మాతృవేదన(కవిత) - జంపని జయలక్ష్మి

mathruvedana

నువ్వు ఉరిమే మేఘానివైతే
చేరువలో ఉన్న ఆకాశమే నేననుకున్నా...
కానీ...నన్ను వద్దని వర్షమై భూమికురికావు..

నువ్వు అందముగా పూచిన గులాబివైతే
నాకే చెందే మొక్కవనుకున్నా...
కానీ.. నన్ను వద్దని అమ్మాయి సిగ లో చేరావు..

నువ్వు మల్లెతీగై ఎగబ్రాకుతుంటే
దాని ఆసరా కట్టెను నేననుకున్నా...
కానీ..అందనంత ఎత్తులొ ఎదిగి నన్ను వద్దని నా ఉనికే లేకుండా చేస్తావనుకొలేదు.

నువ్వు ఎదిగే ప్రతిక్షణం నా కోసమే అనుకున్నా
కానీ..కానీ...నన్నే వద్దనుకునే క్షణం వస్తుందని ఉహించలేదు.

మరిన్ని వ్యాసాలు

atithi
అతిధి
- Madhunapantula chitti venkata subba Rao
Manavulalo daivatwam
మానవులలో దైవత్వం
- సి.హెచ్.ప్రతాప్
హెలెన్ కెల్లర్
హెలెన్ కెల్లర్
- బి.రాజ్యలక్ష్మి
ఋచీక మహర్షి .
ఋచీక మహర్షి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ఋష్యశృంగ మహర్షీ .
ఋష్యశృంగ మహర్షీ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ఆంగీరస మహర్షి.
ఆంగీరస మహర్షి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అగస్త్యుడు .
అగస్త్యుడు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు