డోర్ బెల్ మోగింది. వర్ధనమ్మ తలుపు తీసి గుమ్మం దగ్గర
ఉన్న పాలపేకెట్ తీసి కిచెన్లోకి తెచ్చిది.
పిల్లల్ని నిద్ర లేపి స్నానం కాలకృత్యాలకు తొందర పెడుతోంది
స్నానాల గదిలో బాత్ సోపు అరిగిపోయిందని ఒకరు, బకెట్లో
వేడి నీళ్ళు చల్లగా ఉన్నాయని మరొకరు కేకలు.
పిల్లలు బాత్ రూమ్ నుంచి బయటపడిన తర్వాత టిఫిన్లు
అవగానె స్కూలుకు వెళ్లే హడావుడి.
"అమ్మా , స్కూల్ బస్సుకు టైమయిపోతోంది. తొందరగా లంచ్
బాక్సు ఇవ్వు" కొడుకు వినోద్ కేకలు.
" రెడీ చేస్తున్నారా, నువ్వు షూస్ వేసుకో " కిచెన్లోంచి వర్ధనమ్మ
ఊరడింపు.
"అమ్మా , తొందరగా జడ వెయ్యవే. సైకిల్ లో గాలి తక్కువ
ఉంది. గాలి కొట్టించేసరికి స్కూలుకి లేటవుతుంది." కూతురు
లలిత తొందరపాటు.
పిల్లల్ని స్కూలుకు సాగనంపేసరికి, హాల్లో తాపీగా ఇంగ్లీషు
పేపరు చదువుతున్న శ్రీవారు
" వర్ధనం, ఇవాళ లంచ్ బాక్సులో కాకరకాయ వేపుడు, పెరుగు
పచ్చడి వేసి పెట్టు " ఆర్డరు.
పిల్లల్ని స్కూళ్లకు , భర్తను ఆఫీసుకీ సాగనంపేసరికి పనిమనిషి
రాములమ్మ తలుపు తడుతుంది. పనిమనషి ఇల్లు ఊడ్చి అంట్లు
తోమి బట్టలు ఉతికి ఆరేసి వెళ్లేసరికి మిగిలిన వంట సమయ
మవుతుంది. స్నానం చేసి పూజ ముగించేసరికి భోజన సమయం
ఆసన్నమవుతుంది.
కొంచం సేపు టీవీ కార్యక్రమాలు చూసి నడుం వాల్చిన తర్వాత
ఆరిన బట్టలు ఇంట్లోకి తెచ్చి మడత పెట్టడం, ఇస్త్రీకి ఇవ్వవల్సినవి
వేరు పెట్టడం చెయ్యాలి.
పిల్లలు స్కూలు నుంచి రాగానే స్నేక్స్ రెడీ చెయ్యడం, తర్వాత
రాత్రి వంటకాల ఏర్పాట్లు. రాత్రి పడుకోబోయే వరకు మిషీన్లా
ఇంటి ఇల్లాలు వర్ధనమ్మ దినచర్య.
ఇంటికి వచ్చే అతిధులకు, పండగ పర్వదినాల్లో వచ్చేపోయే
బంధువులకు అతిథి మర్యాదలు, పిల్లల చదువులు, పోషణతో
తర్వాత వాళ్ల పెళ్లిళ్లు, పురుళ్లు, మనవల ఆలనాపాలనాతో
పతిదేవుని సేవలో ఆయన రిటైర్మెంటు కూడా జరిగింది.
* * *
"వింటున్నారా, గంటనుంచి కేకేస్తుంటే వినిపించుకోరేం. ఎప్పుడూ
టివీలో రాజకీయ రచ్చ వినడం లేదంటే కాలి మీద కాలేసుకుని
ఆ ఇంగ్లీష్ పేపర్ చదవడం తప్ప మీరు చేసే నిర్వాకం ఏంటి ?
ఉద్యోగం నుంచి రిటైరై సంవత్సరం గడిచింది.
ఉధ్యోగంలో ఉన్నప్పుడు ఉదయాన్నే లేచి మీకు, పిల్లలకు
టిఫిను, లంచి బాక్సులు తయారు చేసి పంపిన తర్వాత ఇంటి
పనులతో సతమతమయేదాన్ని. పోనీ రిటైర్మెంట్ తర్వాతనైన
రైతు బజారు నుంచి కూరగాయలు తేవడం, కిరాణ సామాన్లు
తెచ్చి ఇంటి పనుల్లో సహాయపడవచ్చుగా " సుబ్బారావు గారికి
రోజూలాగె క్లాసు తీసుకుంది భార్య వర్ధనమ్మ.
"ముప్పై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ పదవీ భాద్యతలతో
అలసిపోయిన నాలాంటి సీనియర్ సిటిజన్సును ప్రభుత్వం
విశ్రాంతి తీసుకోమని ఇంటికి పంపితే నువ్విలా నన్ను
ఇబ్బంది పెట్టడం బాగాలేదు వర్ధనం." అన్నారు సుబ్బారావు.
"మరి, నాగురించి ఆలోచించేరా? పద్దెనిమిదేళ్ల వయసులో
మూడు ముళ్ల బంధంతో కన్నవారిని , తోబుట్టువుల్ని వదిలి
మీ ఇంట అడుగు పెట్టింది మొదలు మీ అమ్మనాన్నలకు సేవలు,
తర్వాత పిల్లలు, వాళ్ళ చదువులు పోషణ చేసి పెళ్లిళ్లు పురుళ్లు
మనవల సేవలు చేసేసరికి నా జుత్తు తెల్లబడింది. ఒక ఆదివారం
రోజున గాని శలవు రోజుల్లో కాని ఒక సినేమా, విహారానికి తీసుకెళ్లారా?
ఎప్పుడూ స్నేహితులు వినోదాలు ఆఫీసు పని అంటూ కాలం
గడిపేరు. నేనూ మనిషినే , నాకూ సరదాలు సంతోషాలు ఉంటాయని
ఆలోచించేరా? మీ స్వార్థమే తప్ప నా బాగోగుల గురించి
ఆలోచించలేదు. ఎప్పుడూ డబ్బు సంపాదనే కాని జీవితంలో
సుఖ సంతోషాలు కూడా ఉండాలనే ఆలోచన లేకపోయింది మీకు.
పెళ్లైన కొత్తలో అత్తగారి అదిలింపులు మామగారి మందలింపులు
తర్వాత మీ సంసార సుఖాలు, పిల్లలు పుట్టాక వాళ్ళ బాగోగులు
ఇలా సగం జీవితం గడిచిపోయింది. తర్వాత మంచాన పడ్డ
మామ గారి సేవలు ఆయన గతించాక అత్త గారి చాకిరీతో
యాబై వసంతాలు నిండేయి. ఈడొచ్చిన పిల్లలు వారి దారి వారు
చూసుకున్నారు. చివరకు గూడు వదలని పక్షులుగా మిగిలాము
ఇద్దరము.
ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఆ దీపకాంతితో ఎన్ని జీవితాలు
ప్రకాశించాయో ఆలోచించరు. కనీసం కొడికట్టిన ఆ దీపానికి
కొంతైనా తైలం పోసి వెలుగు నింపాలనే ఇంగిత జ్ఞానం లేకపోతే
ఎలా చెప్పండి. మా ఆడవాళ్లకు రిటైర్మెంట్ లేదా?
పెళ్లి అనే బంధంతో ఎవరో తెలియని వ్యక్తితో అనుబంధం
పెంచుకుని సంసారమనే సాగరంలో ఒడుదుడుకులను ఎదుర్కొని
జీవిత ప్రయాణంలో తీరానికి చేరేసరికి చివరి మజిలీ చేరువవుతుంది
ఈ జీవిత సత్యం మీకు తెలియంది కాదు. ఆప్తులు అనుబంధం
అని భవిష్యత్తు ఆలోచించకుండా ఉధ్యోగ రిటైర్మెంట్ తర్వాత
వచ్చిన డబ్బులు వెనక ముందు చూడకుండా తీపిగా మాట్లాడిన
కొడుక్కీ , కూతురికీ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని విధవ చెల్లెలికి
పంచిపెట్టేసారు.
ఎవరి స్వార్థం వారు చూసుకున్నారు.అమ్మా నాన్నలు ఎలాగున్నారోనని
పలకరించేవారు లేరు. అందుకే ముందుచూపుతో భవిష్యత్తు గురించి
ఆలోచించపోతె పరిస్థితులు ఇలాగే ఉంటాయి" మనసులోని బాధ వెళ్ళగక్కింది వర్ధనమ్మ.
జరిగిన పరిణామాలకు ఏమనలేక మౌనం వహించారు సుబ్బారావు.
సమాప్తం
బంధం అనుబంధం