సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ.

సూర్యదేవరరాజ్యలక్ష్మిమ్మ.
దేశభక్తురాలు,హిళామార్గదర్శని అయిన శ్రీమతి రాజ్యలక్ష్మిదేవి 1914 మే 18న కృష్టాజిల్లా వీరులపాడులో వాసిరెడ్డి సీతారామయ్య సుబ్బమ్మ గార్లకు సంపన్నకుటుంబంలో జన్మించారు. హనుమాయమ్మ గారిశిక్షణలో తెలుగులోమంచి ప్రావీణ్యం సంపాదించారు.1925 లో సూర్యదేవర నాగయ్యగారితొ వీరి వివాహంజరిగింది.జాతియోద్యమం ముమ్మరంగా సాగుతున్నరోజులు అవి.బాల్యంనుండి దెశభక్తి కలిగిన ఈమె ప్రముఖ స్వాతంత్యసమరయోధురాలు అయిన గోళ్లమూడిరత్నమ్మగారిప్రేరణతొ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 1932జనవరి 26 న అరెస్టు చేసిన అందరిని ఆరుమాసాలు రాయవేలూరు,ఆరుమాసాలు మద్రాసు జైలులో ఉంచారు. అప్పుడు అక్కడ మార్గెరేట్ కజిన్స్ వద్ద ఆంగ్లం నేర్చుకున్నారు, రాథాబాయి సుబ్బరామన్ ,చుండూరురత్నమ్మ,చోగడంఅమ్మన్నరాజా వంటి ప్రముఖ సమరయోధుల పరిచయాలు లభించాయి.అప్పుడు ఆమెవయసు 19ఏళ్లు.జైలునుండి విడుదలైన అనంతరం చేబ్రోలు లోని హింది విద్యాలయంలో చేరి రాష్ట్రభాషావిశారద పరిక్షలో ఉత్తిర్ణత సాధించారు.అనంతరం దుర్గాబాయమ్మగారి ప్రోత్సాహంతో మద్రాసు వెళ్లి మెట్రిక్ పరిక్షరాసి ఉత్తిర్ణత సాధించారు.ఆగస్టు ఉద్యమంలో పాల్గొని వ్యవసాయ కూలి వేషంలో రహస్యజీవనం కొనసాగించారు.1945 లోజాతీయనాయకులు,సమరయోధులు అందరు చెరసాలనుండి విడుదలకావడంతో ఈమె మహిళా అభ్యున్నతికి విషేషంగా కృషి చేస్తూ1948 జూన్ 8 న తెలుగుదేశం పేరుతో హైదరాబాద్ లో వారపత్రిక ప్రారంభించారు.రాష్ట్రకాంగ్రెసు పార్టిలో ప్రముఖులుగా గుర్తింపు పొందారు.
1973లోమధ్యపాననిషేధ పరిషత్తు సభనిర్వహించారు.అలా సంపూర్ణమధ్యనిషేదాన్నిఅమలు పరచాలని రాష్ట్రం అంతటా పర్యటించారు.గ్రంధాలయల అభివృధ్ధికి తనవంతు సేవలు అందించారు.గాంధిజీ పిలుపుకు స్పందించి ఊహతెలిసిన నాటినుండి ఊపిరి ఆగేవరకు ఖధ్ధరు వస్త్రాలే ధరించారు.
సూర్యదేవర నాగయ్యతో రాజ్యలక్ష్మీ దేవికి పదేళ్ళ వయస్సులో వివాహం జరిగింది. ఆమెకు 16 ఏళ్ళు వచ్చి అత్తవారింటికి వచ్చేవరకు విద్యావ్యాసంగాలు కొనసాగించారు. వీరులపాడులో అప్పట్లో ఒక గ్రంథాలయాన్ని స్థాపించి, తాపీ,కందుకూరి,గురజాడ,త్రిపురనేని వంటి సంఘ సేవకులు, సంస్కారప్రియులు రచించిన గ్రంథాలను రాజ్యలక్ష్మీదేవి ప్రతి రోజూ తెచ్చుకుని చదివి అవగాహన చేసుకునేవారు. ఇవన్నీ ఆమెలో స్వతంత్య్రభావాలను, స్వేచ్ఛాభిలాషను పెంచాయి.
1920 లో గాంధీజీ ఇచ్చిన పిలుపు విని దేశసేవకు పూనుకున్నారు. 1930 ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనాలని ఆమప్రయత్నిం చారు. కానీ జెైలుశిక్ష అనుభవించటానికి, సత్యాగ్రహం చేయటానికి భర్త ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు. 1932 లో శాసనోల్లంఘనం నాటికి ఆమె అత్త వారింటికి చేబ్రోలు వచ్చారు.
రాట్నంపై నూలు వడకటం, హిందీ నేర్చుకోవటం, ఉద్యమం ప్రచారం చేస్తూ రాజ్యలక్ష్మీదేవి దగ్గర బంధువెైన అన్నపూర్ణమ్మతో శాసనోల్లంఘన చేయతల పెట్టారు. ఈ విషయం చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలందరికీ తెలిసిపో యింది. వారిని చూడాలని వచ్చిన ప్రజలతో వీధులు కిక్కిరిసి పోయాయి. జాతీయగీతాన్ని ఆలపిస్తూ శాసనధిక్కార నినాదాలు చేస్తూ అందరూ ఊరేగింపుగా బయలుదేరారు. పోలీసులు ఈ ముగ్గురినీ అరెస్టు చేశారు.
శిక్ష గురించి న్యామూర్తుల ఇళ్ళలో సైతం స్త్రీలు వీరికి అండగా నిలవడంతో ఆ శిక్ష రద్దు చేసి నామమాత్రపు శిక్షను ముగ్గురికీ విడివిడిగా విధించారు. ఈ నేపథ్యంలో రాజ్యలక్ష్మీదేవిని రాయవేలూరు జెైలుకు తరలించారు. ఆ తరువాత రాజ్యలక్ష్మి ఖాదీ ప్రచారం, మహిళా ఉద్యమం, రాజకీయ కార్యకలాపాలు పరిపాటి అయినాయి. గ్రంధాలయంలో హిందీ తరగతులు నిర్వహించేవారు. తనుకూడా కష్టపడి చదివి రాష్ర్టభాష పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.

అస్పృశ్యతా నివారణకై సూర్యదేవర రాజ్యలకీదేవి తన వంతు కృషి చేశారు. పేరంట సమయంలో సైతం హరిజన స్త్రీలను ఆహ్వానించి అందరితో పాటు గౌరవించేవారు. 1940 లో వ్యక్తి సత్యాగ్రహం ఆరంభమైంది. గుంటూరు జిల్లాలో ఆ సత్యా గ్రహం చేయడానికి అనుమతి లభించిన తొలిస్త్రీ రాజ్యలక్ష్మి అని చెప్పవచ్చు. 1941 జనవరి30 న బాపట్ల తాలూకాలోని బ్రాహ్మణ కోడూరు ఆమె సత్యాగ్రహం చేశారు. పోలీసులు అరెస్ట్‌ చేసి, రెండు నెలల జెైలు శిక్ష, వందరూపాయల జరిమా నా కూడా విధించారు. ఆమె జెైల నుండి విడుదలెైన పిదప మద్రాసులోని ఆంధ్ర మహిళా సభకు చేరుకున్నారు. ఆ తరువాత తెనాలి వెళ్ళి ట్యుటోరియల్‌ కాలేజిలో చేరి బెనారస్ మెట్రిక్యులేషన్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఆమె చేబ్రోలు కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉండి మహిళాభ్యున్నతికి దేశాభ్యుదయానికి పాటుపడ్డారు. ఇంతలో క్విట్‌ఇండియా ఉద్యమం వచ్చింది. అందులో రాజ్యలక్ష్మీదేవిని శాసనధిక్కార శాఖ సభ్యురాలిగా నియమించారు. ఆమె రహస్యంగా జిల్లాలన్నీ తిరిగి ప్రజలచే శాసనధిక్కారం చేయించారు. పోలీసులు ఆమెను వెంటాడేవారు
కానీ దేశభక్తులు ఆమెను కాపాడేవారు. రాజ్యలక్ష్మీదేవి 1941 లో చేబ్రోలులో జాతీయ మహిళా విద్యాలయాన్ని స్థాపించారు. ఆ తరువాత 2 అక్టోబరు 1945లో ఆంధ్రరాష్ర్ట మహిళా రాజకీయ పాఠశాలను ప్రారంభించారు. భారతదేశానికి 1947 ఆగష్టూ 15వ తేదీన స్వాతంత్య్రం సిద్ధించింది. అయితే నెైజాము వాసులకు విముక్తి కలగలేదు. రాజ్యలక్ష్మీదేవి విరాళాలు, చందాలు పోగుచేసి నెైజాం వ్యతిరేక పోరాట నాయకులకు తమ సంఘీభావాన్ని తెలిపారు. ‘మాకు ధనసహాయం వద్దు అంగబలం కావాలి. మాతో నిలబడి ఉద్య మ ప్రచారానికి సహకరించండి’ అని నాయకులు కోరారు. టంగుటూరి సూర్యకుమారి పాట కచ్చేరీ ద్వారా వసూలెైన మొత్తాన్ని ధన సహాయంగా ఇవ్వటమేకాక రాజ్యలకీదేవి వ్యక్తి గతంగా నెైజాం వెళ్ళి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమ య్యే వరకు ఆమె అక్కడి వారితో కలసి పోరాటం సాగించారు.గ్రoధాలయ ప్రథానకార్యదర్శిగా కొంతకాలం పనిచేసిన ఈమహిళాజాతి చూడామణి 2010 ఆగస్టు7 న భరతమాత ఒడిలో శాస్విత నిద్రకు ఒరిగి పొయారు.

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్
Kuldara Mystery
కుల్ధారా మిస్టరీ
- డా:సి.హెచ్.ప్రతాప్
Kashi Prayana Kathalu - Phalitham leni Mantram
కాశీ ప్రయాణ కథలు - ఫలితం లేని మంత్రం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Prapancha Enugula Dinotsavam
ప్రపంచ ఏనుగుల దినోత్సవం
- .....బొల్లిముంత వెంకట రామనా రావు