పరిగె నుండి తమి వరకు - బి.కృష్ణారెడ్డి

పరిగె నుండి తమి  వరకు

'పరిగె'నుండి 'తమి ' వరకూ -------------------------------------- హాగ్ మీ క్విక్ ..కథల సమీక్ష ---------------------------------------- బి .కృష్ణా రెడ్డి ------------------- డాక్టర్ గారు నమస్కారం🙏 మీరందించిన హగ్ మీ క్విక్ పుస్తకాన్ని పూర్తిగా చదివాను. అన్ని కథలు చాలా సరళంగా సాగాయి. ఎక్కడో నాలుగు గోడల మధ్య ఏసీ రూముల్లో కూర్చుని పేరుమోసిన రచయిత యొక్క నవల నుండి సేకరించిన కొంత సమాచారాన్ని, అవి దొరక్కపోతే ఇంటర్నెట్లో వెతికి కొంత, పాత సినిమాలు ముఖ్యంగా విదేశీ సినిమాల నుండి కొంత, ఇలా కొద్ది కొద్దిగా సమాచారం దొంగిలించి మేము కూడా రచయితలము అని అనిపించుకోవడానికి ఎక్కడో ఒకటి రెండు పత్రికలో ప్రచురించుకొని , లేదా ప్రసారమాధ్యమాల్లో ప్రసారం చేయించుకుంటున్న రచయితలు ఉన్న నేటి తరుణంలో మీరు అందించిన పుస్తక రచనాశైలి, పాత్రలు‌, ప్రాంతాలు , సన్నివేశాలు మరియు సంభాషణలు ప్రత్యక్షంగా రచయిత అక్కడే ఉండి ఆశువు గా రాస్తున్నారా అనే విధంగా చాలా సహజంగా ఉన్నాయి . మీ కథల యొక్క ముగింపు కూడా చివరకి మూడు ,నాలుగు వాక్యాలతో ముగిస్తుంది. చివరి వరకు కూడా కథ ఇంకా చాలా దూరం కొనసాగుతుందా అని అనిపించేటట్లు గా ఉంటూ హఠాత్తుగా ముగింపు కనిపిస్తుంది. నా ఉద్దేశం అది అసంపూర్ణం అని కాదు .అలాగే పొడిగించాల నుకుంటే పాఠకులు ఇహ చాలు రా బాబు..... అని అనుకునేటట్లు కూడా చేయవచ్చు. బహుచక్కని పరిపూర్ణత కల్పించారు. ఈ మధ్య కాలంలో నేను మధ్యాహ్నం ఒక గంట సాయంత్రం ఒకటి ఒకటిన్నర గంట జెమిని మరియు ఈటీవీ లో ఎన్నో ఏళ్లుగా కొనసా.....గుతూ వస్తున్న తెలుగు సీరియల్స్ చూడటం అలవాటయింది. అందులోని సన్నివేశాలు ...సీరియల్ ఇంతటితో అయిపోతుంది అని అనిపిస్తుంది. అప్పుడు కథకు సంబంధం లేనటువంటి ఏదో ఒక పాత్రను ఇందులో జోడించి సాగదీయటం చూస్తుంటే ఇటువంటి వారినా మనం ప్రోత్సహిస్తుంది అని అనిపిస్తుంది. ఇటు వంటి రచయితలకు మీకథలను అందిస్తే వాటికి కొంత సంబంధంలేని సన్నివేశాన్ని జోడించి వారి జీవిత కాలం అంతా నడిపించగలరు. సార్ నాకు అర్ధం కాని రెండు పదాలు మొదటిది పరిగె ,రెండవది తమి. ఇవి ఏమైనా కోనసీమ లో వాడుకలో ఉన్న పదాలా .నాకు ఎక్కడ తటస్థంచిలేదు. ధన్యవాదాలు. ---------------------------------------- బి.ఎన్ .కృష్ణా రెడ్డి సఫిల్ గూడ . సికింద్రాబాద్ .

మరిన్ని సమీక్షలు

పిల్లల ఫోటో విన్యాసాలకు కవితా దర్పణం 'ఆట విడుపు'
'ఆట విడుపు'
- సత్యగౌరి.మోగంటి
వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్, సఫిల్ గూడ
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
సిక్కోలు కధలు  రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
సిక్కోలు కధలు రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు