బౌద్ధం పునాదులపై హిందూ మతాన్ని పునర్నిర్మించిన ఆచార్యత్రయం - పిళ్లా కుమారస్వామి

బౌద్ధం పునాదులపై  హిందూ మతాన్ని పునర్నిర్మించిన ఆచార్య

బౌద్ధం ఒక సామాజిక విప్లవశక్తిగా, సాంస్కృతిక పరిణామ రూపంప్రజ్వలిస్తూ ముందుకొచ్చింది.కాని క్రీ.శ.5వశతాబ్దం నాటికి బౌద్ధ భిక్కులు, బౌద్ధ సన్యాసులు విలాసాలకు అలవాటు పడి, బౌద్ధాన్ని మాయమంత్రాల ప్రభావంలోకి తీసుకురావడం వల్ల కూడా బౌద్ధం క్షీణిస్తూ వచ్చింది.దాంతో బౌద్ధం పునాదులను కుదిపి హిందూ పునరుద్ధరణ వాదానికి కంచుకోటలు నిర్మించినవారు ఆధ్యాత్మిక ఆచార్యత్రయంగా ప్రసిద్ధి చెందిన శంకర, రామానుజ, మధ్వాచార్యులు. వీరు ఆధ్యాత్మికవాదాన్ని గజిబిజి చేసి ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించి తాత్త్విక పునాదిని చెరిపివేసి భావవాదానికుండే అన్ని చీకటి గదులను తెరిచారు. భావవాదపు గాఢాంధకారపు లోయల్ని సృష్టించి, ప్రజల్ని ఆధ్యాత్మిక అనుభూతికి గురి చేసి ఆ లోయల్లోకి నెట్టారు. శంకర రామానుజ, మధ్వాచార్యులుగా ప్రసిద్ధి చెందిన ఈ ఆచార్య త్రయం హిందూ రాజ్యాలు బలంగా కొనసాగుతున్న కాలంలో వర్ధిల్లారు. సుమారు 8వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం దాకా ఈ హిందూ సమాజం వీరి తాత్వికభావాలతో, గానాలతో, ధ్యానాలతో, వాదవివాదాలతో, ఖండనమండనలతో, అనుకూల-ప్రతికూల వైరుధ్యాలతో ముక్కలు ముక్కలై గతంలో వచ్చిన భౌతిక ధోరణులన్నీ భావవాదంలోకి దిగబడిపోయాయి. బౌద్ధ కళను, సాహిత్యాన్ని, స్థూపాలను శిధిలం చేసి, వాటి పునాదులపై హిందూ మత ధార్మిక వ్యవస్థను రూపొందించి కర్కశంగా వారి రుధిరక్షేత్రాలపై హిందూ ఆధ్యాత్మిక సౌధాన్ని మీద బలంగానిర్మించారు.శంకరాద్వైతం నాగార్జునునిశూన్య వాదాన్ని పూర్తిభావవాదంగా మలచింది. బౌద్ధతత్త్వవేత్తలైన నాగ సేనుడు,నాగార్జునుని ప్రభావం అద్వైతం పై బలంగా ఉంది. బౌద్దం అనుసరించిన పద్దతులను హిందూ మతంలోకి తీసుకొచ్చారు శంకరుడు. దశావతాలు సృష్టించారు.బుద్దుని దేవుని దేశారు. యజ్ఞయాగాదులలోజంతువుల వధను ఆపేశారు.ప్రసాదంగా మాంసం బదులు శాకాహారాన్ని ప్రవేశపెట్టారు.అలాఆయన బౌద్ధం పునాదులపై హిందూ మతాన్నిపునర్నిర్మించారు. అప్పటికే నాగార్జునుని శూన్యవాదం తోనూ, బిక్కులు( బౌద్ద సన్యాసులు)విలాసాలకు అలవాటై పోవడంతోనూ,బౌద్ధ ధర్మాలు కాకుండా మాయమంత్రాల ప్రభావాల్లోకి పోవడంతో నూ బౌద్దం పతనావస్థకు చేరింది.పైగా బౌద్దులతో వాదిస్తూ వారిని ఓడిస్తూ ఆనాటి రాజుల సహాయంతో వారిని చంపిస్తూ శంకరుడు హిందూ మతాన్ని తిరిగి నిద్రలేపాడు. ఇలా కేవలం 32 సంవత్సరాలు జీవించిన శంకరుల ప్రభావం హిందూమతంపై అపారమైనది. స్మార్తులు, సంతులు అతను నెలకొలిపిన సంప్రదాయాలను ఆచరిస్తారు.దశనామి సంప్రదాయం, షణ్మత విధావం, పంచాయతన విధానం శంకరులు నెలకొలిపినవే. సన్యాసులు, బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరులు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించారనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని, మఠామ్నాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుల వ్యవస్థా నైపుణ్యానికి, కార్యనిర్వహణా దక్షతకూ తార్కాణం. హిందూధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి, సుస్థిరం చేయడానికి, వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం, అప్పటి (వందల సంవత్సరాల)నుంచి నేటివరకూ అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నదంటే శంకరులు ఏప్రాతిపదికపై ఎంత పటిష్ఠంగా నిర్మించారో తెలుస్తుంది. చతుర్ధామాలు నిరంతరాయంగా నిర్వహించబడేందుకు శంకరులు మఠామ్నాయము, మహాశాసనము అనే నిర్వహణ పద్ధతులను ప్రవేశ పెట్టారు. మఠామ్నాయము, మహాశాసనములు నేటి ఆధునిక కంపెనీలు తయారు చేసుకొనే, నిర్వహణ స్వరూపమైన, మెమొరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనే రెండు ప్రధాన పత్రాల వంటివి. ఒకటి సంస్థ యొక్క అంతర్గత నిర్వహణకు సంబంధించినది కాగా రెండవది సంస్థకు బయటి ప్రపంచంతో సంబంధాన్ని వివరిస్తుంది. నేటి ఆధునిక పద్ధతులను శంకరులు ఆనాడే మఠాల నిర్వహణ కొరకు ప్రవేశపెట్టారు. శంకరులు మఠ నిర్వహణ కొరకు నియమింపబడే సన్యాసుల నామాంతరము యోగపట్టమనే దాన్ని ప్రవేశపెట్టారు. హిందూధర్మం ప్రకారం సన్యాసం తీసుకొన్న వ్యక్తి పాతపేరును తీసివేసి సన్యాసి అని సూచించే కొత్తపేరును తీసుకొంటాడు. అటువంటి ప్రత్యేక నామాన్ని యోగపట్టము అంటారు. ఈ పద్దతి బౌద్ధం నుంచి స్వీకరించాడు. అటువంటి పది పేర్లను శంకరులు నిర్దేశించారు. అవి .తీర్ధ, ఆశ్రమ, వన, గిరి, అరణ్య, పర్వత, సాగర, సరస్వతి, భారతి, పురి అనేవి. హిందూ సన్యాసుల పేర్ల చివర ఇలాంటివి కనిపిస్తాయి. ఉదాహరణకు- ఆనందతీర్ధ, విద్యారణ్య, సత్యవృత సామాశ్రమి, విద్యాప్రకాశానందగిరి, చంద్రశేఖరసరస్వతి, నృసింహ భారతి, తోతాపురి అనే పేర్లు సుప్రసిద్దాలు. శంకరులు నాలుగు మఠాల స్థాపనకు ప్రమాణంగా దిక్కులను, వేదాలను, సంప్రదాయాలను అనుసరించారు. ఆరామాలను నిర్మూలించి వాటికి లంజ దిబ్బలని నామకరణం చేశారు. శూద్ర, దళితులను హిందూ ఆధ్యాత్మిక వాదంలోకి లాగారు. బౌద్ధ కళను,సాహిత్యాన్ని, స్థూపాలను శిధిలం చేసి, వాటి పునాదులపై హిందూ మత ధార్మిక వ్యవస్థను రూపొందించి కర్కశంగా వారి రుధిర క్షేత్రాల పై హిందూ ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించారు. వీరి ప్రభావంతో హిందూ రాజ్యాలు బౌద్ధ, జైన సన్యాసులను పట్టుకొని ఊచకోత కోశాయి.ఈ త్రిమతాచార్యులు ఆహార్యంలో సన్యాసత్వం, బోధనల్లో అహింస , ఆచరణలో క్రౌర్యం వీరి జీవనంగా సాగింది. అడుగు అడుగులో ప్రత్యర్ధులుగా భావించిన బౌద్ధ, జైన, చార్వాక వాదులను వేధిస్తూ వధిస్తూ ఆధ్యాత్మిక మార్గాన్ని భౌతిక వాదుల శిధిల దేహాలపై నిర్మించినారుు. మౌర్య సామ్రాజ్యం అంతరించడం, హిందూ సామ్రాజ్య విస్తరణను చారిత్రకంగా మనం పరిశీలిస్తే హిందూ సామ్రాజ్యాలు బలపడటానికి ఈ త్రిమతాచార్యులు ఎలా దోహదపడ్డారో మనకు అర్ధమవుతుంది. వీరు బోధించిన తాత్త్విక అంశాలు ఏమీ లేకపోయినా, వీరిని గొప్ప తత్త్వవేత్తలుగా హిందూ ఆధ్యాత్మిక వాదులు ఆకాశాని కెత్తుకొని కొనియాడారు. వీరికాలం భౌతిక వాదులకు అంధకార యుగం అని చెప్పొచ్చు. మీమాంస కులు చెప్పిన వాదం ప్రతివాదం అనే తాత్త్విక చర్చను పక్కన పెట్టి, ప్రత్యర్ధిని, ప్రత్యర్థి వాదాన్ని దునుమాడటం అనే కర్కశ సూత్రాలు వీరు ప్రవేశ పెట్టారు. ఏనుగులతో తొక్కించి, గానుగులలో రుబ్బించి, వధ్యశిలపై వధించి, సీసాలు కరిగించి పోసి, నాలుకలు ఛేదించి హింసతో భౌతిక-సాంఘిక వాదులను అంతం చేసిన ఈ త్రిమతాచార్యుల వారసులు ఆ తర్వాత వారి ధార్మిక హింసా వాదాన్ని ముందుకు కొనసాగించారు. చరిత్రలో వారి వధ్య శిలపై స్రవించిన రక్తపుచారల తడి ఇంకా ఆరలేదని కత్తి పద్మారావు తన చార్వాక దర్శనం లో చెపుతారు.

మరిన్ని వ్యాసాలు

ద్వీపాలు-వర్షాలు.పురాణకథ.
ద్వీపాలు-వర్షాలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
మాస్క్ బాంబులు
మాస్క్ బాంబులు
- చంద్ర శేఖర్ కోవూరు
Lahiri Lahiri Lahirilo -2
లాహిరి లాహిరి లాహిరిలో-2
- కర్రా నాగలక్ష్మి
మన సినిమాల్లో గోదావరి గీతాలు.
మన సినిమాల్లో గోదావరి గీతాలు.
- డా.బెల్లంకేండ నాగేశ్వరరావు.
తెలుగు నాటకరంగ విషేషాలు.
తెలుగు నాటకరంగ విషేషాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కోరికలే గుర్రాలు ఐతే
కోరికలే గుర్రాలు ఐతే
- చంద్ర శేఖర్ కోవూరు
శ్రీ కుమారస్వామి ఆలయాలు.
శ్రీ కుమారస్వామి ఆలయాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.