ఏంజెల్ + డెవిల్= లవర్ లఘుచిత్రం - మాధవ్

angel+devil = lover short flim

చిత్రం:  ఏంజెల్ + డెవిల్= లవర్
నటీనటులు: శ్రీనివాస్, రవిరాజా, భువన
దర్శకత్వం: నాని
సంగీతం: శ్రీవెంకట్
కెమెరామెన్:
అభి
ఎడిటింగ్: షారి

ఈ సంవత్సరం మొదట్లోనే "మార్పు" అనే చిత్రం తీసి ఎన్నో ప్రశంసలు అందుకున్న శ్రీనివాస్ గారు నటించిన మరొక చిత్రం  "ఏంజెల్ + డెవిల్= లవర్" నూతన దర్శకుడు నాని డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.  
 
కథ : శ్రీను (శ్రీనివాస్} రూం లో కూర్చుని డ్రింక్ చేస్తుంటాడు. ఇంతలో తనకి రూం కాలింగ్ బెల్ సౌండ్ వినిపిస్తుంది. డోర్ ఓపెన్ చేసి చూడగానే కొరియర్ బాయ్ (రవిరాజా} ప్రతాప్ అంటే మీరేనా కొరియర్ వచ్చింది అంటాడు. వాడు లేడు నాకివ్వు  అంటే లేదు సార్ ఎవరి కొరియర్ వారికే ఇవ్వాలి అంటాడు.సరే వాడు వచ్చే వరకూ వుండి వాడికే ఇవ్వు అని లోపలికి రమ్మంటాడు.లోపలికి వెళ్ళాకా వారిద్దరి మధ్య ఏం జరిగింది.  ప్రతాప్ ఎవరు? ఆ కొరియర్ లో ఏముంటుంది. శ్రీను ఒక్కడే కూర్చుని డ్రింక్ ఎందుకు చేస్తున్నాడు. అసలు లవర్ ఎవరు? ఏంజెల్ అని ఎందుకనిపించింది. దేనికి డెవిల్ అనిపించింది. అనే  విషయాన్ని అసక్తికరమైన కథనంతో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మీరు ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి.

నటీనటుల తీరు: ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించిన శ్రీనివాస్ చాలా సహజం గాను తన కామెడీ టైమింగ్ తో మొదటి నుంచి చివరి వరకు తానై నడిపించాడు. తన  తరువాత కొరియర్ బాయ్ గా నటించిన రవి రాజా అవసరమైనప్పుడల్లా తన లోని కామెడీని యాంగిల్స్ ని వివిధ రకాలుగా ఇచ్చి చాలా బాగా నటించాడు. తరువాత ఫీమేల్ లీడ్ చేసిన భువన పర్వాలేదు అనిపించారు. మిగతావారు వాళ్ళ పరిధి మేరకు నటించారు.

ప్లస్ పాయింట్స్:

శ్రీను - కొరియర్ బాయ్ మీద నడిచే ట్రాక్
డైలాగ్స్
సంగీతం
మైనస్ పాయింట్స్:

కథ
ఫీమేల్ లీడ్
కెమెరా వర్క్


సాంకేతిక వర్గం: కథ, కథనం, మాటలు వీటిని డీల్ చేసిన మన మేల్ లీడ్ చేసిన శ్రీనివాస్  కథ   మీద కొంచెం కేర్ తీసుకుని వుంటే బాగుండేది. కథనం బోర్ కొట్టించకుండా బాగానే రాసుకున్నారు. ఇకపోతే మాటలు గురించి చెప్పుకోవలసిన అవసరం లేదు. డైలాగ్స్ చాలా బాగున్నాయి. తరువాత దర్శకత్వం విషయానికి వస్తే మొదటి చిత్రం కనుక చాలా తడబాట్లు వున్నాయి.  అవి అన్నీ గమనించి తన తరువాత చిత్రానికి చాలా మెరుగుపరుచుకుంటే మంచిది. ఇకపోతే కెమెరా వర్క్ చేసిన అభి కూడా తన మొదటి చిత్రం కనుక తడబడుతూ పర్వాలేదు అనిపించాడు. తరువాత సంగీతం అందించిన శ్రీ వెంకట్ చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. ఎడిటింగ్ వర్క్ బాగుంది. 

తీర్పు: కథ గురించి ఆలోచించకుండా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చూడొచ్చు.    

మరిన్ని సమీక్షలు

kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
సిక్కోలు కధలు  రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
సిక్కోలు కధలు రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
రామబాణం (పిల్లల కథలు
రామబాణం (పిల్లల కథలు
- చెన్నూరి సుదర్శన్
Gorantha Anubhavam - Kondantha Samacharam
గోరంత అనుభవం - కొండంత సమాచారం
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
సున్నితం చంద్రికలు
సున్నితం చంద్రికలు
- రాము కోలా.దెందుకూరు.
మహాభావాలు కవితా సంకలనం
మహాభావాలు కవితా సంకలనం
- రాము కోలా.దెందుకూరు
పరిగె నుండి తమి  వరకు
పరిగె నుండి తమి వరకు
- బి.కృష్ణారెడ్డి