శత్రుభయం . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

Satrubhayam

శత్రుభయం.
చిన్న తప్పెటపై దరువు వేస్తువస్తున్న కుందేలు " వినండహో ఈరోజు మన సింహరాజుగారి పుట్టినరోజు కనుక అక్కడ జరిగేవిందులో అందరు పాల్గొనాలని సింహరాజుగారి ఆజ్ఞ అని తెలియజేయడమైనదహో "అంటూ తప్పెట వాయించుకుంటూ అడవిలోనికి వెళ్ళిపోయాడు.
కుందేలు ప్రకటనవిని సింహరాజు గుహకు బయలుదేరాడు కోతి.
సింహరాజు గుహవద్దకు కోతి చేరేసరికి అక్కడ విందు ఆరగిస్తున్నరు అంతా.
" మిత్రులారా మహబలవంతుడైన మన సింహరాజుగారికి ఎవరూలేరు సాటి !మరెవరురారు పోటీ ! అందుకేమనమంతా మనరాజు గారి రక్షణలో శత్రువులభయం లేక హాయిగా జీవిస్తున్నాము "అన్నాడు నక్క. "మంత్రి వర్యా మనకు శత్రువు భయంలేదని అనుకోవద్దు, శత్రువు మనలోనే ఉండవచ్చు చూపరులకు శత్రువు బలవంతుడుగా కనిపించకపోవచ్చు ,అన్ని సమయాలు మనవికావు " అన్నాడు కోతి . " ఏమిటి మన సింహరాజును ఎదిరించి పోరాడగలిగే వారు మనఅడవిలో ఉన్నారా ? " అన్నాడు నక్కమంత్రి . " ప్రభు సమయం సందర్బం అనుకూలంగా లేనప్పుడు మనం తలవంచకతప్పదు , ఎదటి వారు బలహీనులైనా సందర్బానుసారం శత్రుకు మనం భయపడక తప్పదు " అన్నాడు కోతి
" సరే నువ్వు కావలసినంత సమయం తీసుకో నేను భయంతో గుహ వదిలి పారిపోయేలా చేయగలవా ? " అన్నాడు సింహరాజు. " ప్రభు తొందరపడకండి ఈతుంపులమారి కోతి గురించి తమకు తెలియనిదికాదు ,పంతాలకుపోయి లేని ఆపదలను కొనితెచ్చుకున్న వాళ్ళంఅవుతాము " అన్నాడు నక్కమంత్రి . "మంత్రివర్యా నాతో తలపడే ధైర్యం,బలం ఈఅడవిలో ఎవరికి ఉన్నాయి భయపడకండి నేను ప్రాణభయంతో గుహవదలి పారిపోవడం జరగదు " అన్నాడు సింహరాజు ." కోతిగారు వెళ్ళండి నేను ప్రాణభయంతో గుహవదలి పరుగుతీసేటువంటి శత్రువును తీసుకురండి " అన్నాడు సింహరాజు. " అలాగే మహరాజా తమ ఆజ్ఞ పాటిస్తాను " అనివెళ్ళాడు కోతి .
రెండురోజుల అనంతరం అడవిలో అర్ధరాత్రి సమయంలో మండుతున్న తాటాకుతో బయలుదేరిన కోతి,చెట్టుకొమ్మకు ఉన్న తేనె తుట్టెపై రెండుదెబ్బలు బంగావేసి ,తేనెటీగలు తరమడంతో వాటికి అందకుండా మండుతున్న తాటాకుతో సింహరాజు గుహలోనికి వెళ్ళిడు, కోపంతో కోతిని అనుసరిస్తు సింహరాజు గుహలోనికి వచ్చిన్న తేనెటీగలు మండుతున్న తాటాకు అడ్డంపెట్టుకున్న కోతిని ఏమి చేయలేక ,కోతి చేసిన అలికిడికి నిద్రలేచిన నక్కను,సింహం పైన వేలాది కందిరీగలు దాడిచేసి కసిగా కుట్టసాగాయి ,భాధతో కేకలు పెడుతూ నక్క,సింహం గుహవదలి ప్రాణభయంతో గుహవెలుపలకు పరుగు తీసాయి.కోపంతో కందిరీగలు వాటిని తరమసాగాయి. చేతిలోని మండుతున్న తాటిఆకును సింహరాజు గుహముందు పడవేసి వెళుతున్న కోతినిచూసిన ఆపరిసరాలలోని జంతువులు ,కోతి అన్నంత పనిచేసాడు సింహరాజును గుహవదలి పరిగెత్తించాడు నిజమే బలగర్వంతో ఎప్పుడు ఎదటివారిని తక్కువగా అంచనా వేయకూడదు ఆపద ఎప్పుడు ఏరూపంలోనైనా రావచ్చు అనుకున్నాయి ఆజంతువులన్ని.
డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.

మరిన్ని కథలు

Aaru chintachetlu
ఆరు చింతచెట్లు
- డా. భీమ మోహన రావు
Manavatwam
మానవత్వం
- సి.హెచ్.ప్రతాప్
Naa asha aakanksha
నా ఆశ-ఆకాంక్ష
- రాపాక కామేశ్వర రావు
Inner child
ఇన్నర్ చైల్డ్
- రాజు యెదుగిరి
Pavitra prema
పవిత్ర ప్రేమ
- సి.హెచ్.ప్రతాప్
Manasika vaikalyam
మానసిక వైకల్యం
- సి.హెచ్.ప్రతాప్
Pedanaanna
పెదనాన్న
- ఏ. కృష్ణమోహన్
Mrugaraju manasu
మృగరాజు మనసు
- - బోగా పురుషోత్తం