వేడుక - లక్ష్మీ పద్మజ దుగ్గరాజు

veduka

వసుదైక కుటుంబం ప్రత్యక్ష దర్శనం 
గురువుల ఆగమనం 
విద్యార్ధుల కోలాహలం 
తెలియని వయో వర్గ భేధం 
గత స్మృతుల సంభాషణం
దశాబ్దాల తర్వాత కలియిక 

ఉపాధ్యాయ దినోత్సవ వేడుక 
అంబరాన్ని అంటిన ఆనందం 
గురువుల దర్శనంతో శిష్యుల పరమానందం 

మదిలో ఎగిరిన చిన్ననాటి స్మృతుల పక్షులు 
మరువలేని మధుర స్మృతులు 
మరిచిపోలేని అనుభవాలు 
మరపురాని అనుబంధాలు 

చిన్ననాటి ఘంటనల నెమరువేత 
తలపుకు వచ్చిన  గురువుల చేయూత 
జన్మనిచ్చిన తల్లి దండ్రులు
జీవితాన్ని యిచ్చిన గురువులు 

ఇరువురి ఆశీస్సులతో జీవన పురోగమనం 
దూర తీరాల నుండీ మిత్రుల ఆగమనం 
ఎన్నో అనుభూతులు మరెన్నో అనుభవాలు పంచుకోవాలనే ఆరాటం  

లేనేలేదు కలిమి లేముల భేదం 
అసలే తెలియదు కుల మతాల విభేదం 
అందరి మనస్సులో అనుభూతుల భాండా గారం 
పూర్వ విద్యార్ధుల కలయిక ఓ ఆనంద సాగరం 
తలవని తలంపుగా , అనుకోని అతిధులుగా 
చిన్ననాటి మిత్రుల కలయిక 
అనిపించింది ఈ జన్మకిది చాలిక 

తమ శిష్యుల ప్రగతిని చూసి పొంగిన గురువుల డెందం 
గురువుల ఆశిస్సులు అందుకున్న శిష్యుల పరమానందం 

దండించినా , శిక్షించినా గురువులే దేవతలు 
గురువులు చెక్కిన శిల్పాలు శిష్యులు 
మలినం లేకుండా మలచిన రూపాలు శిష్యులు 

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు