నీ కోసం..... - లక్ష్మీ సుజాత

for you

నిండు చంద్రుని కేన్వాస్ పై

హఠాత్తుగా ప్రత్యక్షమై ఆశ్చర్యచకితురాలని చేస్తావు!

గోదారి ఒడ్డుమీద అలవోకగా నడుస్తుంటే

నా కాళ్ళు కందిపోకుండా పెట్టిన నీ అరచేతులు జ్ఞాపకమొస్తాయి!

కొబ్బరాకుల్ని స్పృశిస్తూ ముంగురుల తంత్రులు మీటుతూ

మంద్రంగా వీచే గాలి సవ్వడి నీ గుస గుసల్ని స్ఫురణకు తెస్తాయి!

రెల్లుగడ్డి నీ స్పర్శనీ.. మల్లెతెలుపు నీ ప్రేమ స్వఛ్ఛతనీ గుర్తుచేస్తుంటాయి..

ప్రకృతిలో మమేకమై కవ్విస్తావు అనుక్షణం పులకరింపజేస్తావు..

కొన్ని అనుభూతులంతే కుదురుగా కూర్చోనివ్వవు..

ఈలోకంలో వుండనివ్వవు..

నువ్వు దూరతీరాలనున్నా

దగ్గరలో వున్నావన్న భావన

ఈ జీవితానికి జీవం పోస్తోంది..

నువ్వు చెంతచేరే రోజుకోసం

మనసు చకోరమవుతోంది!
 

-------------------------------------------------------------------------------------------------------------------

కవితలకు ఆహ్వానం
-------------------------------------------------------------------------------------------------------------------

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు