సూరిగాడు - అనిసా తబస్సుమ్ sk

Surigaadu

ఇంకా జల్లు కురుస్తూనే ఉంది. వాకిలి మొత్తం బురదతో నిండిపోయింది. ఇంకా ఎన్ని రోజులు...అన్నట్టు వాన చినుకులను భారంగా మోస్తున్నాయి పూల మొక్కలు. చూరు మీద నుంచి సర్రున వాన నీరు జారుతుంది. అదే వరండాలో ఒక పక్కకి కూర్చొని చూరు మీద నుంచి జారుతున్న వాన నీటిని తదేకంగా చూస్తున్నాడు సూరీ. మరి అలా చూడక ఇంకేం చేస్తాడు!! అప్పటికే కడుపునిండా అన్నం తినీ మూడురోజులు అయింది. ఆకలికి తట్టుకోలేక ఇంట్లో ఒక పక్కన పడేసిన కొన్ని నూకలు మిగిలితే వాటితోనే గంజి కాచుకొని తాగుతున్నారు. సూరి ఇంట్లో తాను, అతని తల్లితండ్రులు,చెల్లి ఉంటున్నారు,ఇదే అతని కుటుంబం.

సూరి కూలీ పనికి వెళ్ళేవాడు. తల్లితండ్రులు వ్యవసాయ పనులు చేస్తారు. అతని చెల్లి సుగుణకు వచ్చే శ్రావణ మాసం లగ్గం పెట్టుకున్నారు. ఇంతలో సూరి తల్లి బయటకు వచ్చి, వరండాలో ఉన్న గుజను పట్టుకొని,విరక్తి - నిరాశ కలగలిసిన భావంతో "ముసురు...మాయదారి ముసురు వారం నుంచి పడతానే ఉండే.మనయా రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులాయే, ఇలాగే ఉంటే బతికి బట్టకట్టేది ఎలాగా.ఇక ఆ దేవుడే కనికరించాలా" అంటూ గుమ్మనికి అనుకోని చతికిల బడింది. సూరి వాళ్ళ కుటుంబానికే కాదు, దాదాపు ఊర్లో అన్ని కుటుంబాలది ఇదే పరిస్థితి. ఇందుకు గల కారణం,సూరి వాళ్ళ ఊరీ పక్కనే ఒక వాగు ప్రవహిస్తుంది.గట్టిగా నాలుగు రోజులు కుండపోత వాన పడితే వాగు పోంగి ఇళ్లు,వాకిలి,పశువుల కొట్టం,పొలాలూ...ఊరు మొత్తం నీట మునిగిపోతుంది.దిగువుగా ఉన్న ఇళ్ళలోకైతే ,ఇంటి లోపలి నీళ్లు వచ్చేస్తాయి. పొలాలు నీట మునిగి రైతు బిడ్డలకు కనీళ్లను మిగులుస్తాయి.వాకిలి దాకా నీళ్లతో మునిగి ఉండడంతో ఎవరు బయటికి కదలలేని పరిస్థితి,ఇంకా పొయ్యిలోంచి పిల్లెం కదులుతుంది.

సూరి వాళ్ళ ఇంటి పక్కనే ఒక చిన్న కుటుంబం ఉంది. ఇంట్లో పొయ్యి వెలిగించి ఎన్ని రోజులు అయిందో ఆకలికి పసిపిల్లల ఏడుపులు వినిపిస్తూనే ఉంటాయి. ఆటల్లో పడి ఆకలి మర్చిపోతారని బయటికి పంపుదామన్న వీలుకాని పరిస్థితయే. రెండు మూడు రోజులనుంచి వర్షం తగ్గడంతో ఇళ్ల ముందున్న నీరు తగిపోయింది. ఆలోచనలోంచి బయటకు వచ్చిన సూరి, చినుకు జల్లులు లెక్కజేయకుండా "పొలం చూసొస్తానే యమ్మ" అంటూ వరండాలో నుంచి అడుగుబయట పెట్టాడు. మడమల దాకా బురదలో కాళ్లు దిగింది. చెప్పులు పనికిరావని అర్ధం చేసుకొని, చెప్పులు తీసి వరండాలో ఒక పక్కకి విసిరి కొట్టి,నడక మొదలు పెట్టాడు. ఎలాగో అలా పొలం చేరుకున్నాడు. నిరాశతో పొలమంతా కలియ చూసాడు. ఏమి మిగలకుండా పొలమంతా నాశనమైంది. పొలంలో మిగిన కాస్తపాటి నీళ్లలోనే ఎన్నో నత్తలు,చేపలు కనిపిస్తున్నాయి. హట్టాతుగా సూరికి తన చెప్పిన మాటలు గుర్తొచ్చాయి."ప్రకృతి మనకు ఏది ఊరికే, అనవసరమైనవి ఎవడురా, ఏమిచ్చినా అది మన మంచికే,మనం కూడా దాన్ని అంతే గౌరవించాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి" అని. సూరి వెంటనే తన ప్యాంటును మోకాళ్ళదాకా ముడుచుకొని.పొలంలోకి దిగి గబ గబ గంప నిండా నత్తలు,చేపలు పట్టడు. అటునుంచి అటే చుట్టూ పక్క గ్రామాలకు వెళ్లి, వాటిని అమ్మి,వచ్చిన డబ్బుతో సరుకులు తీస్కొని ఇంటిదారి పట్టడు. ఇంటికి చేరాక కొన్ని సరుకులు పిల్లలున్న పక్కింట్లో ఇచ్చాడు.

ఆ రోజు సాయంత్రానికి ఇంట్లో ఒక పక్కకి మూడు ఇటుకలు పేర్చి ,నిప్పు ముట్టించి ఝమ ఝమలాడే చేపల పులుసు, నత్తల వేపుడు చేసి ఇంట్లో అందరికి వడ్డించింది సూరి తల్లి. "ఆహా!! ఎన్ని రోజులైంది నోటికి రుచి తగిలి "అంటూ సూరి నాన్న, "నీ వంటే వంటే వీరమ్మ" అంటూ సూరి.అందరూ కడుపు నిండా తిని ఆగమరిచి నిద్రపోయారు. రాత్రి పిల్లల ఏడుపులుకూడా వినిపించలేదు. * కథ సమాప్తం *

మరిన్ని కథలు

Vanta gadi lo veerudi katha
వంట గదిలో వీరుడు కథ
- రాము కోలా దెందుకూరు
Avadhulu daatina abhimanam
అవధులు దాటిన అభిమానం
- మద్దూరి నరసింహమూర్తి,
Maarina jeevitham
మారిన జీవితం
- Prabhavathi pusapati
Dharmo rakshathi rakshitaha
ధర్మో రక్షతి రక్షితః
- డా:సి.హెచ్.ప్రతాప్
Prathiroopam
ప్రతిరూపం
- డా:సి.హెచ్.ప్రతాప్
Maarpu manathone
మార్పు మనతోనే
- జ్యోత్స్న జల్లూరి
Samayaspoorthi
సమయస్ఫూర్తి
- డా:సి.హెచ్.ప్రతాప్
Asooya techhina chetu
అసూయ తెచ్చిన చేటు
- బోగా పురుషోత్తం , తుంబూరు.