సోషల్‌ వేల్యూ ఇన్వెస్టింగ్‌ - ఎక్విప్‌ ఓ సరికొత్త సంచలనం.! - .

Social Value Investing - Equip is a new sensation!

కొలంబియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ విలియం ఎమిక్‌ మరియు ప్రొఫెసర్‌ హోవార్డ్‌ బఫెట్‌ 'సోషల్‌ వేల్యూ' ఇన్వెస్టింగ్‌ అనే పుస్తకాన్ని రచించారు. విడుదలైన తర్వాత ఈ బుక్‌ బెస్ట్‌ సెల్లర్‌గా రికార్డులకెక్కింది. వారెన్‌ బఫెట్‌, బిల్‌గేట్స్‌, మైఖేల్‌ బ్లూమ్‌ బర్గ్‌లాంటి ఎందరో ఈ పుస్తకంపై రివ్యూలు రాశారు. గవర్నమెంట్స్‌ మరియు ప్రైవేట్‌ సెక్టార్‌ మధ్య కొలాబరేషన్‌కి సంబంధించిన తర్కబద్ధమైన ప్రస్థావన నేటి పరిస్థితులకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రపంచం ఎదుర్కొంటోన్న పెను సవాళ్లకు ఈ పుస్తకంలోని అంశాలు పరిష్కారం చూపుతాయి.. అని బిల్‌గేట్స్‌ తన రివ్యూలో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఈక్విటీ, ఇంటరెస్ట్‌ ఇన్‌ పబ్లిక్‌ అండ్‌ ప్రయివేట్‌ ప్రాజెక్ట్స్‌ అండ్‌ పార్టనర్‌ షిప్స్‌ - ఎక్విప్‌ ఫౌండేషన్‌, పైన పేర్కొన్న పుస్తకంలోని అంశాలకు అనుగుణంగా పని చేస్తోంది. ఎక్విప్‌ ఫౌండేషన్‌ సోషల్‌ స్పేస్‌పై సంబంధిత స్టేక్‌ హోల్డర్స్‌ కోసం వర్క్‌ షాపులు, ప్యానెల్‌ డిస్కషన్లు, డొమైన్‌ ఎక్స్‌పర్ట్‌ల ద్వారా నిర్వహిస్తోంది. సోషల్‌ వేల్యూ ఇన్వెస్టింగ్‌ బుక్‌పై తొలి ఇనీషియేటివ్‌ని హైద్రాబాద్‌లో నిర్వహించారు. కర్రి శ్రీరామ్‌ మరియు స్వప్న ప్యానెల్‌ డిస్కషన్‌ని హోస్ట్‌ చేశారు. కో - ఆదర్‌ ప్రొఫెసర్‌ విలియం ఎమిక్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరకాల ప్రభాకర్‌ (ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అల్యూమినీ ఆర్డ్‌), ఐఓబీ మాజీ సీఎంబీ ఎమ్‌. నరేంద్ర, కామన్వెల్త్‌ ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ సీఈవో రామచంద్రన్‌, బోద్‌ ట్రీ కన్సల్టింగ్‌ లిమిటెడ్‌ ఎండీ రామకృష్ణ తదితరులు ఈ ప్యానెల్‌లో ఉన్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ, 104 సేవలు - పబ్లిక్‌, ప్రయివేట్‌ పార్టనర్‌ షిప్స్‌కి సంబంధించి బెస్ట్‌ ఎగ్జాంపుల్‌ అని చెప్పారు. పదేళ్ల క్రితమే దీన్ని తాము అమలు చేసినట్లు ఆయన వివరించారు.

సోషల్‌ వర్కర్‌ సత్యవాణి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్రి శ్రీరామ్‌, స్వప్న, సిరాశ్రీ ఈ కార్యక్రమంలో పాల్గొని తమ తమ విలువైన సూచనల్ని, అభిప్రాయాల్ని అందించారు. భారతదేశం పెద్ద పెద్ద విమానాశ్రయాలు, హైవేలు, ఇతర ప్రాజెక్టులు ఈ పబ్లిక్‌, ప్రయివేట్‌ పార్టనర్‌ షిప్‌లో నెలకొల్పుతోంది. ఎక్విప్‌ వంటి డిజిటల్‌ మీడియమ్స్‌లో మైక్రో పబ్లిక్‌, ప్రయివేట్‌ పార్టనర్‌ షిప్‌ విస్తరణకు అవకాశాలు మరింత మెరుగ్గా కనిపిస్తున్నాయి. పెట్టుబడిదారులకు ఈ పరిస్థితులు ఎంతో అనుకూలంగా కనిపిస్తున్నాయి.

సభ లో కార్పొరేటు ప్రముఖుల తొ  పాటు, Gotelugu.com బన్ను తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని సమీక్షలు

వలపు తెచ్చిన తంటా..!!     కదా సమీక్ష
వలపు తెచ్చిన తంటా..!! కదా సమీక్ష
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్, సఫిల్ గూడ
దాపటెద్దు
దాపటెద్దు
- భైతి తార
Gunde Chappudu
గుండె చప్పుడు - మినీ కవితలు
- కొట్టె సుధాకర్ రెడ్డి
kaleidoscope telugu book
కలైడోస్కోప్
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
సిక్కోలు కధలు  రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
సిక్కోలు కధలు రచయిత డా:గుజ్జు చెన్నారెడ్డి
- నేత్రకంటి శ్రీనివాస యోగానంద రావు
రామబాణం (పిల్లల కథలు
రామబాణం (పిల్లల కథలు
- చెన్నూరి సుదర్శన్
Gorantha Anubhavam - Kondantha Samacharam
గోరంత అనుభవం - కొండంత సమాచారం
- డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్