'పురాతన భారతీయ ఆరోగ్య చిట్కాలు - ---ఆదూరి.హైమావతి.

Puratana bharatiya aarogya chitkalu

పురాతన భారతీయ ఆరోగ్య చిట్కాలు .

 

మన పూర్వులు అమోఘమైన అనేక విష్యాలను, ఆరోగ్యం కాపా డు కొను చిట్కాలనూ ఒక ఆచారం రూపంగానూ, సాంప్రదాయం గానూ చేసి అంతా అచరించేవిధంగా రూపొందించారు. అనేక మన ఆచార వ్యవహారాలన్నీ కేవలం ఆరోగ్యం కాపాడుకోటానికే అని మనం గ్రహించి వాటిని ఆచరిస్తే సుదీర్ఘ ఆరోగ్య జీవనం సాగించగలము. ఈ విధానంలో మనం కొన్ని సూత్రాలను ఇప్పుడు చూద్దాం.

1. అజీర్నే భోజనం విషం .

ముందు తిన్న ఆహారం జీర్ణం కానట్లయితే, తర్వాత ఆహారం తినడం విషంతో సమానము. తిన్న ఆహారం పూర్తిగా జీర్ణమైతేనే ఆకలవుతుంది.

ఈ విషయాన్ని గ్రహించి మనం భుజించాలి.ఐతే మనం సాధా రణంగా ఏదైనా మనకు ఇష్టమైన ఆహార పదార్థం కనిపిం చగానే ఆకలికాకున్నా తిన్న ఒక్క గంటకే మరలా తినేసి రోగాల పాలవు తున్నాం. కనుక ఎంత ఇష్టమైన ఆహారం కనిపిం చినా పిచ్చిగా తినేయకూడదని ఈక్షణం నుంచీ గుర్తుంచు కుందామా!

2. అర్ధరోగ హరి నిద్రా.- సరైన నిద్ర సగం వ్యాధులను నయం చేస్తుంది.

మనం సాధారణంగా రాత్రి తొమ్మిదికో పదికో సుష్టుగా భోజనం చేసేసి ,తేపు వచ్చినా నోట్లోకి మెతుకులు లేదా తిన్న పదార్థం వచ్చే ట్లు తినేస్తాం. వెంటనే 'భుక్తాయాసం' అని పడుకుంటాం. అదే అనేక రోగానికి కారణ మవుతున్నది.

రాత్రి భోజనం 6 లేక 7 గంటల లోపల చేసేసి ఆతర్వాత కనీసం ఒక అర్థగంటైనా నడవాలి.భోజనం సంపూర్ణంగా అరిగింది అనే భావనకలిగాకే నిద్రకు వెళ్ళాలి. బుజించాక ఎదైన గ్రంధ పఠనమో, మరోపనో చేసుకోవచ్చు, పనయ్యాక భుజిద్దామని అ ఉకోరాదు.అలాకాక పోతే తిన్న ఆహారం అరక్క నిద్రపట్టక అటూ ఇటూ పొర్లుతూ రాత్రంతా గడిపేస్తాం.తెల్లవారి పోతుంది, నిద్ర చాలదు.తిన్నది అరక్కపోడం, నిద్రలేక పోటాన శరీరం అలసట పాలై , తలనొప్పి, ఒళ్ళునొప్పులు కూడా వచ్చి, సరిగా సుఖ విరే చనం కాక శరీరంలో అనారోగం మొదలవుతుంది.

3. ముద్గధాలీ గధ వ్యాలీ.

అన్ని పప్పుధాన్యాలలో పెసరపప్పు అదీ పొట్టుతో ఉన్నదానిని తినడం మంచిది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇతర పప్పుధాన్యాలు అన్నీ కూడా ఒకటి లేదా మరొక దుష్ప్రభా వా లను కలిగి ఉంటాయి.

సాధారణంగా మనం కందిపప్పును ఇష్టపడతాం. అందువల్లే దాని ఖరీదూ పెరిగిపోయింది.మనం ఈ ఆరోగ్య సూత్రాలు చది వాక కనీసం వారానికి ఐదు రోజులు పెసరపప్పు తినడం ప్రారంభించి మిగతా పప్పులలో వున్న చెడు ప్రభావాలనుంచీ మనలను మనం కాపాడుకుందామా!

4. బాగ్నాస్తి సంధానకరో రసో నహా- వెల్లుల్లి విరిగిన ఎముకలతో కూడా చేరుతుంది.వెల్లుల్లికి వైద్య పరంగా మంచి సుగుణాలు న్నాయి. కనుక వెల్లుల్లిని ఆహారంలో చేర్చి తినాలి.వెల్లుల్లిరసం అనేక రోగాలను పొగుడు తుందని శాస్త్రజ్ఞులు కనుగొన్నా రు . ఇది యాంటీ బయాటిక్ లాగా పనిచేస్తుంది.అజీర్తికీ, చెవి నొప్పికీ , కఫం పొగొట్టు కోనూ ఇంకా అనేక వ్యాధుల నివారణకు పనిచే స్తుంది. అందుకే 'ఉల్లి చేసేమేలు తల్లి కూడా చేయలేదు' అనే సామెత వచ్చింది

5. అతి సర్వత్ర వర్జయేత్.-ఏదైనా ఎక్కువగా అంటే అనుసరించడం ఎప్పటికీ మంచిదికాదు.

బాగా రుచిగా ఉందని ఒకపదార్థాన్ని అతిగా తింటే అనా రోగ్యం రావడం ఖాయం. కనుక ఎంత రుచిగా ఉన్నా మితం గా తినాలి. హితమైన దైనా మితంగానే తినాలి. శరీర వ్యాయామం మంచి దని అతిగాచేస్తే అలసట తద్వారా అనేక చెడుపరిణామాలు కలుగవచ్చు.అలాగే చదువుకూడా విద్యార్థులు కూడా మొదటి నుండే ఒక క్రమపధ్ధతిలో చదువుతూ ఉండాలి, పరీక్షల ముందు గంటలకొద్దీ చదివితే పరీక్షలు వ్రాయను శరీరం సహకరించకపోవచ్చును.

6. నాస్తిమూలం అనౌషధం- మన కూరగాయలన్నీ శరీరానికి ఏదో ఒకవిధమైన ఔషధ ప్రయోజనం అంటే మనకు అవసర మైన విటనునులనూ ఖనిజలవణములనూ అందించి ప్రయో జనాన్ని చేకూర్చేవే కానీ ఉపకరించనివి లేనే లేవు. కనుక చేద ని కాకరకాయ, జిడ్డుగా ఉంటుంద్నై బెండకాయం, పులుపని నిమ్మకాయ, లేక మామిడికాయ, ఇలా ఒక్కో కూరగాయకూ పేర్లు పెట్టుకుంటూ అనేక ఆకుకూరలను కూడ అతినక భగవంతుడు మనకు కూరగాయలలోనూ,ఆకుకూరలలోనూ భద్రపరచి అందిం చేవాటిని కోల్పోయి ఆరోగ్యానికి దూరమవుతాముకదా!

7. న వైద్యహా ప్రభు రాయుష హ - ఎంత గొప్ప మేధావి ఐన వైద్యుడైనా మనకు దీర్ఘాయువుకు అందించలేడు .

అతడు దైవం కాదు. వైద్యులు తమ పరిమితుల మేరకే వైద్యం చేసి ఉపశమనం కలిగించగలరు. ఏవిధమనీ వైద్య సహకామ అందినా భగవతుడు ఇచ్చిన ఆయువు లేకపోతే వైద్యుడు ఏమీ చేయలేడు.కనుక మనం అనారోగ్యాలు తెచ్చుకుని, లేక పొర బాటున వచ్చిన అనారోగ్యాలకు కేవలం వైద్యునిమిదే సంపూర్ణ విశ్వాసం ఉంచకూడదు. అతనిని నిందించడం పాపం అనిగ్రహించాలి.

8. చింతా వ్యాధి ప్రకాశయ.

ఆందోళన ,చింత అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది.

మన కు సాధారణంగా ఏదైనా ఇబ్బందికలిగినా ,కష్టం వచ్చినా దానిగురించీ అతిగా ఆలోచించడం వలన నిద్రకు దూరమై , తిన్నది అరక్క అనారోగ్యం పాలవుతాము. ఎంత ఏపనిగురించీ ఆలోచించాలో అదేచేయాలి.మనం ఎంత ఆలోచించినా చింతిం చినా దానివలన సమస్య తీరదు కదా! కనుక చేయ వలసిన రీతిలో పనిచేస్తూ మిగతాది శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పినట్లు అన్నీ ఆయన కు అర్పిస్తూ చేసుకుంటూ వెళితే 'భగవంతుడే మన సమస్యలను తీర్చుతాడు.'అని విశ్వసించాలి.

9. వ్యాయామశ్చ సనైహి సనైహి

ఏ వ్యాయామ మైనా నెమ్మదిగా చేయాలి. వేగంగా వ్యాయామం చేయడంకూడా మంచిది కాదు.ఇందాక చెప్పుకున్నట్లే అతి సవత్రా వర్జయేత్ అని ఏదైన ఆతిగాచేయలూడదు. ఈ మందు వేసుకుంతే జ్వరం తగ్గుతుంది అని వైద్యుడు చెప్పగానే గంట గంటకూ ఒక్కో మాత్రవేసుకుంటే ఏమౌతుంది. ప్రతిదానికీ ఒక పధ్ధతి ఉంటుంది.దానిని తప్పక అనుసరించాలి .కనుక వ్యాయా మమూకూడా అతిగా చేయకూడదు.

10. అజవత్ చర్వణం కుర్యాత్

మేకలాగా మనం ఆహారాన్నిబాగా నమలి నమిలి తినాలి. మేకలు నెమరు వేసుకుంటాయి.దానివలన ఆహారం బాగా జీర్ణ మవుతుంది.మనమూ హడావిడిగా ఆహారాన్ని నమలకుండా ఎన్నడూ మింగ కూడదు. జీర్ణక్రియలో మొదట లాలాజలం సహా యపడుతుంది.ఆతర్వాత జీర్ణాశయం పనిచేస్తుంది. నోట్లోనే ఆహారం ఇంచు మించుగా అరిగి పక్వానికి వస్తుంది.

11. స్నానం నామా మనః ప్రశాంత కరం దుస్వప్న విధ్వం సనం.-- స్నానం సగం స్తబ్ధతను, వ్యాకులతను ,దుఃఖాన్నీ తొలగిస్తుంది. ఇది చెడు కలలను రానివ్వదు.ఎందుకంటే హాయిగా స్నానం చేసి నిద్రిస్తే మంచి నిద్రపట్టి కలలురావు కదా! గాఢ నిద్రలో మనకు ఏమీతెలియదు. అలాకమ్మని నిద్రపట్టినపుడు శరీరమూ మనస్సూ మెదడూ తగి నంత విశ్రాంతి కలిగి మంచి ఆరోగ్యాన్ని పొందుతాము.మనస్సు ఆనందంగా ఉంటుందికదా!.

12. న స్నానం ఆచరేత్ భుక్త్వా-

ఆహారం తినగానే స్నానం చేయకూడదు.దానివలన జీర్ణక్రియ సరిగా జరగదు.భుజించాక మధ్యాహ్న భోజనమై తే కొద్దిగా విశ్రాతి తీసుకోవాలి, రాత్రి భోజనమైతే నడవాలి .ఆఫ్టర్ డిన్నర్ అంటే మధ్యాహ్న భోజనం తర్వాత రెస్ట్ ఎ వైల్, ఆఫ్టర్ సప్పర్ అంటే రాత్రి భోజనం తర్వాత వాక్ ఏ మైల్ అనేమాట వినే ఉన్నాము కదా!

13. నాస్తి మేఘ సమతోయం.- వర్షపు నీరుమాత్రమే స్వఛ్ఛ మైనది. ఐతే మనకందరికీ కేవలం వర్షపునీరు మాత్రమే లభ్యం కాదుకనుక ,చకోరపక్షిలా ఉండలేము కనుక ,స్వఛ్ఛమైన నీటిని త్రాగను ప్రయత్నించాలి. కాచి వడకట్టి కుండలో పోసు కున్న నీరు త్రాగడం శ్రేష్టం.

14 అజీర్ణే భేషజం వారి -

ఎక్కువ నీరు త్రాగితే అజీర్ణం చేయదు.ఆహారం అరగను తగినంత నీరు త్రాగాలి. అలాని అన్నం తినగానే ,లేక తినే ప్పుడూ నీరు త్రాగక, ఒక గంట ముందు ,తిన్నాక గంట తర్వాత నీరు త్రాగాలి.

 

15. సర్వత్ర నూతనం శాస్తం సేవకాన్నే పురాతనం. --

ప్రతిరోజూ నిలవున్నదానిని కాక అప్పుడు వండుకున్న ఆహా రాన్నే భుజించాలి.పాత పనివారికి పని మార్చి మార్చి ఇస్తూ పోషించాలి. పాత పనులతో వారు విసిగి పోయి సరిగా చేయక పోవచ్చు.అందువలన పనులలో మార్పు చేయాలి.

16. నిత్యం సర్వ రసాభ్యాసహ. -ఉప్పు, తీపి, చేదు, పులుపు అన్ని రుచులూ ఉన్న సంపూర్ణ ఆహారాన్ని భుజించాలి. ఎందు కంటే షడ్రుచులను భగవంతుడు సృష్టిలో మనం ఆరోగ్యంగా ఉండటంకోసం సృష్టించి ఇచ్చాడు . మన శరీరానికి అవసర మైన ఈ షడ్రుచులూ ఉన్న పదార్థాలను మనం రోజూ ఆర గించి ఆరోగ్యంగా జీవించాలి.

 

17 జఠరం పూరయేత్ అర్థం అన్నాహి – పొట్ట కు సగానికి మాత్రమే భుజించాలి.సగం ఘనపదార్థం ,పావు వంతు నీరు, పావు భాగం గాలికి ఖాళీగా ఉంచాలి. కడుపునిండా వందశాతం భోజనపదార్థాలతోరుచిగా వున్న వనీ ఇష్టమైన వనీ నింపితే గాలికీ, నీతీకీ అచోటు లేక కడుపు ఉబ్బరమూ, అజీర్తీ, తిన్నవి అరిగించను జీర్ణ వ్యవస్తకు వీలుకాక అనారోగ్యం పాలవుతాము. అందుకే పెద్దలు భోజనానికి ' తేలిగ్గా కూర్చుని తేలిగ్గా లేవాలనీ చెప్తారు.

18.భుక్త్వోప విసత సంద్రా - ఆహారం తీసుకున్న తర్వాత కూర్చోకుండా కనీసం అరగంట నడవాలి. రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్రించక ,బధ్ధకంగా కూర్చోక కనీసం అర్థ గంట నడవాలి అప్పుడు జీర్ణక్రీయ సజావుగా జరుగుతుంది.

19. క్షుత్ సాధుతాం జనయతి - ఆకలి వల్ల ఆహారం రుచి పెరుగుతుంది. అనగా ఆకలైనపుడు ఆహారం చాలా రుచిగా నిపిస్తుంది.అందుకే ఆకలి రుచిఎరగదు నిద్ర శుఖమెరుగదు అనేసామెత వచ్చింది.కనుక బాగా అకలి అనిపించినపుడే తినడం శ్రేయస్కరం.

 

20. చింతా జరానాం మనుష్యానాం. -ఆందోళన వృద్ధాప్యాన్ని పెంచు తుంది.ఊరికే అన్నింటికీబాధపడుతూ ఉంటే ఆలోచనల వలన మనశరీరంలోని శక్తి క్షీణించి త్వరగా బలహీన మై వృధ్ధులం కావచ్చు. ఆలోచించి,బాధపడీ చేసేదేం ఉండదు కనుక దేని పాటికి దాన్ని జరిగిపోనివ్వాలి. సర్వం భగవంతునికి వదిలేయాలి

21 . సతం విషయ భోక్తవ్యమ్-

చేసే పనిని ఆపి వేళకు భోజనం చేయాలి. ఏదైన అపనిలో పడి ఆకలవుతున్నా, పట్టించుకోక , అధికంగా అకాల భోజనం చేయ డం మంచిదికాదు. జీర్ణ రసాలు ఊరి జీర్ణాశయాన్ని పాడుచేస్తా యి. తగినవేళాకే నిత్యం భుజించడం వలన మన ఆరోగ్యం చక్కగా ఉంటుంది.

 

22. సర్వ ధర్మేషు మధ్యమామ్.- ఎల్లప్పుడూ మధ్య మార్గాన్ని ఎంచుకోండి. దేనిలోనైనా విపరీతం వద్దు.విపరీతంగా తినడం, నడవడం, చదవడం, వ్యాయామం చేయడం , మాట్లాడటం, సంపాదించడం , ధనం ఎక్కువ ఉండటం కూడా మంచిది కాదు. అనేకానేక బాధలను కొనితెచ్చుకోడమే. కనుక మితమే హితం అని విశ్వసించి అన్నిట్లో మితంగా ఉండటం నేర్చుకుని అనారోగ్యం పాలబడక ఆరోగ్యంగా జీవిద్దామా!

ఈసూత్రాలన్నీ మన పూర్వులు ముఖ్యంగా ఋషులు మన ఆరోగ్యం కోసం చెప్పిన మాటలు . 'పెద్దల మాట పెరుగన్నం మూట 'అని విశ్వసించి వీటిని తప్పక పాటిద్దామా!

***

 

 

 

 

 

 

 

 

 

మరిన్ని వ్యాసాలు

Neti telangana lo desi chandassu ki adyudu
నేటి తెలంగాణ లో దేశీ ఛందస్సుకు ఆద్యుడు
- డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్
అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు