రైటర్ లఘు చిత్ర సమీక్ష - రూపినేని ప్రతాప్

WRITER || Telugu Independent Film 2017 || By Siva Krishna

చిత్రం: రైటర్
తారాగణం: తమ్మారెడ్డి భరద్వాజ్, జెమిని సురేష్ , మధు ప్రకాష్, మహేష్ విట్ట, యోగి, సుజన్, శ్యాం సుందర్, హరిత నాయుడు సంగీతం: రాజా
సినిమాటోగ్రఫీ: మనోహర్, నరేష్
దర్శకత్వం: శివకృష్ణ


కథ: సినిమా రచయిత అయిన మధు అనే వ్యక్తి దగ్గర యోగి, మహేష్, సుజన్ , వీరు ముగ్గురు ఘోస్ట్ రైటర్స్ గా చేస్తుంటారు. ఒక విషయం లో మధు చెప్పిన విషయాన్ని శివకృష్ణ ఎదిరిస్తాడు. మధుకి కోపం వచ్చి తన ఆఫీస్ నుండి బయటకి గెంటేసి నువ్వు ఎక్కడికి వెళ్ళినా బ్రతక లేవు అని బెదిరించి పంపిస్తాడు. అలా బయటకు వచ్చిన శివకృష్ణ ఏం చేశాడు. అసలు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, జెమిని సురేష్ గారు ఈ కథలో ఏం కీలక పాత్రలు పోషించారు తెలియాలంటే మీరు లింక్ మీద ఒక క్లిక్ ఇవ్వండి.

విశ్లేషణ:   సినిమా రంగంలో రచయితగా వెలుగొందాలంటే ఎన్నో అవమానాలు, కష్టాలు పడాలి అనే కథను తయారు చేసుకుని, దర్శకుడు చెప్పాలనుకున్న తీరు, చేసిన ప్రయత్నం అభినందనీయం. కాకపోతే నిజంగానే పేరు పొందిన రచయితలు తమ దగ్గర వున్న అసిస్టెంట్ రచయితలను ఇలా అవమానిస్తారు అనే విషయం అంత నమ్మశక్యంగా అనిపించదు..

ఇంకా మన చిత్రం విషయానికొస్తే దర్శకుడు అనుకున్న కథకు సరైన నటీ నటులను ఎంచుకొన్నాడు. లీడ్ రోల్ చేసిన సుజన్ చాలా చక్కగా సహజంగా నటించాడు. ఇంకా చిత్రం లో జెమిని సురేష్ గారు ఒక మంచి కీ రోల్ ప్లే చేశారు. ఆయన చెప్పిన డైలాగ్ లు చాలా బాగున్నాయి. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక గెస్ట్ రోల్ చేశారు. మిగతా నటీ నటులు అందరు వాళ్ళ పరిధి మేరకు నటించారు.

ప్లస్ పాయింట్స్: 1. నటీనటుల నటన
2. పర్వాలేదు అనిపించిన సంగీతం
3. సినిమాటోగ్రఫీ
4. డైలాగ్స్

మైనస్ పాయింట్స్: 1. కథనం
2. కామెడీ

సాంకేతిక వర్గం: రచయిత మరియు శివకృష్ణ నిజంగానే తన జీవితంలో ఎదురై వుంటాయేమో తెలియదు గానీ తన అనుకున్న కథను చక్కగా తెరకెక్కించాడు. సంగీతం పర్వాలేదు. రీ రికార్డింగ్, డైలాగ్స్ ని డామినేట్ చేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిడిటింగ్ పర్వాలేదు.  

చివరగా: ఈ రైటర్, సినిమా జీవితంలో కొత్త రచయితగా పడే కష్టాలు.  

మరిన్ని సమీక్షలు

సున్నితం చంద్రికలు
సున్నితం చంద్రికలు
- రాము కోలా.దెందుకూరు.
మహాభావాలు కవితా సంకలనం
మహాభావాలు కవితా సంకలనం
- రాము కోలా.దెందుకూరు
పరిగె నుండి తమి  వరకు
పరిగె నుండి తమి వరకు
- బి.కృష్ణారెడ్డి
ఆలోచింపజేసేకథలు
ఆలోచింపజేసేకథలు
- అనీల్ ప్రసాద్, ఆకాశవాణి, వరంగల్
కె.ఎల్.వి.ప్రసాద్
కె.ఎల్.వి.ప్రసాద్
- శ్రీ అనీల్ ప్రసాద్ (ఆకాశవాణి, వరంగల్)