గాయకులుగా మన సంగీత దర్శకులు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

గాయకులుగా మన సంగీత దర్శకులు.

గాయకులుగా మన సంగీత దర్శకులు.2. * జి.కే.వెంకటేష్ బాల నటుడిగా చిత్ర సీమలో ప్రవే సించి పలు తమిళ, కన్నడ చిత్రాలలో నటుడిగా గుర్తింపుపొంది. నిర్మాతగా, రచయితగా,సంగీత దర్శకుడిగా కన్నడ,తెలుగు,తమిళ,మళయాళ,బెంగాలీ,అస్సామి,ఒరియా వంటి పలుభాషాచిత్రాలలో 400 వందలకు పైగా సంగీత దర్శకత్వం వహించి,గాయకుడిగా 1955.లో వచ్చిన 'సంతోషం'చిత్రంలోనూ,1959 లో వచ్చిన 'ఆలుమగలు' 1975.వచ్చిన 'శ్రీవారు మావారు' చిత్రంలో 'గుండుమల్లెచెండుతో' అనేపాట,1987.లో వచ్చిన'జగన్మాత' చిత్రంలో 'వలపుపిలిచాను'వాణి జయరాంగారి తో కలసి పాడారు. పలు కన్నడ చిత్రాలలో పాడారు. *జే.వి.రాఘవులు 107 తెలుగు చిత్రాలకు సంగీత దర్శకుడిగా,1957లో వచ్చిని'భలే అమ్మాయిలు'1959 లో వచ్చిన 'పెళ్ళిసందడి' చిత్రంలో, 1960 వచ్చిన 'భక్తరఘునాధ్' 'శ్రీవెంకటేశ్వరమహత్యం' 'అభిమానం' 1961లోవచ్చిన'జగదేకవీరునికథ'చిత్రంలోనూ,1962 లో వచ్చిన 'గాలిమేడలు' 1963 లో వచ్చిన 'జజ్ఞానేశ్వర్' 1964లోవచ్చిన 'సత్యనారాయణ వ్రతమహత్యం' 1956లో వచ్చిన 'సొంతవూరు 'చిత్రంలోనూ, 1962 లో వచ్చిన 'కులగోత్రాలు'1966లోవచ్చిన 'పరమానందయ్య శిష్యులకథ' ' 1967లో వచ్చిన 'రహస్యం'1963 లో వచ్చిన' లవకుశ' ప్రాణమిత్రులు' 1968' పాపకోసం' 'గోవులగోపన్న' 1966 'శకుంతల' 1969 'బందిపోటు దొంగలు' 1972 లో వచ్చిన 'బీదలపాట్లు' వంటి పలు చిత్రాలలో పాటలు పాడారు. * చక్రవర్తి సంగీతదర్శకుడిగా 497 తెలుగు,60కన్నడ, 4తమిళం, 1మళయాళం మొత్తం959 చిత్రాలు చేసారు. నటుడుగా 'బలిపీఠం'-'రాజా'-'ఆమెకథ'-'అల్లరిబుల్లోడు'-'అతనికంటేఘనుడు'-'మరోసీతకథ'-'గోపాలరావుగారి అమ్మాయి'-'గజదొంగ'-'స్వరాజ్యం'-'తేనెటీగ'-'సీతాపతి సంసారం'-'రాగం-తానం-పల్లవి'-'ఆవిడ మాఆవిడే'-'రామసక్కనోడు'-రాజా'-'నిన్నే ప్రేమిస్తా'-లాహిరి లాహిరి లాహిరిలో వంటి పలుచిత్రాలలో నటించారు. గాయకుడిగా 'జయవిజయ'-'కత్తిపట్టినరైతు'-'మదనమంజరి'-'శ్రీశైలమహత్యం'-'కొడుకులు కోడళ్ళు'-'బంగారుసంకెళ్ళు'-'పరమానందయ్య శిష్యులకథ'-'శారదా'-'దేవిలలితాంబ'-'తల్లికూతుళ్ళు'-'నాగార్జున'-'నిలువుదోపిడి' రామునిమించినరాముడు'-'బాబు'-'పక్కింటి అమ్మాయి'-'స్వరాజ్యం'-'మల్లెపూవు'వంటి చిత్రాలలో పాటలు పాడారు.డబ్బింగ్ కళాకారుడిగా,రచయితగా చక్తవర్తి పేరుపొందారు. *ఇళయరాజా తెలుగు-తమిళ ఇతరభాషలలో 850 చిత్రాలకు పైగా సంగీతం చేసారు.పుస్తకరచయితగా,గాయకుడిగా తెలుగులో ,'సీతాకోకచిలుక'-'కూలినెంబర్ వన్'-'అంతఃపురం'-'మల్లెపూవు'-'గాయం2'చిత్రాలలో పాడారు.తమిళం లో వందలలో పాడారు.