మనసారా నాదైన - హేమావతి బొబ్బు

Manasara naadaina
మా కుట్టి అంటే నాకెంతో ఇష్టం. తన ఆలోచన, నడవడిక అందరికీ భిన్నంగా ఉండేవి. ఏయ్ కుట్టి అలా వీధి చివర వరకు రారా, అంటే నేను తన బావనైనా, కాబోయే భర్తనైనా, సారి బావ, ఇటువంటివి నన్ను అడగకు అనేది. నేను తనకు ఎంతో నచ్చచెప్పాలని చూసా, వింటేనా, నాకు తనతో కలిసి నడుస్తూ ఉంటే గాలిలొ తేలిపొయినట్లు ఉండేది.అలా జీవితం చివరవరకు నడవాలని ఉండేది.
కుట్టీ మనం చిలకా గోరింకల్లా ఉన్నామంటున్నారు నా స్నేహితులు అన్నా ఓ రోజు. "చాల్లే బావా, మనమేమన్నా పక్ష్లులమా అలా ఆకాశంలో ఎగిరి పోవడానికి,కొంచెం నేల మీద నడువు బావ,"అన్నది.
నేను తన ఇంట్లో ఉన్నప్పుడు,నేనేమి అడగకున్నా నాకేమి ఇష్టమో చేసి పెట్టి కొసరి కొసరి వడ్డించేది. నాకు బిసిబేళే బాత్ ఇష్టమని బెంగుళూర్ లో ఉన్న తన స్నేహితురాలి ని అడిగి నేర్చుకొని నాకోసం వండి పెట్టింది. నామీద నీకెందుకంత ప్రేమ బంగారు మరదలా అంటే "నువ్వు నా మురళీ మనోహరుడివి బావా" అనేది.
అలాంటి నేను ఇలా మారిపొయానేంటి ?
వాడెవడో తన వెంట పడుతున్న, తనని ప్రేమించమని పోరుతున్నా, ఆ విషయం తను మా ఎదుట దాచింది. "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని వాడు చెప్పినప్పుడు "నేను నీ ప్రేమని గౌరవిస్తాను కాని నాకు నీ మీద ప్రేమ కలగడం లేదు" అని వాడి ప్రేమను తిరస్కరించిందని వాడు కక్షతో యాసిడ్ కుమ్మరించాడు.హాస్పిటల్ లో తను పడుతున్న బాధని నేను చూడలేకపోయాను.మాకొక మాట చెప్పి ఉండొచ్చు కదా అంటే వాడి చదువు,జీవితం నాశనం కాకూడదని అన్నది విరక్తిగా నవ్వుతూ. తనది అంతటి వెన్నెల లాంటి మనస్సు. కానీ నా హృదయం ఎంత కఠినమైనది.
మావయ్య వచ్చి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం అల్లుడూ అంటే నాకు లండన్ లో ఈ ఆరు నెలల ట్రయినింగ్ పూర్తయ్యాక చూద్దాం మావయ్య అని మాట దాటవేశాను. కఠిన క్షణాలలో మా కుట్టికి తోడుండక పారిపోయాను. అమ్మానాన్నకు ఫోన్ చేసేవాడిని ఎలా ఉన్నారు నాన్న అని, డబ్బులు ఏమైనా కావాలా అని అడిగేవాడిని కాని నా కుట్టి ఎలా ఉంది నాన్నా అని అడగలేక పోయాను.
మా కుట్టి చదివే క్లాస్ లో మీ భవిష్యత్తు లో మీరేమి కావాలనుకుంటున్నారో చెప్పండి అని లెక్చరర్ అడిగిన రోజు, ఒకరు డాక్టర్ అని , సైంటిస్ట్ అని, టీచర్ అని, లాయర్ అని ఎన్నో చెప్పినా, మా కుట్టెమ్మ చెప్పిన మాటకి అందరూ నిలబడి మెచ్చుకున్నారు.తను ఒక మంచి భార్య,ఒక మంచి అమ్మ కావాలని ఉంది అని అన్నది. అలాంటి మా కుట్టిని తన మనస్సు చూడక తన ఇప్పటి రూపాన్ని చూసి నేను దూరం చేసుకొంటున్నానా !
అవును, నేను చాలా పెద్ద తప్పు చేశాను.
వెంటనే నాన్నకు ఫోన్ చేసి "నాన్న నేను రెండు రోజుల లో వస్తున్నాను, ముహూర్తం పెట్టించండి"అన్నాను.ఇప్పుడు నా మనస్సు గాలిలో తేలిపోతున్నట్టు ఉంది. నా కుట్టి నా కోసం ఎదురుచూస్తుంటుంది . మీరు మా పెళ్ళికి తప్పక రండి. ఇదే నా ఆహ్వానం.

మరిన్ని కథలు

mamidi komma malli poochenulae
మామిడి కొమ్మమళ్ళీ పూచేనులే
- ప్రభావతి పూసపాటి
Avititanam evariki?
అవిటితనం ఎవరికి?
- రాము కోలా.దెందుకూరు
Kannappa
కన్నప్ప
- పుల్లేటికుర్తి కృష్ణ మోహన్
Maya pesarapappu vadalu
మాయా పెసరపప్పు వడలు
- హేమావతి బొబ్బు
The roadless travelled
ది రోడ్ లెస్ ట్రావెల్డ్
- రాపాక కామేశ్వర రావు
Veyyi roopayala jaree cheera
వెయ్యి రూపాయిల జరీ చీర
- పూర్ణిమ పెమ్మరాజు