కరోన వాక్సిన్ - చిటికెన కిరణ్ కుమార్

Chitikena  kirankumar

అనుకున్నామా..... ప్రపంచ దేశాలు కరోనా వైరస్ బారినపడి బాధ పడాల్సిన విపత్తు వస్తుందనుకొన్నామా... ధనం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు. అని భావిస్తున్న కొందరికి ఈ రోజు పెను సవాల్గా నిలిచింది... అధికారం ఉంటే అన్ని సాధించొచ్చు అని అనుకున్న వారికి ఇప్పుడు ఏ అధికారాన్ని అడ్డు పెట్టి ఆ వైరస్ ను అంతమొందించాలి. అని ఆలోచిస్తున్నారు....శాస్త్ర సాంకేతిక, వైద్య విధానాలతో కొత్త తరహా లో ఆలోచించి ఒక సంజీవని లాంటి ( కరోనా వాక్సిన్ ) కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంటుందని అనుకున్నామా..... ఇది విడ్డూరమా లేక విధి వికటాట్టహాసమా.... స్వీయ నియంత్రణ, సామాజిక దూరం, లాక్ డౌన్, క్వారంటైన్ , ఐసొలే షన్.. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్స్... ఇలాంటి పదాలు మనం వింటాము అని అనుకున్నామా... కరోనా వైరస్ భయానికి మనమంతా లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉంటే కాలుష్యాన్ని నియంత్రించడం వల్ల ఓజోన్ పొర పెరిగిపోయి భవిష్యత్తుకు మనుగడ జరుగుతుందని ఇలాంటి సంఘటన ద్వారా కాలుష్యాన్ని అరికట్ట గలుగుతాము అని మనం అనుకున్నామా.... ఒకప్పుడు సంపన్న దేశంగా విరాజిల్లిన మన భారతదేశం... అలనాడు రోడ్డు పక్కన వజ్రాలు కుప్పలుగా పోసుకొని అమ్మి నటువంటి చరిత్ర కలిగినటువంటి గొప్ప దేశం మన భారత దేశం వైద్య, సాంకేతిక రంగాలు మన దేశం ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రపంచంలో అతి తక్కువ జనాభా కలిగిన దేశాల్లో కూడా విజ్ఞానవంతులు ముందుకొచ్చి తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని చాట్ చెప్పుకుంటున్నారు. అలాంటి తరుణంలో ప్రపంచంలో రెండవ అత్యంత జనాభా కలిగిన దేశంగా పేరుగాంచిన మన భారతదేశం మరియు అత్యంత యువత కలిగి ఉన్న దేశంగా ఉన్న మన దేశం ఇంకా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. సాంకేతిక, వైద్య రంగాలతో పాటు ప్రతి రంగంలో అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్న అత్యంత యువ సామ్రాజ్యాన్ని కలిగిన దేశం మన భారత దేశం. కరోనా లాంటి వైరస్ లు వెయ్యి ఒకేసారి పుట్టుకొచ్చినా భారతదేశం ఎదుర్కొన్నది అని చెప్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత పెద్ద శక్తిసామర్ధ్యాలు కలిగిన యువత కలిగిన దేశం మన భారత దేశం..  ఇలాంటి విపత్తులు ఎన్ని వచ్చినా ఎదుర్కొంటామని నడుం బిగించి మన కార్య సాధనలో ముందుకు వెళ్దాం.. ప్రస్తుతానికి స్వీయ నియంత్రణ పాటిస్తూ... కరోనా ను తరిమికొడదాం సర్వేజనా సుఖినోభవంతు ..