నవ్వుల జల్లు - జయదేవ్

మొద్దు పండిత రాజు : భర్తృహరి కవీంద్రా... మీ సంస్కృత పద్యాలు కఠినంగా వున్నాయి, అర్ధం గావడం కష్టంగా వుంది!
భర్తృహరి : ఏనుగు లక్ష్మణ కవి గారిని అందుకే, నా వెంట తీసుకువచ్చాను బాబూ!!


ఒక మిత్రుడు : నీ తల ఒక కోణంలో వంగిపోయిందే? కారణం?
రెండో మిత్రుడు : తలకోన జలపాతంలో తలపెట్టాను! ఒక రాయిపడింది!!

గాయకుడు : పాట పాడుమా కృష్ణా... పలుకు తేనె లొలుకు నటుల...
కృష్ణుడు : నావల్ల గాదు... మీరే పాడండి... నన్ను నేను మరిచిపోయి వింటూ కూచుంటాను, రాజేశ్వర రావు గారూ!!


కిం పురుషుడు : ఓ యబ్బో! ఇంద్ర ధనస్సునే ఎక్కుపెట్ట గలిగే ధీమంతుడివా? నువ్వు అర్జునుడివా??
ధీమంతుడు : కాదు! ఆ అర్జునుడికే పాశుపతాస్త్రాన్ని ప్రసాదించిన వాడిని!!
కిం పురుషుడు : హరహర మహాదేవ... క్షమించు స్వామీ!


అయ్యవారు : నీ పితృదేవతలందర్నీ తలచుకుని, తర్పణం వొదులు నాయనా!!
అతడు : ఒక్కరూ, గుర్తు రావడం లేదు, అయ్యవారూ!!
అయ్యవారు : ఐతే నాకు దక్షణ రెండింతలు ఇవ్వవలసి వస్తుంది!!
అతడు : ఇప్పుడు గుర్తొచ్చారు అయ్యవారూ!!


మంత్రి వర్యుడు : రాజధిక్కారము చేసినందుకు, నిందితుడి కఠిన శిక్ష ముగిసింది ప్రభూ! అతడ్ని విడుదల చెయ్యమంటారా?
కౄర ప్రభువు : వాడ్ని మొసళ్ళకి ఆహారంగా వేయండి!
మంత్రి వర్యుడు : ఈ శిక్ష ప్రారంభంలోనే విధించి వుంటే బాగుండేది కదా?
కౄర ప్రభువు : అతడు శిక్షార్హుడా, కాదా అని తేలడానికి కాలం పట్టింది కదా?
మంత్రి వర్యుడు : అది మీ తప్పు ప్రభూ! శిక్షకు సంబంధించిన తీర్పు వెను వెంటనే ఇవ్వాలి... ఇచ్చి తీరాలి!
కౄర ప్రభువు : ఐతే సరే! సేనాధిపతీ, ఈ మంత్రిని, రాజధిక్కారము చేసినందుకు, చెరసాలలో బంధించు, వెంటనే!!


కవి మిత్రుడు : వేళ్ళకి ఇంతలేసి కట్లు కట్టావు! ఏమైంది?
కవి : తాళ పత్రాలు పురుగుపట్టి నాశనమవుతున్నాయి గనుక, నా కావ్యాన్ని శిలా ఫలకము మీద వ్రాయ సంకల్పించితిని! సుత్తి దెబ్బ వేళ్ళ మీద పడి, అవి నలిగాయి!!


మహారాజు : శత్రు రాజు ఖజానాని చౌర్యము చేసిరమ్మని, ఒక చోరకళా నిపుణుడిని పంపించామే? అతడు తిరిగి వచ్చాడా?
మహామంత్రి : అతడు యువరాణీ వారి హృదయాన్ని అపహరించాడట! అతడూ, యువరాణీ, ఇరువురూ కనిపించుటలేదని ఇప్పుడే వార్త వచ్చినది మహాప్రభో!!


దేవేంద్రుడు : దిక్కులు చూస్తూ, అయోమయ స్థితిలో వున్న ఇతడెవరు?
సేవకుడు : దిక్పాలకుల్లో ఒకరట ప్రభో! తనదే దిక్కో మరిచిపోయి, దారితప్పి, దిక్కుతోచక తిరుగుతున్నారు ప్రభూ!


రాయలవారు : బ్రహ్మలిపిని నువ్వు తిరగ రాయగలవా?
వికట కవి : లిపిని చూపించండి, అద్దం తెప్పించండి రాస్తాను!!

మరిన్ని వ్యాసాలు

Neti telangana lo desi chandassu ki adyudu
నేటి తెలంగాణ లో దేశీ ఛందస్సుకు ఆద్యుడు
- డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్
అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు