మలుపు తిరగని ఏనుగు “మూలమలుపు.”
అమ్జద్.
కవిలో దాగి ఉన్న ఆలోచన సరళి, పద సంపద, కవితలలోని పాదాల నిర్మాణంలోని శోభ ఏనుగు నరసింహ రెడ్డి గారి కవితలలో స్పష్టమవుతుంది. వారి కవితా సంకలనం 'మూలమలుపు ' ఓ సాహిత్య దర్పణం. వివిధ అంశాలతో కూడిన 62 కవితల ఉద్యాన వనం.
వారి కవితా ప్రయాణంలో ఎన్నో మజిలీలు. కొన్ని చోట్ల గూడారం వేసుకుంటూ వెళ్లితే ఓ చోట ‘పాలపిట్టలా ఒకరుంటారు’ అన్న కవిత కనిపిస్తుంది. ఎదురుగా వచ్చినవాళ్ళు/
ఎప్పుడూ ఎరగనట్లు నటిస్తుంటారు/సుపరిచితులంతా/అపరిచితుల్లా తప్పుకుంటారు...విప్పని మూటలోని రహస్యంలా/వాళ్ళ క్షణాలూ/ముందే రాయబడి ఉన్నాయని/తెలుసుకోవడం మరచిపోతారు. మరో పాదంలో, దసరా జమ్మి పంపకంలో/అలసిపోయాక/అరుదుగా కనిపించే/ఆహ్లాదకరమైన పాలపిట్టలా ఒకరుంటారు/అయితే ముందే వారిని గుర్తించడానికి/అసలైన విజ్ఞత కావాలి. అలాగే ‘అవతలి తీరం’ లో, ఒక దరిని వదిలినప్పుడు/నావను నమ్ముకోక తప్పదు. చివరి పాదం, ప్రయాణంలో చాలా దూరమే వచ్చాను/ఆ దరికి దూరం తరిగిపోతుంది/ఆహ్లాదకరమైన నది ఆవలి తీరం/నా కోసమే వేగంగా ఎదురొస్తున్నది.
అని అంటాడు కవి ఏనుగు.
అప్పుడప్పుడు/ప్రాచీలోకంలోకి తొంగి చూసి/వ్యత్యాసాల వేదనని తట్టుకోలేక/వర్తమానంలోకి దూకేస్తుంటారు/ఉక్కుకవచాల్ని ధరించమని భ్రమిస్తూ/మాయా వాయువుల్ని/మజా చేస్తుంటారు. మరో పాదంలో అంటాడు మనం ఉన్నచోటే ఉండి/ఒకర్కొకరం తప్పిపోతూ ఉంటాం. ‘ఒకర్నొకరం తప్పిపోతూ’ లో ఇక్కడ మహానగరాలలోని ఫ్లాట్స్, విల్లాలలోని జీవితాల్ల. అపరిచితుల్ల. పొరిగింట్లో
ఏం జరుగుతూందో తెలియదు. ఒకర్నొకరు పట్టించుకోరు! పైగా ఆరా తీయగా అనుమాన మొహంతో దర్శనమిస్తారు. మరి కొద్దిగా తన కవితను ముందుకు నెట్టి, ఆనవాళ్ల ఆత్మ ఎక్కడా కనిపించదు/కదిలించే ప్రేమ వాక్యం/ఎక్కడా పలకరించదు/కనుమరుగైన ఊరి గురుతులు/ఎంతకీ అంతుబట్టవు/అంతా సిమెంటు కీకారణ్యం/డబ్బు జెండాలెత్తిన/నిలువు బంగళాలు. చివరి పాదంలో, మనం అక్కడే తిరుగాడుతూ ఉంటాం/తిరిగిన ప్రదేశంలోనే/పదే పదే కాటగలుస్తుంటాం. కవి చెప్పిన నగ్న సత్యం.
రైతు విషాదానికి అద్దం పట్టిన కవిత, ‘అతడు, బోరు, పాప.’ పురుగు మందు/గొంతు తడిపినప్పుడో/ఉరితాడు/ఊయలలూపి
నప్పుడో/లోకం/విషాదమైతే నటించింది కానీ/అప్పుడు బోర్లలోలానే/ఎవరి కళ్ళల్లోనూ/
నీరూరలే. తర్వాతి పాదంలో అతడుత్త రైతు/అందరి నోళ్ళల్లోనూ/ఉంటాడు కానీ/ఎవరి
హృదయం లోకీ/చేరలేడు. పీడిత రైతుల వెధ ఇందులో కొట్టొచ్చేలా కనిపిస్తోంది.
‘అదే ఊరు,’ఈ కవితలో కవి తన జ్ఞాపకాలతో ఇతరుల జ్ఞాపకాలను కూడా గుర్తు చేయిస్తున్నాడు.
ఊరులో తిరుగాడిన బాల్యం నుంచి ఎదిగిన వయసుతో పాటు వృద్దాప్యం లొనికొచ్చిన వారందరికి
ఈ యాదికొచ్చిన తలంపుల తడిక. చెరువుల్లోనూ/దిగుడుబావుల్లోనూ జలం/సమస్త జీవ
జాలానికి/అందించినట్లుండేవి/నీళ్ళకు లేబిళ్ళు లేకుండేది/ఊరు తల్లివేరు/అది పైసలతో కాదు/
మమతలతో జీవించేది. మరో పాదం లో, నేను చొరవ తీసుకుంటే, ఏనుగు గారి స్వయానుభవం
అయి ఉంటుందనుకుంటాను. చూడండి పంక్తులు: కాలు విరగడానికంటే ముందే/క్లాసు రూంలో/
మనసు విరిగిందన్న సంగతి/తుంటరి ప్రేమ లేఖలు/గుర్తు చేస్తుంటై.
‘చివరి భోజనం’, కసాయిలా కుత్తుకను ఉత్తరించే ముందు/కమ్మని చివరి భోజనపు కన్నీళ్ళు పెట్టించడం/అమానుష పరిహారం. తర్వాతి పాదంలో ఉరి/నేరం కన్నా/వికృత ఘోరం. మరోచోట అంటాడు, preplanned cruel murder/Resulted in capital punishment/కార్యం వెనుక
నున్న కారణం/ఎవరికీ పట్టదు/క్షమాభిక్ష తిరస్కారం/ప్రాసికూషన్ అభీష్టమే/ఏదైనా అమాయకత్వం కలగలిసిందా అన్న/వివేచన తెలియని తలారి/దుఖంతోనే పని పూర్తి చేస్తాడు/రాజ్యం దర్పంగా ముందుకు నడుస్తుంది.
అభయ కేస్ లో నలుగురి ఉరి శిక్ష పై చివరి ఘడియ వరకు జరిగిన క్షమా భిక్ష విశ్వ
ప్రయత్నం మనకు తెలియనిదికాదు. ప్రాణం తీపి ఎలాగుంటదో మరణం కండ్లముందుచూతారసించినప్పుడే అర్ధమవుతోంది.
‘పక్షపాతి లో’, కవిత్వం చెప్పడం కష్టం/కవిత్వం మీద/కవిత్వం చెప్పడం/కవిత్వం చెప్పడం
కన్నా కష్టం
కవిత్వం టుది పవర్ ఆఫ్ కవిత్వం ఇది రెడ్డిగారి లోతైన సమీకరణం. అన్నట్లూ/కవిత్వం ఎప్పుడూ/కవి పక్షమే/కవే/ప్రజ పక్షం. చక్కని నిర్వచనం. కవికి అతని కవిత్వానికి
వారధి పాఠకుడు.
‘మెమెంటో ’, జ్ఞాపకాలు లేవు కాబోలు/ఆయన ఇంటినిండా/అనేకానేక జ్ఞాపికలు/జ్ఞాపిక అంటే/కాలం వెనక్కి తిరిగి/ప్రేమాత్మకంగా చేసే మువ్వల శబ్డం/ఇంటినిండా జ్ఞాపికలు సరే/
మదిలో చిరకాలం నిలిచే జ్ఞాపకాలు/కొన్నైనా ఉండితీరాలి. అనుభవసారం ద్వోతకమవుతోన్న కవిత. మరోకటి, ‘చెక్కడం’, శతాబ్డాల పర్యంతం/చెక్కుచెదరని/కవిత్వాన్ని చెక్కాలి/చిరకాలం గుర్తుండే/వాక్యాల్ని/
పోతపోయాలి.
‘నాన్న’, అన్నిచోట్లా దేవుడు ఉండలేక/అమ్మను సృష్టించినట్లే/ అమ్మకు శక్తినీయమని/
నాన్నను పంపించాడు. మరో అడుగు ముందుకు వేసి అంటాడు కవి, చిరువిత్తనంలా
కనిపించే నాన్నా/పెనుమర్రిలా మనపై/ప్రేమ నీడను విస్తరిస్తాడు/భావజాలపు ఇనుప గుగ్గిళ్లను/ద్రాక్షపండ్లా/అలవాటు చేస్తాడు. అమోఘం. చివరి పాదంలోని కొన్ని పంక్తులు:
దీపం నుండి/దీపం ప్రభవించినట్లు/పిల్లలకూ/నాన్నతనపు ఔదార్యాన్ని అందిస్తాడు.
నాన్న అనుభూతికి ఇదో కవితా గుబాళింపు.
డా.సి. మృణాళిని గారి పదవీ విరమణ సంధర్భంలో రాసిన కవిత 'పి ఎస్ టి యు విరీ భారతీయతనూ, పడమటి మేలిమికీ చెరిపేసిన హద్దు/స్వేచ్చకూ, సంప్రదాయానికీ కుదిరిన దోస్తానం. ఆమె గురించి అతి క్లుప్తంగా చెప్పుతూ, ఆమెకున్న సిరి,ఆమె పి ఎస్ టి యు విరి/
చెప్పని పాఠాలనూ, వినగలిగే ఛాత్రులున్న సారస్వతురాలు/కథనం, విమర్ష అనువాదపు ఆస్తులున్న సిరిమంతురాలు/ఆమె మృణాలిని/నిత్య చైతన్యశీలి. మృణాలి గారి గౌరవార్ధం
ఓపెద్ద వ్యాసం పాలపిట్ట, మార్చి 2020 లో విశదంగా రాశారు.
‘రద్దు కాయితం’ ఈ కవిత పుర్తిగా చదవాలి. నోట్లరద్దు నేపథ్యంలో రాయబడింది.
సులభమైన సామాన్య భాషలో అతిముఖ్య విషయాలు పొదిగిన కవిత ఇది. దేశం కోసం ఆయన/విదేశాలు తిర్గుతుండు/రాజ్యం కోసం ఆయన/సరికొత్త తొవ్వలు తొక్కుతుండు/
లక్షల విలువైన చొక్కా/తొడిగిన నిత్య బ్రహ్మ్మచారి/మీ కులుకుల సంసారాన్ని ఒక్కసారి ఆపేయరా/ఆయనది పేదల పక్షమని చాటేందుకు/ధనిక సమూహ శిబిరాలకు/లీకియ్యకుండానే/మంత్రమేసిండు. మరి కొంత కవితను ముందుకు నడిపించి, సన్నివేశానికి సంబధం లేని/ఎటీఎం లు విదుషకుడిలా వికటాట్టహాసం/చేస్తున్నాయి/మంత్రం బాగానే చదివిండు గాని/ఊరవతల చెట్లకు ఆయన
వేసిన గారడీ ముడి/ఊడిపోయినట్లుంది. గంభీరమైన అర్దం సులువుగా అర్ధమయ్యెలా అరటి
తొలుక వలచినోటి లో పెట్టిండు ఏనుగు.
‘ఏదో ఒక ఉగాదిన’, పండుగ రోజున జరిగే పబ్బాలు, కార్యక్రమాల గురించి రాసిన డైరీ. చివరి
పాదం లో చెప్పింది మాత్రం నగ్న సత్యం. ప్రతి ఉగాదిన/అంతా ఉంటుంది/ఏదో ఒక ఉగాదిన/
మనముండం. కాని రాబొయే ఉగాదిలో ఉండని వ్యక్తి జ్ఞాపకాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి.
‘సరిహద్దుల్ని ధిక్కరిస్తూ’, ఒక గోవు/సమస్త గోశాలల్తో/దోస్తీ కడుతుంది/పిచ్చుక/అన్ని దేశాల పిచ్చుకలతో/సంభాషిస్తుంది/అన్ని నెమళ్ళ నాట్యం/ఒకలాగే ఉంది/ కాకిభాష అంతటా ఒకటే/మనల్ని కంపార్టుమెంట్లుగా/విభజిస్తున్న భాష/వరమా? శాపమా? జిజ్ఞాన పిపాసకుడైన కవి ఏనుగు నరసింహ రెడ్డిగారి సవాల్ ఇది!
మలపుల దగ్గరి దుఃఖం : లో ఒక చోట అంటాడు, మనమెక్కడున్నామో/మన చేతుల్లో లేనట్లే/మనమెక్కడుంటే/
అక్కడి వేదికలమీదే/ నాట్యమాడాలె. Do as Romans do in Rome లా. /మనకో మనసుంటది/ తన దారిలోనే
అది/మనల్ని నడిపిస్తది. మరో స్వానుభవం అనుకుంటా! ఇద్దరం కలిసే/డబుల్ డెక్కర్/బస్సెక్కినం/కండక్టర్
నన్ను/పైకెళ్ళమంటె/ఆమె కుతకుత/ఉడికిపోయింది.
కాలేజీ రోజుల్లో జరిగిన సంఘటనై ఉంటుంది? ఇలా సమంజసమైన కవితాపాదం అయింది!
‘మూల మలుపు” ఇంటి గురించీ/వంటి గురించీ కాకుండా/ఇంకేదో/వెన్నెల లోకం వెదికినందుకు/చీకటి ముసుగు
మీద/వెలుగు రేఖ విరబూస్తుందా. కవి సత్యాన్వేషి. చివరి పాదంలో అంటాడు, మూలమలుపులో/తొవ్వకనబడదు/
మలుపు దాటాలె/తొవ్వఎట్లున్నా/ప్రయాణం సాగించాలె. నిగూడార్ధం గల మంచి సూచన. మానవ అంతర్యాన్ని
అద్దం పట్టుతోంది.
‘పారా హుషార్’, కలుపు ఒక ఉసరవెళ్ళి/ఒడుపుగా పంట రంగులో/ఒదిగిపోతుంది/ఇప్పటి కలుపుమొక్కలు/
అనేకానేక రూపాలెత్తుతై. మరో చోట, కుట్రలు మొలుస్తుంటై/పన్నాగాలు అల్లుకుంటై. అలాగే ఓ హైలైట్! శాఖలన్నీ
కలుపుతో/కలిసే ఉన్నై/కార్యాలయాలూ/విద్యాలయాలూ/పాలలో నీళ్ళ లా/ఒదిగిపోయే ఉన్నై.
నో కామెంట్స్ !?
కొన్ని కవితల చివరన కవితా కాలం పేర్కుంటే బాగుండేది.
జిజ్ఞాస పూరితుడైన ఏనుగు నరసింహ రెడ్డి తన కవితలలో జీవిత సారాన్ని విషదపరిచాడు. ఈ కవితల సంకలనం
లోని మరికొన్ని కవితలు ఆ కోవకు చెందినవి. అవి: ‘కేజ్రీపూల పరిమళం,’ ‘కవిత్వమొక ప్రపంచం’, ‘భయం,’
‘ముప్పయొక్క దీపాలు,’‘పాలపిట్ట,’ ‘జీవజలం,’ ‘గాయపడ్డాకే,’ 'జూన్ 2', 'తహసిలాఫీసు వైపు,' ఫ్యూచరంతా
రాసి పెట్టే ఉంది,' 'లోహ విహంగం,' 'అయ్యో!కవీ,' 'తెలుగు పూలు,' ‘దండుబాట’, ’రోజు’ 'ఆట గుర్రం,'
‘తెల్లారగట్ల కల,' 'డ్రెస్ రిహార్స్ ల్,' 'పోగొట్టుకొన్న చోటు.’ మొదలైనవి.
ఏనుగు నరసింహ రెడ్డి తన కవితాజ్ఞానాన్ని పాఠకులు మెచ్చేలా తనకు తోచిన రీతిలో సమయోచితంగా
కృషిచేశారు. వారి సామర్ధ్యాలు వారికే చెల్లు. ప్రస్తుతం మనసమాజంలో అలుముకున్న రుగ్మతల్ని ఛేదించ
డానికి చేసిననిష్పాక్షిక హృదయంతో అల్లిన కవితలు. వారి మంచి ప్రయత్నమే ఈ మూలమలుపు.
***