పింగళి లక్ష్మికాంత కవి. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

పింగళి లక్ష్మికాంత కవి.

పింగళి లక్ష్మికాంతంకవి.
తెలుగు సాహిత్యాన్ని హృదయానికి హత్తుకునేలా రాసిన మనకీర్తిశిఖరాలలో ఈమహనీయులు ఒకరు.1894జనవరి 10వ తేదిన కృష్ణాజిల్లా బందరు తాలూకా ఆర్తమూరులో వెంకటరత్నం,కుటుంబమ్మ గార్లకు జన్మించారు.రాయలవారి అష్టదిగ్గజాలలో ఒకరైన పింగళి సూరన వంశీయులు వీరు.ప్రాధమిక విద్య రేపల్లెలోనూ బందరు హిందూ ఉన్నతపాఠశాల,నోబుల్ కళాశాలలో చదివారు.మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. పట్టాపొందారు.తిరుపతి వేంకటకవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి వారి శిష్యరికంచేసారు.శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆంధ్రాచార్య అధ్యక్షులుగా పనిచేసారు.కాటూరి వెంకటేశ్వరరావుగారితోకలసి జంటకవులుగా ప్రసిధ్ధి చెందారు.వీరు ముదునూరు,తోటవల్లూరు,నెల్లూరు వంటి పలుచోట్ల శత అవధానాలు చేసారు.నటుడిగా వీరు పాండవోద్యోగ విజయములు,ముద్రరాక్షసము వంటి పలు నాటకాలలో రచించారు.కేంద్ర సాహిత్య ఆకాడమి సభ్యులుగా వ్యవహరించారు.కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ,త్రిపురనేని రామస్వామి వంటిఉద్దండులతో,చెళ్ళపిళ్ళ వారి ప్రోత్సాహంతో 'మధురపండితరాజాం'-'ద్విపదభారతం'-'సౌదరనందనం'-'తొలకరి'-'గౌతమవ్యాసములు'-'సంస్కృతకుమారవ్యాకరణము'-'ఆంధ్రసాహిత్యచరిత్ర'-'గౌతమనిఘంటువు'-'లతోపాటు పలు రేడియో ప్రసంగాలు'-'ఆత్మలహరి'-'సాహిత్యవిమర్శ'-'ఆంధ్రవాజ్మయవిమర్శ'-'సాహిత్యశిల్పసమిక్ష'-'పల్నాటి వీరచరిత్ర''ఆంగ్లదేశచరిత్ర'-'మహత్మగాంధి చరిత్ర' వంటి పలు రచనలు చేసారు. మానవులు అందరూ సోదరులు అనే విభిన్నవృత్తాలపై వీరు రచనలు చేసారు.1924సం"వీరి 'తొలకరి'రచన సాహిత్య లొకంలో అత్యంతప్రాచూర్యం పొందింది.13,14శతాబ్దములలో ప్రారంభమైన జంటకవుల సంప్రదాయం 19,20 శతాబ్దాలనాటికి విజయపంథాన నడచింది.తిరుపత వేంకటకవులు, కొప్పవరపు కవులు,వెంకట పార్వతీసకవులు,పింగళికాటూరికవులు తమరచనలతో సాహిత్యభేరిని మోగించారు.అనేక రాజస్ధానాలకు వెళ్లి విజయపత్రాలు అందుకున్నారు. తిరుపతి వెంకటేశ్వరవిశ్వవిద్యాలయంలో ఏడేళ్లు ఆచార్యులుగా పనిచేసారు.మరణించేవరకు తెలుగు ఆకాడమీకి సేవలు చేసారు.అధ్యాపక వృత్తిలో పింగళివారు మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు.1930 దశకంలొ తెలుగు బిఏ.ఎంఏ.పట్టభద్రులకు పాఠ్యప్రణాలికలను నిర్దేశించిన సాహితీవేత్త.1954-1961 వరకు విజయవాడ ఆకాశవాణి కేంద్రం సలహాదారులుగా ఉన్నారు. 1961-1965 వరకు ఆచార్యునిగా ఉన్నారు.
పైడిలక్ష్శయ్య పురస్కారం,మహామంత్రి మాదన్న పురస్కారం,యార్లగడ్డ రంగనాయకుల పురస్కారం,డా.బూర్గుల రామకృష్ణగారిపురస్కారం,బంగారు పుష్ప సన్మానము,బంగారు కంకణ సత్కారం వంటి పలు పురస్కారాలు,మరెన్నో అందుకున్నారు .సుభాషిణి మాసపత్రికకు సంపాదకులుగా ఉన్నారు.బహుముఖ ప్రజ్ఞా శాలిగా గుర్తింపు పొందిన ఈమహకవి 1972జనవరి 10 వతేదిన కన్నుమూసారు.వీరిజయంతి-వర్ధంతి ఒకేరోజు రావడం ఈకవి చరిత్రలో విషేషం.