్యంతరముంటుందేమో డైవోర్సీని కోడలు చేసుకోవటానికి.’అంది మెల్లిగా. ‘వుండదు.’ధృఢంగా చెప్పాను.నాకు పెళ్ళిచూ పుల ప్రహసనాలు క్లుప్తంగా చెప్పా.తనే అంది ‘ఓ సారి ఇంట్లో కనుక్కో.ఎందుకైనా మంచిది.’ @@@ నెల రోజులలో మా పెళ్ళి జరిగిపోయింది.క ళ్ళుమూసి తెరిచేంతలో మూడేళ్ళు గడిచిపో యాయి. మాకు పాప పుట్టింది.నర్సు చేతిలో మా బంగారు తల్లిని చూస్తుంటే మా ఇద్దరికీ ఆశ్ఛర్యం,ఆనందం ఒకేసారి కలిగాయి.పాప కూడా నలుపే . ఇద్దరం ఒకేసారి పక్కున న వ్వాము. ఎందుకంటే మేమిద్దరం నలుపే.

