దూరపుకొండ - అరవ విస్సు

Doorapukonda

ఈదరాడ హైస్కూల్ - స్టాఫ్ రూమ్ అక్కడ సంభాషణ ఇలా " ప్రసాద్ గారు ఈరోజు ఈనాడు పేపరు చూసారా ? "లేదండీ ! కృష్టారావుగారు ఏంటండీ విశేషం " "అబ్బో !గొప్ప విశేషం అనంతపురం జిల్లాలో సూర్యనారాయణ అనే మాస్టారు బదిలీ పై వేరే పాఠశాలకు వెడుతుంటే " వెళ్ళొద్దు మాస్టారు " అని విద్యార్ధులు భోరున ఎడుస్తున్నారండీ -ఆయన పిల్లల హృదయాలలో స్థానం సంపాదించుకున్న తీరు అమోఘం " " అవునండీ ఆయనకు మంచిపేరు వుంది- ఆయన రాసిన వ్యాసాలు - చేసిన కృషి చాలా సార్లు పేపర్లో చూసానండీ ! చాలామంది ఉపాధ్యాయులుకు ఆయనే స్ఫూర్తి అంటారు . ఏమైనా అభినందనీయుడు - పిల్లల్లో ఆయనకున్న అభిమానం చూస్తే ఈ జన్మకు చాలు " అన్నారు కృష్టారావుగారు బెల్ మోగడంతో క్లాసుకు వెళ్ళిపోయారు ఇరువురు. ################ వారం రోజుల తర్వాత అదే పాఠశాలలో పనిచేస్తున్న రమణ అనే లెక్కల మాస్టారును పని సర్ధుబాటులో భాగంగా పక్కనే వున్న మగటపల్లి పాఠశాలకు పంపడం జరిగింది. " సార్ వెళ్ళకండీ ! వెళ్ళకండీ !! సార్ -ప్లీజ్ సార్ ఇక్కడేవుండిపొండి- మీరు లేకపోతే స్కూల్ రాలేం సర్ ప్లీజ్ -ప్లీజ్ సర్ " అంటూ భోరున ఏడుస్తున్నారు "లేదమ్మా !నేను మరల వచ్చేస్తాగా - అక్కడ లెక్కల మాస్టారు లేరు - పాపం అక్కడ పిల్లలకు లెక్కలు ఎవరు చెబుతారు , నేను మరల ఏప్రిల్ నెలలో వచ్చేస్తా "అని సర్ధిచెప్పి రమణ వెళ్ళిపోయారు - పిల్లల భోరున -ఏడుస్తూ క్షాస్ లకు వెళ్ళిపోయారు.### ################ కృష్టారావు మాస్టారు 9 తరగతికి వెళ్ళారు -పిల్లలు కళ్ళన్నీ ఎరుపెక్కివున్నాయి మనసులో ఏదోమూలనవున్న అసూయ పొర విచ్చుకుందీ ! "ఏంటిరా బాబూ ! దారుణంగా ఎడుస్తున్నారు - కొంపతీసి రమణ పోలేదుకదా ! పోయినట్టు ఏడుస్తున్నారు - ఆయనేనా మాస్టారు ? మేంకాదా ? ఓయ్ ! ఏడ్వకండీ ఏడిస్తే బడితె పూజ, నోరుమూసుకుని కూర్చోండి " అని బెదిరించి క్లాస్ అవ్వగానే బయటకు వచ్చేసారు . ############ మరుసటిరోజు ,లంచ్ టైమ్ -కృష్టారావు ,ప్రసాద్ లు భోజనం- చేస్తున్నారు " మాస్టారు మీరు నిన్న 9 వతరగతి లో ప్రవర్తించిన తీరు బాగోలేదండీ ! పిల్లలు జరిగినదిఅంతా చెప్పారు. ఎక్కడో సూర్యనారాయణ మాస్తారు గురించి పిల్లలు ఏడిస్తే మీరు వహ్వా ! అన్నారు మన సాటి టీచర్కు అలా జరిగితే -ఆనందించాల్సింది పోయి- అవమానించడానికి ప్రయత్నించారు , పైగా మాస్టారు పోలేదు కదా! అని వెటకారం గా మాట్లాడారంట , పిల్లలు ఈ విషయం నాతో చెప్పారండి- పైగా పిల్లలందరూ వారి తల్లిదండ్రులకూ చెప్పారండీ ! నన్ను కొంతమంది తల్లిదండ్రుల కూడా అడిగారండీ " ఆయనకు గౌరవం వస్తే -మనందరకు వచ్చినట్టే కదా మాస్టారు -అసూయ అనే బాణం ఇతరులపై ఎక్కి పెట్టినా -గా యపర్చేది మనల్నే - ఎందుకలా ప్రవర్తిచ్చారండీ ! పిల్లలలోమనపట్ల చులకన భావం ఏర్పడుతుంది. మీరే ఆలోచించుకోండి. " అని చెప్పి క్షాస్ రూమ్ కు బయలుదేరారుా. "అయ్యో ! అలాగండీ మీరు చెప్పింది నిజమే - అంత లోతుగా ఆలోచించలేదండీ -మనసాటి టీచర్ ను గౌరవం రావడం అంటే మనకు వచ్చినట్టే ! పైగా ఆయనకూడా నా గొప్పతనం గురించి అన్నిచోట్ల చెబుతారంట- ఆయన నా పట్ల ఎలా వున్నారో ! నేను ఇకనుంచి ఆయన పట్ల అలావుంటా "అని చెమర్చిన కళ్ళతో కృష్టారావుగారు బయటకు వెళ్ళారు రచన అరవ విస్సు ద్రాక్షారామ

మరిన్ని కథలు

Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి
Pelli
పెళ్లి
- Madhunapantula chitti venkata subba Rao