బహుముఖ ప్రజ్ఞాశాలి పేకేటి శివరాం. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

బహుముఖ ప్రజ్ఞాశాలి పేకేటి శివరాం.

బహుముఖ ప్రజ్ఞాశాలి పేకేటి శివరాం. వీరి పూర్తిపేరు పేకేటి శివరామ సుబ్బారావు.1918/అక్టోబర్/8 వ తేదిన పశ్చిమ గోదావరిజిల్లా పేకేరు గ్రామంలో రాజేశ్వరమ్మ,కృష్ణమోహన్ దంపతులకు జన్మించారు.కాలేజిలో చదివే రోజుల్లో పత్రికలకు వ్యాసాలు రాయడం అలవాటు ఉండేది.పద్యాలు బాగా పాడగలగడంతో సరదాగా నాటకాల్లో వేషాలు వేసేవారు. 1937 లో మద్రాసు చేరి తాపీధర్మారావుగారి ప్రోత్సాహంతో రేడియో కార్యక్రమాలు చేసేవారు.పలు సినీ సమిక్షలు రాస్తూ హెచ్.యం. రెడ్డిగారికి'చిత్ర' అనే సినిమా పత్రిక ఉండేది'దాన్ని ఇంటూరి వెంకటేశ్వరరావు గారు చూస్తుండేవారు. రెండో ప్రపంచయుద్ధం బయంతో పేకేటి రాజమండ్రి చేరారు.అక్కడ అగ్నిమాపక కేంద్రంలో తాత్కాలిక ఉద్యోగంచేస్తూన్న సమయంలో ప్రభావతి గారితో వీరి వివాహం జరిగింది. అనంతరం మద్రాసు చేరి 'సినిమా ఫ్లేమ్'అనే పత్రికకు ప్రతినిధిగా ఉన్నారు. అలా పేకేటి భగవాన్ అనేపేరుతో పలు డిటెక్టివ్ నవలలురాసారు. బెంగుళూరులో వీరికి హెచ్.యం.వి.రికార్డింగ్ సంస్ధలో తెలుగు విభాగ ఆర్కెష్ట్రా నిర్విహకుడిగా ఉద్యోగం లభించింది.అదే సమయంలో ఘంటసాల వారు ఘంటసాల బలరామయ్యవద్ద నెలజీతానికి చేరారు.కామేశ్వరరావు అనే అధికారి ఘంటసాలను గాయకుడిగా పనికి రావు అని పంపించారు.పేకేటి కామేశ్వరరావు లేని సమయం చూసి ఘంటసాలను పిలిపించి'నగుమోమునకు నిశానాథా బింబము'అనే చాటు పద్యాన్ని,రతన్ రావు రచించిన 'గాలిలో నాబ్రతుకు తేలిపోయినదోయి' అనేపాటను రికార్డింగ్ చేసి విడుదలచేసారు.వాటి ద్వారా ఘంటసాలకు మంచిపేరు వచ్చింది.అలాఘంటసాలవారు చిత్రపరిశ్రమలో స్ధిరపడ్డారు. కొంతకాలం సంగీత దర్శకులు ఆదినారాయణ రావు గారి మేనేజర్ గాపనిచేసారు. కమలకుమారి అనే నటిని జయంతిగా పేరుమార్చి వివాహం చేసుకున్నాక,కొంతకాలం తరువాత విడిపోయారు. ప్రతిభా,వినోదావారి సంస్ధలలో ప్రొడక్షన్ వ్యవహారాలు నిర్వహించే రోజుల్లో 'శాంతి'(1952)చిత్రంలో సావిత్రి సరసన హాస్యనటుడిగా తొలిసారి వెండితెరపై కనిపించారు.అలా 'దేవదాసు'(1953) చిత్రలో భగవాన్ పాత్రలో పేరుపొందాడు.అలా తెలుగు,తమిళ,కన్నడ చిత్రాలలో నటించారు.కన్నడంలో'చక్రతీర్ధ' అనే నవలా చిత్రానికి దర్శకత్వం వహించగా దానికి రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వ అవార్డులు లభించాయి. 'కులగౌరవం' (1971)కన్నడ చిత్రం రాజకుమార్,భారతి,జయంతి లతో దర్శకుడిగా నిర్మించగా విజయంసాధించింది.తెలుగులో అదేపేరున నిర్మించగా దానికి పేకేటి వారే దర్శకులు.అనంతరం'చుట్టరికాలు'(1968) నటి లక్ష్మికి ఇది తొలి చిత్రం. (1969)చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటుడిగా 1953 లో'కన్నతల్లి' 'దేవదాసు' 'గుమ్మస్తా'1954లో 'రేచుక్క' 'వద్దంటేడబ్బు' 1955 లో 'కన్యాశుల్కం' 'అనార్కలి' 1957 లో 'సువర్ణసుందరి' 'భాగ్యరేఖ' పాండురంగ మహత్యం' 'వీరకంకణం'1958 లో పెళ్ళినాటి ప్రమిణాలు' 1959లో 'ఇల్లరికం' జయభేరి' 1960 లో శ్రీవెంకటేశ్వరమహత్యం''భీష్మ' 1961'ఉషాపరిణయం' 1962లో 'గుళేబకావళికథ' 'గాలిమేడలు'1964 'బబ్రువాహన' 'మురళికృష్ణ' 'వెలుగునీడలు' 1969 లో పునర్జన్మ'(కన్నడ దర్శకత్వం) 1974 లో'అల్లూరిసీతారామరాజు'మోదలగు చిత్రాలకు పనిచేసారు.కన్నడంలో ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతకు మునుపు పేకేటివారు కొంతకాలం ఢిల్లి ఫిలిం డవలప్ మెంట్ కార్పోరేషన్ లో పనిచేసారు. వీరికి నలుగురు కుమార్తెలు,ఐదుగురు కుమారులు. వీరిలో కృష్ణమోహన్ (ప్రముఖ జర్నలిస్టు.) రంగా (కళాదర్శకులు) వేణు,గోపాల్,రాణి,శాంతి,లక్ష్మి,పూర్ణిమ అనేవారు తొలిభార్యసంతతికాగా,రెండోభార్య జయంతికి కృష్ణకుమార్ అనేకుమారుడు.వీరి అల్లుడు తమిళ నిర్మాత దర్శకుడు త్యాగరాజన్ వారికుమారుడు ప్రశాంత్ . ప్రముఖ నిర్మాత రిపబ్లిక్ ప్రొడక్షన్స్ సీతారామ్ గారు వీరి వియ్యంకులే. బహుభాషాకోవిదుడు,అక్కేనేని,నందమూరివార్లకు అత్యంత సన్ని హితుడిగా మెలిగే వారు.2002 లో హెచ్చ్.యం.రెడ్డి గారి అవార్డు అందుకున్నారు. ఎందరినో ఆదుకున్న వీరు.88 ఏళ్ళవయసులో 2006/డిసెంబర్ / 30 వతేదిన వైకుంఠ ఏకాదశినాడు చెన్నయ్ లో కన్నుమూసారు.