రాచకొండ విశ్వనాధ శాస్త్రి. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

రాచకొండ విశ్వనాధ శాస్త్రి.


రాచకొండ విశ్వనాధ శాస్త్రి.
తెలుగు సాహిత్యానికి వన్నెతెచ్చిన వీరు రావి శాస్త్రిగా పేరుపొందినవీరు,నారాయణమూర్తి, సీతాలక్ష్మి దంపతులకు 1922,జూలై 30 జన్మించారు. వీరి స్వస్థలము అనకాపల్లి చేరువలోని తుమ్మలపాలెంగ్రామంలో ఈయన తండ్రి, న్యాయవాది, తల్లి, సహితీకారిణి.
రావి శాస్త్రి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తత్వ శాస్త్రములో బీ.ఏ (ఆనర్స్) చదివి, మద్రాసు యూనివర్సిటీ నుండి 1946లో లా పట్టభద్రుడయ్యాడు. తన పితామహుడైన శ్రీరామమూర్తి వద్ద న్యాయ వృత్తి మెళుకువలు నేర్చుకొని 1950 లో సొంత ప్రాక్టీసు పెట్టుకున్నాడు. ఆరంభములో కఠోర కాంగ్రెస్ వాది అయినా 1960లలో మార్క్సిష్టు సిద్ధాంతాలచే ప్రభావితుడయ్యాడు.
1947 ప్రాంతంలోలో న్యాయవాది వృత్తిని స్వీకరించాకనే శ్రీకాకుళం, విశాఖ జిల్లాల జన జీవితాన్ని విస్తృతంగా పరిశీలించసాగాడు. పట్టణ జీవితంలో వస్తున్న పెనుమార్పులను గమనించాడు. గురజాగ, శ్రీపాదల త రువాత మాండలిక శైలిని ఆయనంత ఎక్కువగా వాడిన వారు లేరు. అమానుషత్వం పెరుగుతున్న నమాజంలో గిలగిలలాడే వారి ఆరాటాలను తన రచనలలో చిత్రించాడు. రావిశాస్త్రి కథా కథన పద్థతి చాలా పదునైనది, కాపీ చేస్తే తప్ప అనితరసాథ్యం.
తెలుగు నవలా ప్రపంచంలో విజయవంతమైన, ప్రయోగాత్మక నవలల్లో రావిశాస్త్రి రచించిన అల్పజీవి మిక్కిలి ఎన్నదగినది. జేమస్ జాయిస్ "చైతన్య స్రవంతి" ధోరణిలో వచ్చిన మొదటి తెలుగు నవల ఇది. జేమస్ జాయిస్ రచనా పద్థతిని మొదటిసారిగా తెలుగు కథలకు అన్వయించినది కూడా రావిశాస్త్రినే.
మొదటి నవలను ఆయన 1952లో రచించాడు. తరువాత రాజు మహిషీ,రత్తాలు-రాంబాబు అనే రెండు అసంపూర్ణ నవలల్ని రచించిచాడు. ఈయన జీవిత చరమాంకంలో ఇల్లు అనే నవలను రచించాడు. అయితే ఈయన రచించిన నవలల్లోకెల్లా ఈ అల్పజీవి నవలనే ఉత్తమమైన నవలగా విమర్శకులు భావించారు. ఆయన నవలల్లోకెల్లా అత్యధిక ప్రజాదరణ పొందిన నవల కూడా ఇదే.
ఆంధ్రలో మద్యపాన నిషేధ చట్టం తెచ్చి పెట్టిన అనేక విపరిణామాలను చిత్రిస్తూ ఆయన అద్భుతంగా రాసిన ఆరుసారా కథలు తెలుగు కథా సాహిత్యంలో ఒక విప్లవాన్ని సృష్టించి అందరిని ఆలోచింపచేసాయి. అధికార గర్వానికి ధనమదం తోడైతే పై వర్గం వారు ఎటువంటి దుర్మార్గాలు చేయగలరో ఆయన నిజం నాటకంలో వ్యక్తం చేసాడు.కథాసాగరం (1955)ఆరుసారా కథలు (1961
రాచకొండ కథలు (1966)ఆరుసారో కథలు (1967) రాజుమహిషి (1968)కలకంఠి (1969)బానిస కథలు (1972)
ఋక్కులు (1973)ఆరు చిత్రాలు (1974)రత్తాలు-రాంబాబు (1975)
సొమ్ములు పోనాయండి,గోవులోస్తున్నాయి జాగ్రత్త, బంగారంఇల్లు.నిజం నాటకం,తిరస్కృతి నాటిక,విషాదం నాటిక

1983 ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ కళాప్రపూర్ణ ప్రకటిస్తే దానిని తిరస్కరించాడు. అంతే కాకుండా 1966లో తీసుకున్న కేంద్రసాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చివేసారు. ఆయన కథకుడే కాదు నటుడు కూడా . ఆయన వ్రాసిన నిజం నాటకంలోను, కన్యాశుల్కంలో నాటకంలోను నటించాడు. నిజం నాటకం ఆరోజుల్లోనే, అంటే 1962 ప్రాంతంలో, వంద ప్రదర్శనలు ఇవ్వడం విశేషం.బహుముఖ ప్రజ్ఞాశాలి అయినవీరు1993
నవంబర్10 వతేదిన శాశ్విత నిద్రలో ఒరిగిపోయారు.

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్
Kuldara Mystery
కుల్ధారా మిస్టరీ
- డా:సి.హెచ్.ప్రతాప్
Kashi Prayana Kathalu - Phalitham leni Mantram
కాశీ ప్రయాణ కథలు - ఫలితం లేని మంత్రం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Prapancha Enugula Dinotsavam
ప్రపంచ ఏనుగుల దినోత్సవం
- .....బొల్లిముంత వెంకట రామనా రావు