కాకూలు - సాయిరాం ఆకుండి

స'మోసాలు
ఏ ఎండకాగొడుగు పట్టే నైజం ...
ఎదగాలంటే తప్పనిసరి లౌక్యమిది నిజం !
జిత్తులమారి టక్కుటమార సమాజం ...
ఎత్తుకు పై ఎత్తులనేవిక్కడ అతిసహజం !!

ఇన్ స్టెంట్ మసాలా
పది పదారు కతల్ని కలిపి రుబ్బేసినట్టు ...
మిక్సీ తిప్పేసి సినిమా తీసి కొట్టు!
సూపరు డూపరు బంపరు హిట్టు ..
కాకపోతే నీమీదొట్టు... ఇది కిచిడి కనికట్టు !!

నేను ది గ్రేట్
ఎదుటివాడు ఎదిగితే కడుపుమంట ...
లక్కు నాకు లేదేమని ఒకటే చింత !
పక్కవాడి సామర్ధ్యాన్ని ఒప్పుకోను ...
లెక్క నాకు కలిసిరాలేదని వాపోతాను !!

మరిన్ని వ్యాసాలు

తిమ్మరుసు.
తిమ్మరుసు.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
ఖడ్గ తిక్కన .
ఖడ్గ తిక్కన .
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
శ్రీ కృష్ణదేవరాయలు.
శ్రీ కృష్ణదేవరాయలు.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Kashi Prayana Kathalu - ashrama dharmalu
కాశీ ప్రయాణ కథలు - ఆశ్రమ ధర్మాలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పావలా శ్యామల ఇక లేరు.
పావలా శ్యామల ఇక లేరు.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
సెల్ ఫోన్ పెట్టిన చురక
సెల్ ఫోన్ పెట్టిన చురక
- మండా. సూర్యనారాయణ