రిస్క్ - Pillaa Kumaraswaamy

రిస్క్

 రిస్క్ అంటే కష్టమని అర్థం ఒకటే కాదు రిస్క్ అంటే భయం రిస్క్ అంటే ఏమవుతుందోనన్న భయం రిస్క్ అంటే ప్రాణం పోవడం కంటే నష్టం రావడం ఇలా రిస్క్ అంటే సందర్భాన్ని బట్టి అర్థం మారుతూ ఉంటుంది రిస్కు ఎదుర్కొన్న వాడే విజయాన్ని సాధించగలరు. సవాళ్ళను ఎదుర్కోవడం విజయసాధనకు చాలా ముఖ్యం. వాల్ట్ డిస్నీ ప్రపంచం ముందు విజేతగా నిలబడడానికి ముందు ఐదు సార్లు దివాలా తీశాడు. అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అవడానికి ముందు జీవితంలో 17 సార్లు వివిధ ఎన్నికల్లో పరాజయం పాలయ్యాడు. జాన్ గ్రిష్ హాం, మార్క ట్వైన్ లిద్దరూ తాము రాసిన పుస్తకాన్ని పబ్లిషర్లు ఎన్నిసార్లు తిప్పి పంపినా నిరాశ చెందలేదు. ఇవాళ వారిద్దరి పుస్తకాలు లెక్కలేనన్ని ఉన్నాయి. రిస్కు తీసుకోవడానికి ధైర్యం ఉండాలి. దానిపై మన పట్ల మనకు విశ్వాసం సవాలును స్వీకరించే మనస్తత్వం కలిగి ఉండాలి. రిస్క్ ఎదుర్కోవాలంటే మన మనస్సు అంతిమ విలువకు సిద్ధమై ఉండాలి. అప్పుడు పెద్దగా పట్టించుకోము.మార్క్ ట్వైన్ రచయిత తన రచనలను ఎవరూ ప్రచురించడానికి ముందుకు రాకపోయినా, ఆర్థికంగా కుంగిపోయినా రచనలు ఆపలేదు. ఒక్కసారి అతని రచన ప్రచురణకు నోచుకోగానే అతని దశ తిరిగింది. రిస్క్ అనేది వైఫల్యానికి ప్రతీక. వైఫల్యం అనేది ఈ విజయానికి ఒక మెట్టు లాంటిది. ఏ కష్టం లేకుండా జీవితంలో ఉన్నత శిఖరానికి వెళ్ళిన వాడు ప్రపంచంలో కానరాడు.సులభదారిలో శిఖరాగ్రానికి చేరుకోలేము. ఎత్తైన శిఖరం ఎక్కాలంటే దారిలో మిట్ట పల్లాలు ఉండటం సహజం. రిస్కు తీసుకోవాలంటే ధైర్యం తో పాటు ఓపిక కూడా అవసరమే. ఒక్కోసారి చాలా సమయం వృధా కావచ్చు. చేసిన పనంతా నిష్ప్రయోజనం కావచ్చు. టాల్ స్టాయ్ యుద్ధము-శాంతి నవలను 17 సార్లు తిరగరాశాడంటే దాని వెనుక ఆయన కృషి,ఓపిక మనం అర్థం చేసుకోవాలి. సోమరులు రిస్కులు తీసుకోరు. భయస్థులు రిస్కు జోలికి పోరు.పట్టుదల ఉన్న వారే రిస్కు కు సిద్ధపడతారు. రిస్కు చివరి అంచున విజయం ఉంటుంది.ఓడి పోరాడినా, పోరాడి ఓడినా ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది. జీవితంలో మనం చేసిన దానికి గుర్తు ఏమిటంటే మనం ఎదుర్కొన్న రిస్కులు,ఎదురు దెబ్బలు, విజయాలు. రిస్కులు ఎదుర్కొన్న చోట గాయాలు ఉంటాయి. గాయాల గుర్తులుగా కొన్ని మచ్చలు కూడా ఉంటాయి. చరిత్ర వాటిని లిఖిస్తుంది. గెలిస్తే ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది.ఓడితే నువ్వు ప్రపంచాన్ని అర్థం చేసుకుంటావు. రిస్కు తీసుకున్నప్పుడు ప్రకృతి కూడా సహకరిస్తుంది. నీ అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి నీ శ్రమ, పట్టుదలకు తోడుగాఎన్నో శక్తులు నీకు అనుకూలిస్తాయి. ఒకసారి ఒక పిచ్చుక సముద్రం ఒడ్డున ఒక చెట్టు లో గుడ్లు పెట్టుకుంది.సముద్రుడు ఉప్పొంగి ఆ గుడ్లను తనతో తీసుకెళ్ళాడు. పిచ్చుక చాలా బాధపడి సముద్రాన్ని దీనంగా వేడుకుంది తన గుడ్లను వెనక్కి ఇవ్వమని. సముద్రుడు పకపకా నవ్వి "మళ్లీ తెచ్చి ఇవ్వటమా అసంభవం. ఏం చేసుకుంటావో చేసుకో" అన్నాడు. పిచ్చుక సముద్రంతో ధైర్యంగా చెప్పింది " నువు నా గుడ్లను తెచ్చివ్వక పోతే నిన్ను ఎండిపోయేటట్లు చేస్తా చూడు"అంటూ ఒక్కో నీటి చుక్కను ముక్కు తో కరుచుకొని దూరంగా వేయసాగింది. సముద్రుడు పగలబడి నవ్వాడు. చుట్టూ ఉన్న కొన్ని పక్షులు ఎగతాళి చేశాయి. కొన్ని నవ్వి ఊరుకున్నాయి. కొన్ని సానుభూతి చూపాయి.కొన్ని ఏడ్చాయి. కొంతకాలం గడిచింది.పిచ్చుక శ్రమిస్తోంది.ఇదంతా గరుడ రాజుకు తెలిసింది. తన జాతి పక్షి ఇలా వేదన తో పోరాటం చేయటం గమనించి గరుడ రాజు పిచ్చుక కు మద్దతుగా సహాయం చేయడానికి వచ్చాడు. సముద్రునితో "నువ్వు గనుక పిచ్చుక గుడ్లను తెచ్చివ్వక పోతేనేను మా పక్షి జాతినంతా పిలుస్తాను.మేమంతా కలిసి నీ నీ భరతం పడతాం. నిన్ను కొన్ని రోజుల్లోనే ఎండిపోయినట్లు చేస్తాం" అని గరుడరాజు చెప్పింది. సముద్రుడు భయపడిపోయి పిచ్చుక గుడ్లను తెచ్చిచ్చాడు. ఈకథలో పిచ్చుక తీసుకున్న రిస్కు ఫలించింది. కారణం దాని పట్టుదల,ధైర్యం. అందువల్ల రిస్క్ లేకుండా ఏ పనిని సాధించలేం.

మరిన్ని వ్యాసాలు

ద్వీపాలు-వర్షాలు.పురాణకథ.
ద్వీపాలు-వర్షాలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
మాస్క్ బాంబులు
మాస్క్ బాంబులు
- చంద్ర శేఖర్ కోవూరు
Lahiri Lahiri Lahirilo -2
లాహిరి లాహిరి లాహిరిలో-2
- కర్రా నాగలక్ష్మి
మన సినిమాల్లో గోదావరి గీతాలు.
మన సినిమాల్లో గోదావరి గీతాలు.
- డా.బెల్లంకేండ నాగేశ్వరరావు.
తెలుగు నాటకరంగ విషేషాలు.
తెలుగు నాటకరంగ విషేషాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కోరికలే గుర్రాలు ఐతే
కోరికలే గుర్రాలు ఐతే
- చంద్ర శేఖర్ కోవూరు