దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య.

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య.(జయంతి సందర్భంగా.)
ఆంధ్రరత్న బిరుదాంకితుడు గొప్పవక్త,గాయకుడు,విమర్శకుడు,కావిరంగు వస్త్రధారి,స్వాతంత్ర్య పోరాట యోధుడు అయిన దుగ్గిరాలవారు కృష్ణాజిల్లా లోని పెనుగంచిప్రోలులో సీమ్మ కోదండ రామస్వామి దంపతులకు 1889/జూన్/2వ తేదిన జన్మించారు.దరదృష్టవశాత్తూ వీరికి మూడేళ్ళ వయసులో తల్లి తండ్రిని కోల్పోయారు.వీరి పినతండ్రి,నాయనమ్మలవద్ద పెరిగారు.కూచిపూడి,గుంటూరులో వీరివిద్య సాగింది.అప్పుడు జాతీయ నాట్యమండలి' స్ధాపించి సంగీత నాటక కార్యక్రమాలు నిర్వహించారు.బాపట్లలో మెట్రిక్యులేషన్ పూర్తిచేసి గుంటూరులోని నడింపల్లి నరసింహారావు అనే మిత్రుడి సహాయంతో స్కాట్లాండ్ లోని ఎడింబరో విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. పూర్తిచేసారు.అనంతరం రాజమండ్రి, బందరు కళాశాలలో పనిచేస్తున్న సమయంలో గాంధీజీ స్వరాజ్య శంఖారావం దుగ్గిరాలవారిని ఉత్తేజపరచింది.వీరికి సేవాతత్పర, కార్యదీక్ష,ధైర్య సాహసాలు మెండుగా ఉండేవి.తనగురువర్యులైన డా.ఆనందకుమారస్వామి,గాంధీజిల ఆశీస్సులతో చీరాల-పేరాల సమీపంలోని రామనగర్ గ్రామానికి పునాది వేశారు.బ్రిటీష్ వారి పన్నుల దోపిడీని తీవ్రంగా ప్రతిఘటించారు.ఫలితంగా చెరసాల శిక్ష అనుభవించి వచ్చిన వీరిని గాంధీజి పూలమాలతో సత్కరించారు.స్వరాజ్య సాధనకోసం తను స్ధాపించిన 'శాంతిసేన'పేరును'రామదండు'గా మార్చి శాసన ధిక్కారా నికి పిలుపు ఇచ్చి మరలా చెరసాలకు వెళ్ళారు.1912లో పొన్నురులో జరిగిన 'గుంటూరు మండలి' సభలో వీరికి 'ఆంధ్ర రత్న'బిరుదు పొందారు.1923 లో నాగపూర్ లో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక అయ్యారు.ఆకార్యాలయం విజయవాడకు మార్పించారు. అలా పలు సభలకు అధ్యక్షతవహించి తన రాజకీయ ఉపన్యాసంతో వేలమందిని స్వాతంత్ర్య సమరయోధులుగా వెన్నుచూపని దేశభక్తులుగా మార్చారు.నాటి ప్రజలను రాజకీయ చైతెన్యులుగా చేయడానికి 'సాధన'అనే ఆంగ్ల పత్రిక స్ధాపించారు.కుల మత బేధాల రూపురేఖలు చెరిపివేయాలని మానవులంతా ఒకటేనని తను నమ్మిన జాతీయ సమైక్యతాభావాన్ని వెల్లడిస్తూ,నదులన్ని సాగరంలో కలసినట్లే ఏపేరుతో పిలిచినా,ఏభాషలో వేడినా సర్వమతాలధ్యేయం ఒక్కటేనని అస్పుృత్య నివారణ కోసం తనజీవితకాలాన్నే ధారబోసిన ధీరశాలి వీరు. తెలుగునాట జానపద కళారూపాల అభివృధ్ధికి,గ్రంధాలయాల వ్యాప్తికి కృషిచేసారు.ఈర్ష్య,ద్వేషాలతో మనిషి మనఃశాంతి కోల్పోయి పతనమౌతాడని వాటికి దూరంగా శాంతితో జీవనం చేయాలి అని ఆచరించి చూపిన ధీరశిలి.ఉత్తమ ఆశయశీలిగా చీరాల-పేరాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ రామనగరు రంగభూమి సారధిగా,తెలుగు ప్రజల హృదయంలో శాశ్వితస్ధానం పొంది, క్షయవ్యాధికిలోనై రెండు సంవత్సరాల పోరాడిన అనతరం 1926/ /10 వతేదిన తన ఇష్టదైవం అయిన శ్రీరామ నామంజిపిస్తూ శాశ్వితనిద్రలో ఓరిగిపోయారు.