కవితలు - ..

స్వనింద
నన్ను నేను

తిట్టుకుంటూనే ఉన్నా

అస్తవ్యస్తమైన

నా మనసులోకి

పిలవని అతిథిలా వచ్చి

నిందలేసి..

నా అనుమతి లేకుండా

మెల్లగా జారుకున్న నిన్ను

వెతుక్కుంటూ...

నేను, నా అనే భ్రమ నుండి

బయటపడి

నీ ప్రేమ వలలో చిక్కుకున్న

తిరిగిరాని గతకాల క్షణాలను

లెక్కించుకుంటున్నా..

నీతో గడిపిన క్షణాలు

నన్ను వేదనా సుడిగుండంలో

పడదోస్తుంటే..

నిస్తేజంగా నివ్వెరపోతూ

తిట్టుకుంటున్నా...

నన్ను నేను అనుకునే స్వేచ్ఛని కూడా

హరించిన నీతో ముడిపడి వున్న

నా మనసుని తలుచుకుంటూ

మనస్ఫూర్తిగా తిట్టుకుంటూనే ఉన్నా!

 

సుజాత పి.వి.ఎల్

****

ఈ శాపం మాకెందుకు?

ఏ చీకటి రాత్రి భూమి మీదికి వచ్చామో
కామాందుని కౌగిలి ప్రతిరూపం అయ్యామో
పుట్టినరోజుల సంతోషాలు ఎక్కడ?
తల్లిదండ్రులే మా ప్రేమను పక్కకు పెట్టారే
ఏమి చేశామని ఈ శాపం! మాకెందుకు?
 
ఉదయాన్నే సూర్యునికి నమస్కారం పడేసి
మహా విజ్ఞాన శాస్త్రవేత్తల వలె
గోనె సంచిని ఆస్తిగా భావించి
అపురూపమైన వస్తువులు దారి వెంట
పోగు చేసుకుంటూ ఆత్మవిశ్వాసం మెండుగా!
అవనిపై మా లాంటి అడుగులు ఎవరువేస్తారు
 
ఆహారాన్వేషణ నిరంతర పోరాటం
చెత్త కుప్పల దగ్గర ఉన్న పదార్థాల కోసం
కుక్కల పందుల కోతులతో పోటీపడి
వారిని జయించి నిత్య పోరాటాలతో
కన్నతల్లి ముద్ద కన్నా! అడుక్కునే దే ఇష్టం
 
నిద్ర సుఖమెరగదు నట్లు
రాత్రి స్టేషన్లలో అంగడి ముందరో
ఏ వీధి అరుగు మీదనో స్వప్నాలకు దగ్గరగా
రేపటి ఆలోచన లేకుండా ఎంత సుఖం నిద్రో
 
కాలాలతో పనిలేదు రాత్రింబవళ్లు తేడా లేదు
చదువుల  లేని జీవన నిరంతర పోరాటం
ఆదుకునే వారి కోసం అన్వేషణ
మాకంటూ లేదా సమాజములో ఒక స్థానం
ఈ శాపం మాకెందుకు ఇచ్చాడు దేవుడు!!
 
కొప్పుల ప్రసాద్

మరిన్ని వ్యాసాలు

Kaka o andamaina baakaa
కాకా... ఓ అందమైన బాక!
- ..... బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - garvam veedina raju
కాశీ ప్రయాణ కథలు - గర్వం వీడిన రాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అద్దంకి శ్రీరామమూర్తి.
అద్దంకి శ్రీరామమూర్తి.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Palatho kadigina boggu
పాలతో కడిగిన బొగ్గు!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - navvina naapachenu
కాశీ ప్రయాణ కథలు - నవ్విన నాపచేను..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు