రాయప్రోలు సుబ్బారావు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

రాయప్రోలు సుబ్బారావు.

రాయప్రోలు సుబ్బారావు.
ఏదేశమేగినా ఎందుకాలిడినా ఏపీఠమెక్కినా ఎవ్వరేమనిన పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరి నీ జాతి నిండు గౌరవము అన్నకవి రాయప్రోలువారు. నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు గుంటూరు జిల్లా గార్లపాడులో ఆదెమ్మ, వెంకటప్పావధాని దంపతులకు 1892 మార్చి 13 న జన్మించారు.వీరు అవ్వారు సుబ్రహ్మణ్యశాస్త్రి గారి మేనల్లుడు మేనమామతో కలసి పలు అవధానాలు చేసారు.తెలుగులోభావ కవిత్వానికి ఆద్యుడు. ఈయన 1913లో వ్రాసిన తృణ కంకణంతో తెలుగులో కవిత్వములో నూతన శకము ఆరంభమైనదని అంటారు. ఇందులో ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. ప్రేమ పెళ్ళికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో ఖండకావ్య ప్ర క్రియకు అంకురార్పణ చేశాడు.కళాకారుని ఊహలు, భావాలు, సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చే కళారూపం భావుకత. 18వ శతాబ్దంలో జర్మనీ, ఫ్రాన్స్ దేశాలలో వికసించిన ఈ కళాప్రక్రియ చిత్రకారులనూ, రచయితలనూ, శిల్పులనూ, కవులనూ గాఢంగా ప్రభావితం చేసింది. పాశ్చాత్యదేశాలలో పరిమళించిన ఈ భావుకతను రాయప్రోలు తెలుగులో విరజిమ్మాడు. సంస్కృత రచనలపై అతిగా ఆధారపడిన తెలుగు కవిత్వాన్ని స్వతంత్ర రచనలవైపు మళ్ళించాడు.
అయితే రాయప్రోలుది గ్రుడ్డి అనుకరణ కాదు తెలుగు సంస్కృతభాష పటిమను ఆయన విడలేదు. మన సమాజానికి అనుగుణంగా భావుకతను అల్లి తెలుగు కవితకు క్రొత్త సొగసులు అద్దాడు. రాయప్రోలు గొప్ప జాతీయవాది. తెలుగు జాతి అభిమాని. ఆయన దేశభక్తి గేయాలు ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి. వ్యక్తిగతంగా మాత్రం కవిత్వంలో వ్రాసిన దేశభక్తికి ఫక్తు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి రాయప్రోలు.ఠాగూర్ వ్యాసాలు అనువదించారు.ఉమర్ ఖయాంను 'మధుకలశం'పేరున అనువాదించారు.ఈయన రచనలు ప్రధానంగా ఖండ కావ్యాలు. తృణకంకణము, ఆంధ్రావళి, కష్టకమల, రమ్యలోకము,వనమాల,మిశ్రమంజరి,స్నేహలతా దేవి స్వప్నకుమారము,తెలుగు తోట,మాధురీ దర్శనం, రూపనవ నీయతం.వంటి పలురచనలతోపాటు,
అనుమతి,భజగోవిందముసౌందర్య లహరి,దూతమత్తేభము,లలిత,వంటి అనువాద రచనలతో పాటుగా భజగోవిందం శ్లోకాలను గేయాలుగా తెలుగులోనికి తెచ్చారు.
తెలుగు సాహిత్యానికే వన్నెతెచ్చిన ఈకవిరాజు 1984 జనవరి 30 తేదిన కళామతల్లి ఒడి చేరారు.
డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.9884429899.