ద లెజెండ్ హీరోయిన్ మధుబాల - ambadipudi syamasundar rao

ద లెజెండ్ హీరోయిన్ మధుబాల

మధుబాల గా సినీ ప్రేక్షకులకు ముఖ్యముగా పాత తరము వారికి బాగా పరిచయము ఉన్న ఈ హీరోయిన్ అసలు పేరు ముంతాజ్ జెహాన్ బేగం దెహ్లావీ ఈవిడ ఫిబ్రవరి 14(ప్రేమికులరోజు) 1933 న అతుల్లాహ్ ఖాన్, అయేషా బేగము దంపతులకు పదకొండు మంది సంతానంలో ఐదవ సంతానంగా ఢిల్లీలో జన్మించింది. ఈ పదకొండు మందిసంతానములో నలుగురు మాత్రమే పెద్ద ఆయె దాకా ఉన్నారు మధుబాల తండ్రి పెషావర్ ప్రాంతములో ఉండేవాడు అక్కడ ఉద్యోగాన్ని కోల్పోవటం వలన కుటుంబముతో ఢిల్లీ చేరాడు అక్కడనుండి బొంబాయి వచ్చాడు ఎన్నో రకాల ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించుకొనేవాడు  మధుబాల ముగ్గురు సోదరీమణులు, ఇద్దరు సోదరులు 14 ఏప్రిల్ 1944న జరిగిన ప్రేలుడు  ప్రమాదానికి చనిపోయినవారు మధుబాల మిగిలిన కుటుంబ సభ్యులు సినిమా చూడటానికి వెళ్ళటం వల్ల బ్రతికి పోయినారు ఈవిడ తెరమీద పేరు మధుబాల గానే బాగా ప్రఖ్యాతి చెందింది,1942 నుండి 64 వరకు హిందీ వెండి తెరమీద యాక్టివ్ గా ఉంది అందానికి పెర్సనాలిటికి మారు పేరుగా నిలిచింది. గ్లామర్ రోల్స్ ఏ కాకుండా ట్రాజెడి పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులకు కళ్ళ నీళ్లు తెప్పించింది
ఇండియన్ సినిమాకు ఈవిడ వీనస్ క్వీన్ లాంటిది ఆ రోజుల్లో ఈవిడను ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ మార్లిన్ మన్రో తో పోల్చేవారు అంతేకాదు మార్లిన్ మన్రో ఆఫ్ బాలీవుడ్ అని కీర్తించేవారు ఆవిడ  టైం లో ఆవిడ చాలా పేరున్న కథానాయకి అప్పట్లో మీనాకుమారి సురయ వంటి అగ్ర కథానాయికల సరసన ఈవిడ పేరు వినిపించేది అందంలో మటుకు ఈవిడదే ప్రధమ స్థానము కాబట్టే 1951 లో హాలీవుడ్ ఫోటోగ్రాఫర్ జేమ్స్ బర్కి ఇండియా వచ్చినప్పుడు అయన దృష్టిని ఆకర్షించింది అప్పట్లో అయన మధుబాలకు తీసిన ఫోటోఆగస్టు 1952లైఫ్ పత్రిక కవర్ పేజీగా వచ్చింది అంతేకాకుండా ఆ సంచికలో బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ డా వరల్డ్ అనే వ్యాసము కూడా మధుబాల గురించి వచ్చింది ఆ వ్యాసములో చివర మధుబాల దురదృష్ట వశాత్తు బెవర్లీ హిల్స్ లో లేదు అని కూడా వ్రాశారు  అప్పటి వరకు ఏ భారతీయ చలన చిత్ర నటి నటుల ఫోటోలను లైఫ్ పత్రిక ప్రచురించలేదు పొగుడుతూ వ్యాసము వ్రాయలేదు. ఆవిధముగా ఆవిడ అందము ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది ఆవిడను బిగ్గెస్ట్ స్టార్ గా అంతర్జాతీయ సినీ పరిశ్రమ పొగిడింది.
మధుబాల తండ్రి కుటుంబపోషణకు మధుబాలను సినిమాలో బాల నటిగా చేర్చవలసి వచ్చింది అప్పటికే మధుబాలకు సినిమాల పట్ల ఆసక్తి ఉండటం వలన బాల నటిగా  9 ఏళ్ల వయస్సులోనే 1942లో వచ్చిన బసంత్ అనే సినిమాతో చలన చిత్ర సీమ లో అడుగు పెట్టింది. మొదట్లో మధుబాలకు ఉర్దూ బాగా వచ్చినప్పటికీ ఇంట్లో వాళ్ళ సొంత భాష పాష్తో మాట్లాడేది ఇంగ్లిష్ అసలు వచ్చేది కాదు కానీ తరువాత ఇంగ్లిష్ క్లాసులు తీసుకొని బాగా నేర్చుకొని ఇంగ్లీష్ ధారాళముగా మాట్లాడేది అలాగే 12 ఏళ్ల వయస్సులోనే డ్రైవింగ్ నేర్చుకున్నది .లాంగ్ డ్రైవ్ లంటే మధుబాలకు ఇష్టముగావుండేది.1947 నుండి కథానాయకిగా కెరీర్ మొదలైంది 14 ఏళ్ల వయస్సులోనే రాజ్ కపూర్ తో నీల్ .కమల్ అనే సినిమాలో  హీరోయిన్ గానటించింది.ప్రముఖ నటి దేవికా రాణి మధుబాల నటనకు ముగ్దురాలై మెచ్చుకొని వెండితెర పేరు మధుబాలగా ఉంచుకోమని సలహా ఇచ్చింది అప్పటినుండి మధుబాల పేరుతొ పాపులర్ అయింది. మొత్తము 22 ఏళ్ల సినీ జీవితములో 73 హిందీ సినిమాలలో నటించింది మొఘల్ ఏ అజామ్ సినిమాలో మధుబాల నటనకు ఫిలిం ఫేర్ ఉత్తమ నటి అవార్డు వచ్చింది అందములోనే కాకుండా .చాలా విషయాల్లో మధుబాలకు మార్లిన్ మన్రో కు చాలా దగ్గర పోలికలు ఉండేవి కెరీర్ లో చాలా తక్కువ కాలము, విషాదాంతమైన  జీవితము వంటి అంశాలలో మధుబాలకు మెర్లిన్ మన్రోకు పోలికలు ఉన్నాయి అని మధుబాల జీవిత చరిత్ర వ్రాసిన ఖతీజా అక్బర్ అంటాడు మధుబాల ఫోటోలు చుసిన హాలీవుడ్ నిర్మాత ఫ్రాంక్ కాప్రా బొంబాయి వచ్చినప్పుడు మధుబాలకు హాలీవుడ్ సినిమాలలో ఛాన్స్ ఇవ్వటానికి ముందుకు వచ్చాడు కానీ మధుబాల తండ్రి మధుబాలను విదేశాలకు పంపటానికి ఒప్పుకోక పోవటం తో మధుబాలకు హాలీవుడ్ ఛాన్స్ మిస్ అయింది.
మధుబాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన సినిమాల్లో మహల్(1949) ఈ సినిమా బాంబే టాకీస్ వారు నిర్మించారు ఈ సినిమా మధుబాలకు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో మధుబాల వేసిన పాత్రను మొదట సురయా ను అనుకున్నారు కానీ ఆ పాత్ర మధుబాలకు దక్కింది స్క్రీన్ టెస్ట్ చేసి మధుబాలను ఎంపిక చేసినది ప్రముఖ దర్శకుడు కమల్ అమ్రోహీ . ఆ తరువాత  సినిమా దులారి  ఈ సినిమా మంచి వసూళ్లను చేసింది ఈ సినిమాను శోభ పేరుతొ తెలుగులో కూడా తీశారు.ఆ తరువాతి హిట్స్ వరుసగా ,mr &mrs 55(1955)చల్తీకా నామ్ గాడి(1958) మొఘల్ ఏ అజమ్ (1960), బర్సాత్  కి రాత్(1960) మొదలైనవి ఆవిడ మొఘల్ ఏ అజమ్ సినిమాలోని "ప్యార్ కి యతో డర్నా" పాట ఆ పాటలో మధుబాల అభినయము నేటికీ ప్రజల మనస్సుల్లో స్థిరముగా ఉండిపోయింది మధుబాల మొదటి బాక్స్ ఆఫీస్ హిట్ 1942 లో వచ్చిన బసంత్ ఈ సినిమాలో మధుబాల అప్పటి హీరోయిన్ ముంతాజ్ శాంతి కి కూతురుగా నటించింది బసంతి సినిమా ఆ సంవత్సరము ఎక్కువ కలెక్షన్స్ ఉన్న సినిమాగా పేరు తెచ్చుకుంది అదే టైము లో మధుబాల తో పాటు బాలనటిగా పరిచయము అయినా మరో నటి బేబీ మహజబీన్ ఈ బాలనటి  తరువాతి రోజుల్లో ప్రముఖ హీరోయిన్ మీనాకుమారిగా ఎదిగింది మీనాకుమారి మధుబాల మంచి చిన్ననాటి స్నేహితులు అంతే  కాదు మధుబాల మీనాకుమారి అభిమాని మీనాకుమారి స్వరాన్ని అభిమానించేది అటువంటి హీరోయిన్లు మరెవ్వరు లేరు అనేది.
మధుబాల అశోక్ కుమార్, రాజ్ కపూర్, రెహ్మాన్, ప్రదీప్ కుమార్, షమ్మీ కపూర్, దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్, వంటి ప్రముఖ హీరోలతోను, కామిని కౌషల్, సురయా,గీత బాలి, వంటి హీరోయిన్లతో కలిసి నటించింది. అలాగే ప్రముఖ దర్శకులతో కూడా కలిసి పనిచేసింది మధుబాల సినీ నిర్మాతగా మారి 1955లో నాట ,1960లో మెహెలోన్ కి క్వాబ్ సినిమాలను తీసింది 1953 లో వచ్చిన రైల్ క డిబ్బ సినిమా షమ్మీ కపూర్ తో కలిసి నటించింది బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్.1950 లో ప్రేమ్ నాధ్ తో కలసి నటించిన హస్తే అన్సూ అనే సినిమా హిందీ ఫీల్డ్ లో మొట్ట మొదటి  A సర్టిఫికేట్ సినిమా.జెమిని స్టూడియోస్ వారి బహుత్ దిన్  హువా సినిమాలో ప్రముఖ తెలుగు నటి సావత్రి తో కలిసి నటించింది ఈ సినిమా షూటింగ్ పూర్తిగా మద్రాస్ లో జరిగింది.ఈ సినిమాషూటింగ్ అప్పుడే మధుబాల అనారోగ్యము గురించి తెలిసింది మధుబాల కంజినీయల్ హార్ట్ డిసీజ్ తో బాధపడుతున్నట్లు తెలిసింది. మధుబాల కిషోర్ కుమార్ తో కల్సి మొదట యాక్ట్ చేసిన రొమాంటిక్ మ్యూజికల్ కామెడీ దాకే కి మాల్మల్ అనే సినిమా ఫెయిల్ అయింది కానీ ఆతరువాత వారి కాంబినేషన్ తో వచ్చిన  సినిమాలుఅన్ని సక్సెస్  అయినాయి. మధుబాల ఆఖరు సినిమా జ్వాల ఈ సినిమాను 1950 లో తీసినప్పటికీ 1971లో అంటే చనిపోయిన రెండేళ్లకు విడుదల అయింది
.మధుబాల సినీ చరిత్రలో ఒక పెద్ద మెయిలు రాయి మొఘల్ ఏ అజమ్ ఈ సినిమాలో దిలీప్ కుమార్ తో కలిసి అనార్కలి రోల్ లో నటించింది అప్పటి వరకు వచ్చిన సినిమా రికార్డులను ఈ సినిమా బద్దలు కొట్టింది. ఈ సినిమా పూర్తి అవటానికి 9 ఏళ్ళు పట్టింది ఈ సినిమాలో మధుబాలను ఎంపిక చేసుకోవటం లో దిలీప్ కుమార్ పాత్ర ఏంతో ఉంది మధుబాల తన ఆరోగ్యము క్షీణిస్తున్నప్పటికీ దీర్ఘమైన షూటింగ్ షెడ్యూల్స్ లో పాల్గొని స్టూడియో లైట్లలో గంటల తరబడి పనిచేసి వృత్తి పట్ల తన నిబద్ధతను చాటుకుంది ఈ టైం లోనే దిలీప్ కుమార్ తో ప్రేమ వ్యవహారము కూడా చెడింది సినిమా పాత్ర లాగానే నిజ జీవితములో కూడా ట్రాజెడీ సంభవించింది చిట్టచివరకు ఈ సినిమా 5 ఆగస్టు 1962లో విడుదల అయి అనేక రికార్డులను నెలకొల్పింది. ఏ సినిమా ఈ సినిమా రికార్డులను 15 ఏళ్ల వరకు (షోలే సినిమా) అధిగమించలేదు
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మోహన్ దేప్ వ్రాసిన మధుబాల జీవిత చరిత్రలో ఆవిడ బాల్యము నుండి ఇష్టపడ్డ లేదా ప్రేమించిన మగవాళ్ల గురించి వ్రాస్తాడు మధుబాలను అభద్రతా భావం వంటాడేది అందువల్ల మగవాళ్ళను ప్రేమించేది అలాగే వాళ్ళను కోల్పోయేది అటువంటి వాళ్లలో లతీఫ్, మోహన్ సిన్హా, కమల్ అమ్రోహీ, ప్రేమ్ నాధ్,జుల్ఫీకర్ భుట్టో దిలీప్ కుమార్, చివరకి కిషోర్ కుమార్  బాల్యములో మధుబాలకు లతీఫ్ అనే స్నేహితుడు ఉండేవాడు బొంబాయి వెళ్లబోయే ముందు అతనికి తన ప్రేమ చిహ్నము గాఎర్ర గులాబీ ఇచ్చింది పెద్దయినాక ఆతను IAS ఆఫీసర్ అయినాడు మధుబాల చనిపోయినాక ఆతను ఎర్ర గులాబీని ఆవిడ సమాధి మీద ప్రతి సంవత్సరము ఉంచేవాడు. ఈ మౌన ప్రేమ కథను లతీఫ్ సన్నిహితుడు మరో IAS ఆఫీసర్ మనోహర్ సుబ్రమణ్యమ్ లోకానికి తెలియజేశాడు. ఆ తరువాత కమల్ అమ్రోహీ తో ప్రేమ వ్యవహారము తండ్రి పెళ్ళికి ఒప్పుకున్నా మధుబాల కమల్ అమ్రోహీకి రెండవ భార్యగా ఉండటానికి ఒప్పుకోలేదు ఆ తరువాత దిలీప్ కుమార్ తో ప్రేమ వ్యవహారము సాగింది తండ్రి ఈ వ్యవహారాన్ని అంగీకరించలేదు ఎందుకంటే కుటుంబానికి మధుబాలయే ఆధారము బొంబాయి కాకుండా మరెక్కడైనా దిలీప్ కుమార్ తో షూటింగ్ ఉంటె తండ్రి ఒప్పుకొనేవాడు కాదు అందుచేతనే నయదౌర్ సినిమాలో మధుబాల ఛాన్స్ వదులోకో వలసి వచ్చింది
చివరకి 27ఏళ్ల  వయస్సులో మధుబాల దిలీప్ కుమార్ తో తన పెళ్లి జరగదని తెలుసుకొని  కిషోర్ కుమార్ ను పెళ్లిచేసుకుంది అప్పటికే మధుబాల గుండె జబ్బు తో భాధపడుతుండేది కిషోర్ కుమార్ ముస్లిం గా మారి పేరు మార్చుకున్నందుచేత కిషోర్ కుమార్ కుటుంబసభ్యులు ఈ వివాహాన్ని అంగీకరించలేదు కానీ కిషోర్ కుమార్ ఫిల్మ్ ఫెర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తానూ గాని మధుబాలకాని మతము మారలేదు అని అన్నాడు పెళ్లి అయినాక హనీమూన్ కోసము ఇంగ్లాండ్ వెళితే అక్కడ డాక్టర్లు మధుబాల ఇంకా రెండేళ్లు మించి బ్రతకదని చెప్పారు. ఇండియా తిరిగి వచ్చినాక కిషోర్ కుమార్ మధుబాల కోసము బాంద్రాలో ఒక ఇల్లు కొని అందులో ఉండేవారు ఆ ఇంట్లో మధుబాల ఆలనాపాలనా చూడటానికి ఒక నర్స్ ను ఒక డ్రవర్ ను కిషోర్ కుమార్ నియమించాడు అప్పుడప్పుడు వచ్చి మధుబాలను చూసి వెళుతూ ఉండేవాడు అన్ని రకాల వైద్య ఖర్చులను కిషోర్ కుమారే భరించేవాడు ఈ విషయాలన్నీ మధుబాల చెల్లెలు మాధుర్ భూషణ్ తెలియజేసింది ఆ విధముగా వారి వైవాహిక జీవితము మధుబాల 1969 చనిపోయేవరకు అంటే 9 ఏళ్ల పాటు మధుబాలకు 36 ఏళ్ల వయస్సు వచ్చే వరకు కొనసాగింది  ఆ తరువాత కిషోర్ కుమార్ యోగితా బాలిని వివాహము చేసుకున్నాడు.
మార్చ్ 18,2008న భారత ప్రభుత్వమూ మధుబాల జ్ఞాపకార్ధము పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది ఈ స్టాంప్ లాంచింగ్ కార్యక్రమములో నటులు నిమ్మి, మనోజ్ కుమార్ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు  10 ఆగస్టు 2017లో ఢిల్లీలోని మేడం టస్సాడ్ మ్యూజియం లో మధుబాల జ్ఞాపకార్ధము మొఘల్ ఏ అజమ్ సినిమాలోని అనార్కలి వేషములో మధుబాల మైనము విగ్రహాన్ని ప్రతిష్టించారు. జులై 2018లో మధుబాల చెల్లెలు మాధుర్ భూషణ్ తానూ మధుబాల బయో పిక్ తీసే ఉద్దేశ్యము ఉన్నట్లు ఇతర సినీ రంగ ప్రముఖులు ఈ ప్రయత్నానికి సహకరించ వలసినదిగా కోరింది. భూషణ్ మధుబాల రోల్ కరీనా కపూర్ చే వేయించాలని అనుకుంది కాని  ఈ ప్రాజెక్ట్ అనేక కారణాల వల్ల నేటికీ ఫలించలేదు.నవంబర్ 2019లో ఇంతియాజ్ అలీ అనే సినీ నిర్మాత మధుబాల బయో పిక్ నిర్మాణానికి మధుబాల కుటుంబ సభ్యుల దగ్గర సినీ నిర్మాణ హక్కులను తీసుకున్నాడు చూద్దాము ఆ మహానటి బయో పిక్ కార్య రూపము దాల్చి వెండి తెరకు ఎక్కుతుందేమో ఈ సారి అయినా..
తన గురించి చెప్పుకుంటూ తాను ఖర్చు పెట్టె మనిషిని కాదని ఎందుచేతనంటే దేనికి ఎలాఖర్చు పెట్టాలో తెలియదు కాబట్టి అని అంటుంది తనకు నగల పట్ల ఖరీదైన  బట్టల పట్ల వ్యామోహము లేదని స్వయముగా చెపుతుంది. భగవంతుడి దయ వలన తనకు అన్ని ఉన్నాయని తానూ సంతోషముగా ఉన్నాను అని అంటుంది..సినిమా రంగములో మంచి పేరు ప్రఖ్యాతులు గడిచినప్పటికీ కుటుంబము కోసము డబ్బు సంపాదించే యంత్రముగా అనారోగ్యముగాఉన్నప్పటికీ తన భాధను దిగమింగుకుంటూ నటిస్తూనే దివి కేగినది ఈ అందాల తార,ఎవరు గ్రీన్ హీరోయిన్ మధుబాల
అంబడిపూడి శ్యామసుందర రావు