మీ పలుకు - పాఠకులు

mee paluku

వంశీ గారు కథలు రాస్తారు,సినిమా లు తీస్తారు అని తెల్సు గానీ ఇలా, టీన్స్ లోనే కథా కళి ఆడే స్తా రను కోలేదు. ఆ ఏజ్ లో అంత గా ఆకట్టు కునే లా కథ రాయ గలిగా రంటే, 'పువ్వు పుట్ట గానే.'సామెత వూరికే పుట్టలేదు మరి. వంశీ గారికి సలామ్. వారి కథల కి ఓ సలామ్. వారికి నచ్చిన కథలని మా కందిచ్చే మీ ఆలోచన కి మేం గులామ్.
--- కృష్ణా రావు

 


రేపటి ఆకలి కథ చాలా చాలా బావుంది. రచయిత్రి సుకృతి సుశీలగారి కథనం అభినందనీయం. ఎంతో అర్థవంతంగా బొమ్మ వేసిన మాధవ్ గారికి మా అభినందనలు...
--- గోపికృష్ణమాచార్యులు

హహ్హా,,,అద్భుతమైన కామెడీ కార్టూన్లు.మనసారా నవ్వుని తెప్పించినందుకు దన్యవాదాలు.
--- శ్రీనివాస రావు


గోతెలుగు సీరియల్సు చాలా బాగున్నాయి. మంచి కధనంతో ముందుకు సాగుతున్నాయి. రచయితలకు సంపాదకులకు ధన్యవాదాలు
-- రాజు, సింగపూర్ 


మహర్షి చలం గారి తత్త్వం చదువరులకు సులభ-గ్రాహ్యంగా ఉండేట్ల చేయ సంకల్పించిన మన శ్రీ శాస్త్రి గారి ప్రయత్నం సఫలమయ్యిందని నా నిశ్చితాభిప్రాయం. ఎందుకంటే, 'చలం సాహిత్యం' తెలుగు సాహితీ ప్రపంచంలో ఎంతో పేరుగాంచినదని మనందరకీ తెలుసు. అయితే, వీరి కలం నుండి వెలువడ్డ అనేక రచనలు ఆసాంతం చదివి అర్ధం చేసుకునే అదృష్టం పొందని కొంతమందిలో నేనుకూడా ఒకడిని. అలాంటి  నాలాంటి వారికి 'మహర్షి చలం గారి తత్త్వాన్ని' ఒకింత సులభంగా తెలుసుకునే వెసులుబాటును మన శ్రీ శాస్త్రిగారు - ఈ వ్యాసం ద్వారా - కలగజేశారు. అభినందనీయులు, మన శ్రీ శాస్త్రిగారు.
--- మొహమ్మద్ అబ్దుల్ వహాబ్

 

వంశీ గారి 'నల్ల సుశీల' మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. నిజంగా ఆలోచనాత్మకం,  అభినందనీయమీ కధ.
-- వాసు 

 

మీ అభిప్రాయాల్ని "[email protected]" కి పంపితే "మీ పలుకు" లో ప్రచురిస్తాము