ఆలోచింపజేసేకథలు - అనీల్ ప్రసాద్, ఆకాశవాణి, వరంగల్

ఆలోచింపజేసేకథలు

నిర్ణయం...!! కథాసంపుటి రచయిత>బొందల నాగేశ్వరరావు,చెన్నై. సమీక్షకులు> అనీల్ ప్రసాద్,ఆకాశవాణి,వరంగల్ 'నిర్ణయం 'కథాసంపుటి గురించి సంక్షిప్తంగా ఇందులోని 17 కథానికల గురించి సవివరంగా సమీక్షించే ప్రయత్నం చేస్తే .... ఈ కథాసంపుటి సంపూర్ణంగా రూపుదిద్దుకోవడానికి మూడు రాష్ట్రాలు ప్రయాణించింది... కథారచన చెన్నైలో .....డి టి పి భీమవరంలో...... ముద్రణ వరంగల్లో జరిగింది. యావత్ తెలుగు నేలని చుట్టి వచ్చింది. మూడు రాష్ట్రాలకు చెందిన తెలుగు వాళ్లు అందరినీ కలుపుకు పోవాలి అనేది రచయిత నాగేశ్వరరావు గారి "నిర్ణయం" అయి ఉండవచ్చని అనిపిస్తోంది ఈ పుస్తక ప్రతులు కూడా మూడు రాష్ట్రాల్లో లభ్యమవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు రచయిత నాగేశ్వరరావు గారు చెన్నై హిందూపూర్ హనుమకొండ. అంకితం విషయంలో కూడా... తనని కథారచయిత గా మార్చిన మిత్రుడు చెన్నయ్య గారికి ఈ పుస్తకం లోని తొలి కథనీ (జూలై 73 లో అచ్చు అయినది) తను ఎదగాలి అని ఆకాంక్షించే గోపాలం మాస్టారికి బలి అన్న తన మలి కథని (ఆగస్టు 73 లో అచ్చైనది) తను ఇంకా ఎదగాలి అని ఆకాంక్షిస్తూ నిత్యం ప్రోత్సహించే డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారికి కథా సంపుటిని ఆసాంతం అంకితం చేయాలనీ నాగేశ్వరరావు గారి నిర్ణయం నిజంగా ఆయన వ్యక్తిత్వాన్ని నిరూపిస్తుంది. ఇది ప్రశంసనీయం కూడా. ఈ కథల సంపుటి లో ఏ ఒక్క కథ అయినా పాఠకుడిని కదిలించి ఆలోచింప చేయగలిగితే ధన్యుడిని అవుతా అంటూ ప్రకటించిన రచయిత "నిర్ణయం" ఎంతవరకు సఫలం అయ్యిందో తెలుసుకోవాలంటే ఈ సంపుటిలోని  కథలు అన్నింటినీ సమీక్షించాల్సిందే. ఈ సంపుటిలోని 17 కథల్లో .... కన్న బిడ్డల్ని పెంచి, పెద్ద చేయటం లోక ధర్మం. మరి పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా చేసిన తల్లి తండ్రిని అవసాన దశలో వాళ్ల ఆలనా పాలనా చూడటం కూడా ఒక ధర్మం. ఈ ధర్మం గతి తప్పినప్పుడు .... దారి తప్పినప్పుడు నాగేశ్వర రావు గారి లాంటి వాళ్ళ కలాలు కథలు రాస్తాయి. రెండు కథలు ఈ దిశగా మనల్ని ఆలోచింపజేస్తాయి. ***

మరిన్ని సమీక్షలు

kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
సిక్కోలు కధలు  రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
సిక్కోలు కధలు రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
రామబాణం (పిల్లల కథలు
రామబాణం (పిల్లల కథలు
- చెన్నూరి సుదర్శన్
Gorantha Anubhavam - Kondantha Samacharam
గోరంత అనుభవం - కొండంత సమాచారం
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
సున్నితం చంద్రికలు
సున్నితం చంద్రికలు
- రాము కోలా.దెందుకూరు.
మహాభావాలు కవితా సంకలనం
మహాభావాలు కవితా సంకలనం
- రాము కోలా.దెందుకూరు
పరిగె నుండి తమి  వరకు
పరిగె నుండి తమి వరకు
- బి.కృష్ణారెడ్డి