 
                                        పుస్తకం పేరు : ఆనందం
రచయిత : దాసరి వెంకట రమణ
పేజీలు : 120.
వెల : రూ. 120/-
ప్రచురణ : బాల సాహిత్య పరిషత్
ప్రతులకు : నవచేతన బుక్ హౌజ్,(ఫో: 040-24224454) విశాలంధ్ర బుక్ హౌజ్,(ఫో;0877-2222475, తిరుపతి)
 కంప్యూటర్ గేంస్ మధ్య చిక్కి కనుమరుగై పోతున్న బాల సాహిత్యాన్ని బ్రతికించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది...కంప్యూటర్ గేంస్ లో కావాల్సినంత వినోదం, కాలక్షేపం దొరుకుతుందేమో గానీ, భావితరాలకు నేర్పించాల్సిన నైతిక విలువలు, సామాజిక బాధ్యతలు, మన సంస్కృతి... ఇవన్నీ తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా చిన్నప్పట్నుంచే వాళ్ళకు చక్కని కథల పుస్తకాల పఠనం అలవాటు చేయాల్సిందే.... బాల సాహిత్యంలో దాసరి వెంకటరమణ గారిది అందె వేసిన చెయ్యి.. ఆయన శైలి బాగుంటుంది...పిల్లలకు చక్కగా అర్థమయ్యేట్లుగా సరళంగా ఉంటుంది..చందమామలో తరచూ కనిపించిన దాసరి వెంకటరమణ గారి కథలంటే ఇష్టపడే వాళ్ళల్లో పిల్లలే కాక పెద్దలూ ఉన్నారనటంలో అతిశయోక్తి లేదు...
అదే దాసరి వెంకట రమణ గారి కలం నుండి వెలువడిన 22 కథల అద్భుత సంకలనమే ఈ " ఆనందం "
తొలి ముద్రణ 2009 జరిగి అత్యధిక ప్రజాదరణ పొందిన ఈ సంకలనం మలి ముద్రణ 2013 లో మళ్ళీ 2015 లో జరిగింది... కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ఈ ఆనందం సంకలనంలో 22 కథలున్నాయి.... అన్నీ ఆణిముత్యాలే....పదే పదే చదివించేవే....ఒక్కోకథ ఒక్కో నీతి బోధించేదే...పిల్లలకు మంచి బహుమతి ఇవ్వలనుకున్నవారు తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని కొని పిల్లలకు ఇవ్వవచ్చు...ప్రతి వారూ దాచుకుని చదవాల్సిన పుస్తకం ఈ ఆనందం...పూవుకి తావి అబ్బినట్లు చక్కని సాహిత్యానికి చంద్ర గారి ముఖచిత్రం, లోపలి చిత్రాలు చాలా బాగున్నాయి.









