లట లట ఆర్ . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Lat lat aar -Story picture

లట లట ఆర్ .

తనఇంటి అరుగుపైన కథవినడానీకి చేరిన ఆవీధిలోని పిల్లలు అందరికి మిఠాయిలు పంచిన బామ్మగారు. ' పిల్లలు మీకు ఈరోజు అడవుల అవస్యకతతోపాటు ఒక హస్యకథ చెపుతాను ముందుగా అడవులగురించి.... సాధారణ వృక్షం 50 సంవత్సరాల జీవిత కాలంలో సమాజానికి 15,70,000 రూపాయల విలువగల సేవాసౌభాగ్యాన్ని కలుగ చేస్తుంది.

జీవావరణ వ్యవస్థలో ప్రకృతిలోని జీవరాశుల సమతుల్యాన్ని సాధిస్తుంది. వాతావరణంలోని వాయు కాలుష్యాన్ని నియంత్రిస్తాయి. వరదలు రాకుండా నివారిస్తాయి. కలప అతి ముఖ్యమైన ఉత్పత్తి. దీనిని గృహనిర్మాణంలో, చాలా పరిశ్రమలలో ముడి పదార్థముగా వినియోగిస్తారు.

మరి కథ చెపుతాను.....అడవిలో పిల్ల జంతువులు అన్నింటిని బడిలో కూర్చొబెట్టి చదువు చెపుతున్న నక్క. ' ఈరోజు మీకు నేను చదువు ఎలా చెపుతున్నానో తెలుసు కోవడానికి ఎలుగుబంటుని, మన సింహారాజు గారు ఇక్కడకు పంపుతున్నారు , ఆయన అడిగే ప్రశ్నలకు తడబడకుండా టక టకా బదులు చెప్పాలి మీరు ' అన్నాడు.

అప్పుడే వచ్చిన ఎలుగు బంటును చూసి పిల్ల జంతువులన్ని "శుభోదయం " అన్నాయి.

" మీకు తెలుగు బాగావచ్చని నాకు తెలుసు, అందుకే మిమ్ముల్నినేను ఇంగ్లీషులో ప్రశ్నలు అడుగుతాను " అన్నాడు .

" అయ్యగారు ఇది తెలుగు బడి...ఇక్కడ ఇంగ్లీషు .." నసిగాడు నక్క.

" నాకు అన్నితెలుసు మధ్యలో మీరు మాట్లాడకండి " అని గద్దించిన ఎలుగుబంటు " రేయ్ గాడిద కొడక డాంకి కి స్పెల్లింగ్ చెప్పరా " అన్నాడు. తల గీరుకుంటూ గాడిద కొడుకు " డింగ్ డాంగ్ కీ " అన్నాడు.

కళ్ళుతిరిగిన ఎలుగ బంటి " ఏయ్ పిల్లరామ చిలుక హిట్లర్ స్పెలింగ్ చెప్పు" అన్నాడు " హెచ్ ఓ టీ యి లట లట ఆర్ " అన్నది .

" నక్కయ్య ఏంపంతులవయ్య నువ్వు ,ఇలాఐతే ఈబడిలోని విద్యార్ధులకు చదువెల వస్తుంది? సరే స్తెలింగ్ కు, స్పెల్లింగ్ నువ్వయినా సరిగ్గా చెప్పి తగలడు " అన్నాడు ఎలుగు బంటు.

"ఎస్ పి ఎల్ ఐ ఈ యంగ్ " అన్నడు నక్క .

అదివింటూనే దబ్బున కుర్చితో సహా కిందపడి సృహతప్పాడు ఎలుగుబంటి. ముంతలో నీళ్ళు తెచ్చి మొకంపై చల్లడంతో తెప్పరిల్లిన ఎలుగుబంటి ,తను కూర్చున్న కూర్చి ఊడి రాకపోవడంతో అలానే అడవికి అడ్డంపడి " లట లట ఆర్ " అని అరుచుకుంటూ పరుగుతీసాడు.

" అయ్య ఎండ తగులుతుంది తమరు రంగు మారిపోతారు " అంటూ గొడుగుతో అతని వెనుకనే పరుగు తీసాడు గాడిద.

" తిక్క కుందిరింది తెలుగు బడిలో ఇంగ్లీషు ప్రశ్నలు వేస్తే ఇలాగే ఉంటుంది" అన్నది పిల్లరామచిలుక.

ఫక్కున నవ్వారు బామ్మగారి అరుగుపైన పిల్లలు అందరూ.

డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

మరిన్ని కథలు

Nannu nadipinche uttaram
నన్ను నడిపించే ఉత్తరం
- రాము కోలా.దెందుకూరు.
Anubhavam
అనుభవం
- తాత మోహనకృష్ణ
Gummam bayata cheppulu
గుమ్మం బయట చెప్పులు
- కొడాలి సీతారామా రావు
Maal
మాల్
- తడకమళ్ళ మురళీధర్
Nachiketuni katha
నచికేతుని కథ
- హేమావతి బొబ్బు
Mosapoyina Raju
మోసపోయిన రాజు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు