విహారయాత్రలో వినోదం - కందర్ప మూర్తి

Viharayatralo vinodam

విహారయాత్రలో వినోదం అమిత పదో తరగతి పబ్లిక్ పరిక్షలు రాసింది. అమితకు చిత్రకళన్నా, ఫోటోగ్రఫీ అన్నా చాలా ఇష్టం. రంగురంగుల ప్రకృతి చిత్రాలు చిత్రీకరించి అనేక బహుమతులు సంపాదించింది. కూతురి సరదా చూసి తండ్రి వెంకట్రావు డిజిటల్ కెమేరా కొనిచ్చాడు. ఎప్పటి నుంచో అనుకుంటున్న అరకు విహారయాత్రను పిల్లలకు వేసంగి శలవులైనందున ప్లాన్ చేసిన వెంకట్రావు , భార్య , కొడుకు సురేష్ , కూతురు అమితతో అరకు విహార యాత్రకు బయలు దేరారు. ముందుగా రిజర్వ్ చేసుకున్న కాటేజీకి చేరుకున్నారు. అరకు వ్యాలీ పచ్చని ప్రకృతి అందాలు, టూరిస్టులు , సినేమా షూటింగులతో సందడిగా కనబడుతోంది. రైలు ప్రయాణంలో ట్రైను కొండ గుహల్లోంచి వెల్తూంటే విచిత్రానుభూతిని కలిగించింది. ట్రైను నడుస్తున్నప్పుడు ఎవరో కాళీ బిస్కెట్ రేపరు బయట పడెయ్యగా ఎండలో దాని మెరుపుకి తినే వస్తువనుకుని ఒక అడవి కోతి పరుగున రాగా దాని వెనక గుంపులు గుంపులుగా కోతులు పరుగులు పెట్టాయి. ఆ దృశ్యాల్ని అమిత తన దగ్గరున్న డిజిటల్ కెమేరాతో చిత్రీకరించింది. బొర్రా గుహల అందాల్ని షూట్ చేసింది. అరకులో ట్రైబల్ మ్యూజియం, బొటానికల్ గార్డెన్ , చాపరాయి అందాలు ఒక్కొక్క ప్రదేశం తిరిగి ఎంజాయ్ చేస్తున్నారు. ఎర్రని మోదుగ పూల సొగసులు అరకు వ్యాలీకి వన్నె తెచ్చాయి. గిరిజన గూడేల్లో నివసించే ప్రజల సంస్కృతి , సంప్రదాయాలు వస్త్రధారణ గిరిజన థింసా నృత్యం పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయి. వెంకట్రావు కుటుంబ సబ్యులు అడవి అందాల్ని చూసుకుంటూ ముందు నడుస్తుంటే వెనక నడిచి వస్తున్న అమిత తన దగ్గరున్న కెమేరాతో సుందర దృశ్యాల్ని చిత్రీకరిస్తోంది. కొంత దూరం వెళ్లాక రోడ్డు పక్కన చెట్టు నీడన ఒక పండు ముసలి అవ్వ ఉడికించిన తియ్యదుంపలు తట్ట మీద ఉంచి అమ్ముతోంది. అవ్వను చూసిన అమిత ఒక ఫోటో తియ్యాలని దగ్గరకొచ్చి కెమేరా సెట్ చేసుకుంటోంది. " ఉదయం నుంచి బోణీ కాలేదు. నీ చేత్తో బోణీ చెయ్యి తల్లీ " అంటూ దీనంగా అడిగింది అవ్వ. అవ్వ దీనావస్థను చూసిన అమిత యాబై రూపాయల నోటు ఇచ్చి నాలుగు తియ్య దుంపలు ఇవ్వమంది. " నీదే బోణీ బేరం, చిల్లర లేదు. చిల్లర డబ్బులు ఇవ్వు తల్లీ " అంది. అమితకు జాలేసింది. తన దగ్గరా చిల్లర లేదు. ముసలి అవ్వకు సహాయ పడాలనుకుంది. " అవ్వా , మొత్తం నీ దగ్గరున్న తియ్య దుంపల్ని ఈ ప్లాస్టిక్ సంచిలో పెట్టు " అని యాబై రూపాయల నోటు ఇచ్చింది. " చల్లగుండు తల్లీ! పొద్దు గూకేవరకు ఉంటేనే ఇవి అమ్ముడవుతాయి. నీ చల్లని చేత్తో మొత్తం సరుకు అమ్ముడయినాది " అని దీవించింది అవ్వ. అమిత ముసలి అవ్వని ఫోటో తీసుకుని దుంపలున్న కేరీ బేగ్ తో బయలు దేరింది. అమిత ఇంకా రాలేదని ఎదురు చూస్తున్న అమ్మా నాన్నలకు విషయం చెప్పగా వారు సంతోషించి అందరూ ఆనందంగా తియ్య దుంపలు తిన్నారు. వారు బస చేసిన కాటేజీ దగ్గర ఒక కుక్క పిల్ల తోక ఊపుకుంటూ వారు పడేసిన అన్నం ఆప్యాయంగా తింటూ అక్కడే ఉండిపోయింది. దాని ముద్దు మొహం , విశ్వాసం చూసిన అమిత తమ్ముడు తమ వెంట తీసుకు వచ్చాడు. ఫోటో పోటీలో పంపిన అవ్వ ఫోటోకు అమితకు ప్రథమ బహుమతి వచ్చింది. * * * *

మరిన్ని కథలు

Pakkinti Anitha
పక్కింటి అనిత
- తాత మోహన కృష్ణ
Vruthi dharmam
వృత్తిధర్మం
- - బోగా పురుషోత్తం
నది తోసుకుపోయిన  నావ!
నది తోసుకుపోయిన నావ!
- కొత్తపల్లి ఉదయబాబు
Kadivedu neellu.2
కడివడు నీళ్ళు . ముగింపు
- రాము కోలా.దెందుకూరు.
Kadivedu neellu.1
కడివెడు నీళ్ళు. మొదటి భాగం.
- రాము కోలా.దెందుకూరు.
Lat Lat aar
లట లట ఆర్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Ettuku pai ettu
ఎత్తుకు పైఎత్తు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Devudu soottaantadu
దేవుడు సూత్తాంటడు..! (క్రీమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్